‘దేశం’ దయనీయం!
ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ డౌటే
ఇతర పార్టీల్లోకి వెళ్లిన ప్రజాప్రతినిధులు
అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జీలు కరువ
గ్రేటర్ వరంగల్‌లో కనుమరుగు!
జిల్లాలో రోజురోజుకూ క్షీణిస్తున్న టీడీపీ
వరంగల్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు, నాయకులు వరుసగా పార్టీని వీడుతుండడం, కొత్తవారెవరూ చేరకపోవడంతో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. 2014 సాధారణ ఎన్నికల తర్వాత జిల్లాలో టీడీపీ బలం వేగంగా తగ్గుతూ వస్తోంది. ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్, సొసైటీ చైర్మన్, వార్డు మెంబర్.. ఇలా అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ పదవుల్లో ఉన్న వారు టీడీపీకి దూరమవుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక దగ్గరపడడంతో మిగిలిన ప్రజాప్రతినిధులు సైతం వలస బాట పడుతున్నారు. జిల్లా కీలక నేతలుగా చెప్పుకునే వారు పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోకపోవడంతో తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో అధికార పార్టీలోకి వలస వెళ్తున్నారు. దశాబ్దం క్రితం వరకు జిల్లాలో బలమైన రాజకీయ పక్షంగా ఉన్న టీడీపీ ఇప్పుడు నామమాత్రంగా మారింది. పార్టీలో ఉన్న వారే తక్కువగా అంటే.. అందులో గ్రూపుల ఆధిపత్యపోరుతో కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు.
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు.. పార్టీ జాతీయ నాయకుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ.. ఇలా వర్గాలుగా విడిపోయూరు. దీంతో సొంత ఎజెండాలే తప్ప పార్టీ గురించి నేతలు పట్టించుకోవడం లేదని కార్యకర్తలే అంటున్నారు. గ్రూపు తగాదాలతోనే మిత్రపక్షమైన బీజేపీ సైతం తమను లెక్కచేయడం లేదని వాపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసే ఆలోచన చేయని దుస్థితికి ముఖ్య నేతలే కారణమని దేశం శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుు.
రెండు స్థానాల్లోనే..
సాధారణ ఎన్నికల తర్వాత జిల్లాలో టీడీపీ బలహీనపడింది. ఆ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నా.. తర్వాత కొన్ని నెలలకే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీడీపీని వీడారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఆరు జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోగా, చైర్‌పర్సన్ ఎన్నికలో వీరంతా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు. తర్వా త ఒక జెడ్పీటీసీ సభ్యురాలు పార్టీని వీడారు. అలాగే జిల్లాలో 128 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా.. ప్రస్తుతం 80 మందే మిగిలారు. టీడీపీ తరపున గెలిచి న ఆరుగురు కౌన్సిలర్లు పార్టీకి దూరంగానే ఉంటున్నారు. నేతల వరుస వలసల తో టీడీపీ దయనీయ పరిస్థితికి చేరింది. వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలు లేని దుస్థితి నెలకొంది.
వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ ఇన్‌చార్జీగా ఉన్న దొమ్మాటి సాంబయ్య ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు. ఉపఎన్నిక ఫలితాలకు ముందే సాంబయ్య పార్టీ ని వీడుతూ కొందరు నేతల తీరుతోనే పార్టీకి ఈ దుస్థితి నెలకొందని అన్నారు. వర్ధన్నపేట(ఎస్సీ) నియోజకవర్గానికి ఇన్‌చార్జీగా ఇప్పటికీ బీసీ వర్గానికి చెం న ఈగ మల్లేశమే వ్యవహరిస్తున్నారు. దీంతో ఆరేళ్లుగా ఈ సెగ్మెంట్‌లో టీడీపీ పతనం ఆగకుండా కొనసాగుతోంది. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ఎవ రూ ముందుకు రావడంలేదు. కడియం శ్రీహరి టీడీపీని వీడిన తర్వాత ఈ సెగ్మెం ట్‌లో పార్టీకి నాయకత్వం లేకుండాపోయింది.
పరకాల నియోజకవర్గానికి ఇన్‌చార్జీ లేని దుస్థితి ఉంది. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి గత ఏడాది నవంబర్‌లో పార్టీని వీడారు. అప్ప టి నుంచి టీడీపీకి ఇక్కడ ఇన్‌చార్జీ ఎవరూ దొరకడం లేదు. వరంగల్ తూర్పు ఇన్‌చార్జీగా ఉన్న గుండు సుధారాణి నెల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో పార్టీకి నాయకత్వం లేకపోగా, ద్వితీయ శ్రేణి నేతలూ లేరు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జీగా వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. రెండేళ్లుగా నియోజకవర్గ కార్యక్రమాల్లో నరేందర్‌రెడ్డి పాల్గొన్న సందర్భం ఒక్కటీ లే దు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటుకు నోట్ల కేసులో కీలక నిందితుడైన నరేందర్‌రెడ్డి నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.