స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి ఎన్నికైన అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. బాలసాని లక్ష్మీనారాయణ(ఖమ్మం), కొండా మురళీధర్‌రావు (వరంగల్), భాను ప్రసాద్‌రావు(కరీంనగర్), నారదాసు లక్ష్మణ్ రావు (కరీంనగర్-2), పురాణం సతీష్ (ఆదిలాబాద్), డాక్టర్ భూపతి రెడ్డి (నిజామాబాద్), భూపాల్‌రెడ్డి(మెదక్), పట్నం నరేందర్‌రెడ్డి(రంగారెడ్డి), శంభీపూర్ రాజు(రంగారెడ్డి -2), కసిరెడ్డి నారాయణరెడ్డి(మహబూబ్‌నగర్)లు ప్రమాణం చేశారు. మండలి దర్బారు హాలులో గురువారం ఏర్పాటైన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నేతలు హాజరయ్యారు.