జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీం
ఖమ్మం క్రైం : నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగటానికి నడుం బిగించింది. అందులో భాగంగా సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో ఎస్పీ షానవాజ్ ఖాసీం మాట్లాడుతూ నేరాలను నియంత్రించి పోలీస్‌సేవలు విస్తృతపరిచే లక్ష్యంతో అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు , ట్రాఫిక్‌జామ్, మేజర్ ధర్నాలు, జాతరలు, ప్రకృతి వైపరీ త్యాలు జరిగినప్పుడు ఎక్కడేం జరుగుతుందో తెలుసుకొని, అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తూ తగిన సూ చనలు ఇచ్చే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు టెక్నాలజీని రూపొందిస్తున్నామన్నారు.
యువత త మ విలువైన సమయాన్ని సద్వినియో గం చేసుకొని జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో విద్యావంతులు, మేధావులతో కలిసి వారికి సరైన మార్గనిర్దేశం చేసేందుకు పోలీస్‌శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని యువతీయువకులు ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు అశోక్‌కుమార్, సురేష్‌కుమార్, వీరేశ్వరరావు, రాజేష్, రాంరెడ్డి, కవిత, సు రేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరగాళ్లకు చెక్
Published Tue, Jun 21 2016 9:19 AM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM
Advertisement