Modern Technical Knowledge
-
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరగాళ్లకు చెక్
జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీం ఖమ్మం క్రైం : నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగటానికి నడుం బిగించింది. అందులో భాగంగా సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో ఎస్పీ షానవాజ్ ఖాసీం మాట్లాడుతూ నేరాలను నియంత్రించి పోలీస్‌సేవలు విస్తృతపరిచే లక్ష్యంతో అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు , ట్రాఫిక్‌జామ్, మేజర్ ధర్నాలు, జాతరలు, ప్రకృతి వైపరీ త్యాలు జరిగినప్పుడు ఎక్కడేం జరుగుతుందో తెలుసుకొని, అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తూ తగిన సూ చనలు ఇచ్చే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు టెక్నాలజీని రూపొందిస్తున్నామన్నారు. యువత త మ విలువైన సమయాన్ని సద్వినియో గం చేసుకొని జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో విద్యావంతులు, మేధావులతో కలిసి వారికి సరైన మార్గనిర్దేశం చేసేందుకు పోలీస్‌శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని యువతీయువకులు ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు అశోక్‌కుమార్, సురేష్‌కుమార్, వీరేశ్వరరావు, రాజేష్, రాంరెడ్డి, కవిత, సు రేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో సీసీ కెమెరాలు
పుష్కరాల భద్రతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్లలో సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన పాత్ర పోషించనుంది. ఘాట్ల వద్ద ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక సీసీ కెమెరాలు లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తున్న భక్తుల్ని గుర్తించి అప్రమత్తం చేస్తాయి. దీనికి సంబంధించి అధునాతన సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని దాదాపు 258 ఘాట్లలో పుష్కరాలు జరగనున్నాయి. వీటిలో మొత్తం 250 వరకు అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు ‘4 జీ’ టెక్నాలజీ ద్వారా వీటిని ఉభయ గోదావరి జిల్లాల్లోని కంట్రోల్ రూమ్‌లతో పాటు రాజమండ్రిలో ఏర్పాటు చేసే మాస్టర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (ఎంసీసీసీ) అనుసంధానించారు. ఎంసీసీసీలో ఉండే కంప్యూటర్లలోని తెరపై ఘాట్లలో దృశ్యాలు ఎప్పటికప్పుడు కనిపిస్తుంటాయి. స్నానాలు చేసే భక్తులు ఎవరైనా ప్రమాదంలోపడితే అప్పటికే నిక్షిప్తమైన సమాచారం ద్వారా అది కంట్రోల్‌రూంకు తెలుస్తుంది. అక్కడి సిబ్బంది వెంటనే గస్తీ పోలీసులను అప్రమత్తం చేసి ప్రమాదాలను నివారిస్తారు. -
కాయ్ రాజా కాయ్..
మనుషులు మానసికంగా బలహీనమవుతారు... కుటుంబాలు ఛిద్రమవుతాయి... సంపాదనంతా దాని పాలే అవుతుంది.. అయినా తృప్తి ఉండదు.. మనసు అటే లాగుతుంది. ఎవరికివారు తనలో తానే మాట్లాడుకుంటారు... వేళ్లపై లెక్కలు వేసుకుంటారు.. తగిలిందా సంతోషం..లేకపోతే విషాదమే... ఇదంతా మట్కా మమమ్మారి మాయ.. కోట్లలో సాగుతున్న దందాతో నిర్వాహకులు శ్రీమంతులవుతుంటే, జూద మాడేవారు మాత్రం బికారులవుతున్నారు. ఇంత జరుగుతున్నా మన పోలీసులు మాత్రం మౌన మునులను మరిపిస్తున్నారు. దీని భావమేమి తిరుమలేశా!! ⇒ ఏటా రూ.100 కోట్లకు పైగా మట్కా దందా ⇒ బీటర్లకు రాజకీయ నేతల అండదండలు ⇒ నిజామాబాద్ కేంద్రంగా భారీ లావాదేవీలు ⇒ రోజు రోజుకూ వీధిన పడుతున్న కుటుంబాలు ⇒ గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యాపారం ⇒ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘వన్ అప్ టూ డౌన్... నైన్ క్లోజ్... టూ బ్రాకెట్... ఇలా వచ్చాడు. ఇక్కడ మనం దారితప్పాం’’ ఇవి మట్కా మాయలో పడి డబ్బులు తగలేసుకుంటున్న సగటు జీవి నిత్యం వల్లె వేసే మాటలు. దినసరి కూలీ మొదలు కొందరు ఉద్యోగులకు వరకు మట్కాను వ్యసనంగా మార్చుకున్నారు. ప్రతి ఒక్కరూ డబ్బు పోగొట్టుకోవడమే తప్ప సంపాదించిన దాఖలాలు లేవు.కొంతకాలం కఠినంగా వ్యవహరించిన పోలీసులు ఇటీవలి కాలంలో మట్కా వ్యాపారులను చూసీ చూడనట్లుగా వదిలేస్తుండటంతో, అమాయకుల జీవితాలు నాశనమవుతున్నాయి. నిజామాబాద్-మహారాష్ట్ర సరి హద్దు నిజామాబాద్, బోధన్, రెంజల్, ఎడపల్లి, నవీపేటతో పాటు బాన్సువాడ, వర్ని, కోటగిరి, ఆర్మూరు, పె ర్కిట్, పోచంపాడ్, బిచ్కుంద తదితర ప్రాంతాలలో మట్కా జడలు విప్పి ఆడుతోంది. పట్టణాలను, గ్రామాలను అల్లకల్లోలం చేస్తోంది. నిజామాబాద్ నగ రంలో వీధి వీధికి విస్తరించిన ఈ జూదం కుటుంబాలనే చిదిమేస్తోంది. పోలీసులు మొదట దాడులు బాగానే జరిపినా,పూర్తి స్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. నిర్వాహకుల నుంచి కొందరికి పెద్ద ఎత్తున అందుతున్న నెలవారీ మామూళ్లే ఇందుకు కారణమనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సరిహద్దులో విచ్చలవిడిగా ముఖ్యంగా సరిహద్దు గ్రామాలలో మట్కా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అందులో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మట్కా వైపు యువత ఆకర్షణకు దోహదపడుతోంది. జిల్లాలో ఏడాదికి రూ.100 కోట్లకు పైగా జూదం కొనసాగుతున్నా పోలీసులు ప్రేక్షకులుగా మారుతున్నారన్న ఆరోపణలున్నాయి. ముంబాయి ప్రధాన కేంద్రంగా, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలు కళ్యాణి, బాంబే మట్కా కంపెనీల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ధర్మాబాద్, బిలోలి, నర్సి,నయా గామ్, పూసల్, అకోలా ప్రాంతాలకు చెందిన వ్యాపారుల దందా పోలీసులలో కలవరం కలిగిస్తోంది. జిల్లాలో నెలకు రూ. ఎనిమిది కోట్ల నుంచి రూ. పది కోట్ల మట్కా జూదం కొనసాగుతుంది. రూపాయికి తొమ్మిది రూపాయలతో నడిచే సింగిల్ డిజిట్ నంబర్, ఓపెన్, క్లోజింగ్ నంబర్లపై జూదం నడుస్తోంది.ఓపెన్, క్లోజింగ్ నంబర్లతో బ్రాకెట్ నంబర్‌కి వందరెట్ల చెల్లింపులని చెబుతారు. కార్మికుల నుంచి కాంట్రాక్టర్లు వ్యాపారుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఇందులో పాత్రధారులే. ప్రభుత్వ ఉ ద్యోగులు జీతం డబ్బులు పెట్టి అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. దశాబ్ధ కాలంగా సెల్యూలర్ ఫోన్ల వినియోగం పెరగడంతో యువకులు అధిక సంఖ్యలో మట్కాకు ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడా భయం లేదు మట్కా అడ్డాలకు వెళ్లాలంటే యువకులు భయపడేవారు. ఇప్పుడా భయం లేదు. ఎందుకంటే సెల్‌ఫోన్ మెసేజ్‌ల ద్వారానే ఫలితాలు వెల్లడవుతున్నాయి. సెల్ఫోన్లో ఎస్ఎంఎస్లు, కళ్యాణి మట్కా మధ్యాహ్నం రెండు గంటలకు ఓపెనింగ్, నాలుగు గంటలకు క్లోజింగ్ నంబర్లను ప్రకటిస్తుంది. అదే విధంగా బాంబే మట్కా కంపెనీ ఓ పెనింగ్ తొమ్మిది గంటలకు, రాత్రి పన్నెండు గంటలకు క్లోజింగ్ నంబర్లను ప్రకటిస్తుంది. అర్ధరాత్రి సమయానికి వచ్చిన నంబర్లు తెలిసే సరికి ఆలస్యం కారణంగా జూదరులకు మాత్రమే మట్కా పరిమితమయ్యేది. ఆధునిక కాలంలో సమాచార వేగం వృద్ధి చెందడం, సింగిల్ డిజిట్ నంబర్ల లాటరీలపై నిషేధం ఉండడంతో ఈ మట్కా జూదంలో జూదరులతోపాటు యువకులు డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. గతంలో లక్షల్లో జరిగే మట్కా వ్యాపారం ప్రస్తుతం కోట్ల రూపాయల్లో కొనసాగుతోంది. సామాన్యులే పావులు నిజామాబాద్‌లో రైల్వేస్టేషన్, మిర్చికాంపౌండ్, కోటగల్లి, మైసమ్మగడ్డ, కసాబ్‌గల్లీ, బోధన్‌లో హెడ్ పోస్టాఫీసు, రెంజల్లో బేస్ ఏరియా, ఎడపల్లి, జానకంపేట, నెహ్రునగర్ ప్రాంతాలు ‘బుకీ’లకు అడ్డాలుగా ఉన్నాయి. బాన్సువాడ, వర్ని, కోటగిరి ప్రాంతాలలో ఎక్కువగా దినసరి కూలీలు, సామాన్యులు మట్కాకు ఆకర్షితులు కాగా, దెగ్లూరు నుంచి ‘బుకీ’లు, ఏజెంట్లు వచ్చి లావాదేవీలు జరుపుతున్నారు. ఐదేళ్ల క్రితం ఆర్మూరు, పెర్కిట్, పోచంపాడ్‌లో విచ్చలవిడిగా సాగి, తగ్గిన మట్కా మహమ్మారి మళ్లీ పురుడు పోసుకుంది. కామారెడ్డి ప్రాంతానికి చెందిన పలువురు ఇతర ప్రాంతాలకు ‘కాయ్ రాజా కాయ్’ అంటూ బుకీలను ఆశ్రయిస్తున్నారు. కాగా, ఈ సరిహద్దులో జోరుగా సాగుతున్న ఈ మట్కా వ్యాపారాన్ని అంతర్రాష్ట్ర పోలీసు నిఘాతోనైనా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
అధినేతలకు అర్జీలు... ఒక్క క్లిక్‌తో..
కనీసం గ్రామ కార్యదర్శికి సమస్య విన్నవించాలంటేనే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్న రోజులివి. వినతి పత్రం ఇవ్వడానికి పనులు మానుకొని, అనేక వ్యయప్రయాసలకోర్చి గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి, అక్కడ అమాత్యులు, అధికారులు కనిపించకపోతే పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఇటువంటి కష్టాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెక్ పడనుంది. ముఖ్య నేతలకు ప్రజలు తమ గోడు వినిపించుకోడానికి వారధిగా నిలుస్తోంది ఆన్లైన్. కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉండి.. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. ఇంట్లో నుంచి కాలు కదపకుండానే రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులకు ఒక్క క్లిక్‌తో తమ సమస్యపై విన్నపం పంపుకోవచ్చు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా గవర్నర్‌కు ఇలా పంపాలి... aprajbhavan@gmail.com మెయిల్‌కు ఫిర్యాదుదారుడు తమ పూర్తి చిరునామాతో సమస్యను సంక్షిప్తంగా నేరుగా పంపవచ్చు. ⇒ఇంటర్నెట్ ఉంటే చాలు.. ⇒ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు ⇒సీఎం, గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతికీ చిటికెలో విన్నపం రాష్ట్రపతికి పంపాలంటే... రాష్ట్రపతికి వినతిపత్రం పంపాలంటే www.presidentofindia.nic.in వెబ్సైట్లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే అడుగుభాగంలో కుడిపైపు హెల్ప్‌లైన్ పోర్టల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ సెక్రటేరియట్ అనే పేజీ తెరుచుకుంటుంది. అక్కడ కనిపించే ‘లోడేజ్ ఏ రిక్వెస్ట్’మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. దాన్ని నింపి గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ అనే బాక్సులో 4000 పదాలకు మించకుండా సమస్య వివరించి పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి. ఈ క్రమంలో మన ఫిర్యాదుకు సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన సమస్య పరిష్కారం అయిందో కాలేదో తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ సంఖ్య ఉపయోగపడుతుంది. ప్రధానికి ఫిర్యాదు చేయాలంటే.. దేశ ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.pmindia. gov.in వెబ్సైట్లోకి వెళ్లి సమస్యలను విన్నవించవచ్చు. పేజీ ఓపెన్ చేయగానే ‘ఇంటరాక్ట్ విత్ హానరబుల్ పీఎం’ వస్తుంది. క్లిక్ చేస్తే ‘టు రైట్ టు ది ప్రైమినిస్టర్ క్లిక్ హియర్’ అనివస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చిరునామాతోపాటు ఈ మెయిల్ ఐడీ లింక్ ఉంటుంది. ‘క్లిక్ హియర్’అన్న చోట క్లిక్ చేస్తే ‘కామెంట్స్’ అనే పేజీ తెరుచుకుంటుంది. ఫిర్యాదు దారుడి వివరాలు, ఈ-మెయిల్, ఫోన్ నంబర్‌ను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పేజీలో 1000 అక్షరాలలోపు సమస్యను వివరించి దిగువ భాగాన ఉన్న కోడ్‌ను నమోదు చేయాలి. ముఖ్యమంత్రికి సమస్య విన్నవించాలంటే .. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే ఎడమవైపు దిగువ భాగంలో సిటిజన్ ఇంటర్ ఫేస్ అనే పోర్టల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ మెయిల్ ఐడీని నమోదుచేసి సంబంధిత విషయాన్ని క్లుప్తంగా వివరించాలి.