'మోదీ చాయ్‌వాలా కాదు, సూట్ వాలా!' | modi was suit wala' says suravaram prathap reddy | Sakshi
Sakshi News home page

'మోదీ చాయ్‌వాలా కాదు, సూట్ వాలా!'

Published Thu, Mar 5 2015 4:47 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

modi was suit wala' says suravaram prathap reddy

యాదగిరిగుట్ట: ప్రధాని నరేంద్ర మోదీ చాయ్ వాలా కాదని, ఆయన ఖరీదైన సూట్ వాలా అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరుగుతున్న ఆ పార్టీ జిల్లా 20వ మహాసభల్లో  పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.  మోదీ చాయ్‌వాలా కాదని , ఓ హోటల్ యజమాని కుమారుడని పేర్కొన్నారు. మోదీ రోజుకు 6సార్లు దుస్తులు మార్చుకుంటారని, అలాంటి ఆయన పేదల గురించి ఏం ఆలోచిస్తారని ప్రశ్నించారు. బీజేపీ కార్పొరేట్ శక్తులు, మీడియా సహకారంతో అధికారంలోకి వచ్చిందన్నారు.  దేశంలోని 825 చానళ్లకు డబ్బులు ఇచ్చి ఎన్నికల్లో  తమ వార్తలు ప్రసారం చేయించుకున్నారన్నారు.ముఖ్యంగా ఈటీవీ, ఈనాడు పత్రికలో బీజేపీకి వ్యతిరేకంగా వార్తలుండవన్నారు. ఈనాడు మీడియాలో రూ.1200 కోట్ల పెట్టుబడులు వచ్చేలా బీజేపీ సహకరించిందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement