మెదక్ (సిద్దిపేట రూరల్): ఏటీఎం పోవడంతో అందులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డ్రా చేశారు. ఈ సంఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు సోమవారం రూరల్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ కేసు నమోదు చేశారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన కూరెళ్ల మల్లారెడ్డి కుటుంబ సమేతంగా మే 26న తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. దర్శనానంతరం అదే నెల 31న ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో అతన్ని వద్ద ఎస్‌బీఐ ఏటీఎం కనపడకుండా పోయింది. వెంటనే బాధితుడు స్థానిక ఎస్‌బీహెచ్ బ్రాంచ్‌కు వెళ్లి అతని అకౌంట్ వివరాలు తెలుసుకున్నాడు. తిరుమలలో రూ. 40వేలు, విజయవాడలో రూ. 40వేలు, భువనగిరిలో రూ. 48వేలను డ్రా చేశారు. దీంతో బాధితుడు మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.