భవిష్యత్తులో మరిన్ని సేవలు
జహీరాబాద్: పక్షం రోజులుగా జహీరాబాద్‌లో నిర్వహించిన లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ వైద్య శిబిరం విజయవంతమయ్యిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని మహీంద్రా సోషల్ రెస్పాన్స్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ సుశీల్‌కుమార్‌సింగ్ అన్నారు. సోమవారం స్థానిక మహీంద్రా ఆడిటోరియంలో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ వైద్య శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇంపాక్ట్ ఇండియా వారు ఏర్పాటు చేసిన లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ఉచిత వైద్య శిబిరానికి మహీంద్రా తరఫున పూర్తి సహకారాన్ని అందించామన్నారు. రోగులకు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.
పేదలకు తగిన సేవలందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ రజనీష్ మాట్లాడుతూ మహీంద్రా యాజమాన్యం ముందుకు రావడం వల్లే లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ వైద్య శిబిరం సక్సెస్ అయ్యిందన్నారు. రోగుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. వైద్య శిబిరంలో రోగులకు సేవలందించిన మహీంద్రా వలంటీర్లకు ఈ సందర్భంగా సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో మహీంద్రా కర్మాగారం ప్రతినిధులు కె.పి.ఎన్.రావు, రామారావు, కృష్ణన్ అయ్యర్, ప్రదీప్‌గౌడ్, వినోద్‌కుమార్‌లు పాల్గొన్నారు.
7,342 మందికి వైద్య పరీక్షలు..
జహీరాబాద్‌లోని రైల్వేస్టేషన్ ఆవరణలో నిర్వహించిన లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ వైద్య శిబిరంలో 7,342 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 1,255 మందికి చికిత్సలు చేశారు. ఈనెల 6న శిబిరాన్ని ప్రారంభించగా, 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రహణం మొర్రికి సంబంధించి 21 మందికి వైద్య పరీక్షలు చేయ గా, 10 మందికి ఆపరేషన్లు నిర్వహిం చారు. చెవికి సంబంధించి 902 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 52 మందికి చికిత్సలు, ఆపరేషన్లు చేశారు. కంటికి సంబంధించి 4,645 మందికి పరీక్షలు చేయగా, 592మందికి ఆపరేషన్లు నిర్వహించారు.
దంతాలకు సంబంధించి 1,560 మందికి పరీక్షలు చేయగా, 441 మందికి చికిత్సలు జరిపారు. మూర్చ రోగానికి సంబంధించి 214 మందికి పరీక్షలు నిర్వహించి, 160 మందికి చికిత్సలు చేశారు. జిల్లాలోనే రైల్వే శాఖ మొదటిసారిగా లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా వైద్యశిబిరం నిర్వహిం చింది. మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించేందుకు వీలుగా రైల్వే శాఖ ఈ కార్యక్రమం చేపట్టింది. లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌ద్వారా దేశంలో ఇప్పటి వరకు సుమారు 9లక్షల మందికిపైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలందించినట్టు వివరించారు. ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా 1991లో రైల్వేశాఖ లైఫ్‌లైన్ ఎక్‌రరపెస్ వైద్య సేవలను ప్రారంభించింది. స్వచ్ఛంద సంస్థల సహకారంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది.