'కేంద్రంతో పొత్తులు.. ఎత్తులు కేసీఆర్ చూసుకుంటారు' | mp kavitha comments | Sakshi
Sakshi News home page

'కేంద్రంతో పొత్తులు.. ఎత్తులు కేసీఆర్ చూసుకుంటారు'

Published Sun, Feb 8 2015 2:21 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'కేంద్రంతో పొత్తులు.. ఎత్తులు కేసీఆర్ చూసుకుంటారు' - Sakshi

'కేంద్రంతో పొత్తులు.. ఎత్తులు కేసీఆర్ చూసుకుంటారు'

నిజామాబాద్: కేంద్రంతో పొత్తులు, ఎత్తులు ఏమైనా ఉంటే సీఎం కేసీఆర్ చూసుకుంటారని ఎంపీ కవిత స్పష్టం చేశారు. కేంద్రంతో తమకు విభేదాలు లేవంటూనే.. తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా వ్యతిరేక నిర్ణయాలు వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కవిత.. భవిష్యత్తులో తెలంగాణలో ఏ పార్టీకి మనుగడ ఉండదన్నారు. ప్రజల అవసరాల కోసమే ఛాతి ఆస్పత్రిని తరలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

బీడీ కట్టలపై పుర్రె గుర్తు తొలగించేందుకు పోరాటం చేస్తామని కవిత తెలిపారు. తెలంగాణకు విద్యుత్ ఇచ్చే అవకాశం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఇవ్వలేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement