ఎంపీడీఓ వైఖరికి నిరసనగా ఎంపీపీ ధర్నా
టీఆర్‌ఎస్ నాయకుల చొరవతో విరమణ
కమీషన్ అడిగారని ఆరోపణ
నర్మెట : ఎంపీడీఓ వైఖరికి నిరసనగా గురువారం మండల పరిషత్ కార్యాలయం గేటుకు తాళం వేసి ఎంపీపీ భూక్య పద్మ జయరాంనాయక్, ఎంపీటీసీ సభ్యులు ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎంపీపీ భూక్య పద్మ మాట్లాడుతూ వారం రోజుల క్రితం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో రూ.2లక్షలతో సీసీరోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనికి ఎంబీ రికార్డు, చెక్ మెజర్ అరుునప్పటికీ ఎంపీడీఓ రమాదేవి సంతకం పెట్టడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రూ.లక్షకు రూ.10వేల చొప్పున కమీషన్ అడుగుతున్నట్లు తెలిపారు. రెండు గంటలపాటు బైఠాయించా రు.
అమ్మపురం, హన్మంతాపూర్ ఎంపీటీసీ సభ్యులు జొన్నగోని కిష్టయ్య, పోలెపాక తిరుపతి, నాయకులు బుడ్డ భాస్కర్, దరావత్ బిక్షపతి, టీడీపీ మండల అధ్యక్షుడు ఏడెల్లి శ్రీని వాస్‌రెడ్డి, పలు పార్టీల నాయకులు ఎంపీపీకి మద్దతుగా పాల్గొన్నారు. పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎండీ.గౌస్ సర్దిచెప్పి ధర్నా విరమింపజేశారు. కాగా ఎంపీడీఓ రమాదేవిని వివరణ కోరగా తాను ఎవరి దగ్గర ఒక్క రూపారుు కూడా తీసుకోలేదని, అడ్వాన్స్‌గా సీసీరోడ్డు బిల్లు ఇవ్వకపోవడం వల్లే ఎంపీపీ భర్త ఈచర్యలకు పాల్పడుతున్నాడని అన్నారు.
ఆత్మహత్యా యత్నం
పనులకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని బుధవారం అర్ధరాత్రి భూక్య పద్మ భర్త జయరాంనాయక్ ఆత్మహత్య యత్నానికి ప్రయ త్నం చేయడం సంచలనం సృష్టించింది. ఎంపీడీఓ చర్యలకు మనస్థాపానికి గురై మల్లన్న గండి రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఎంపీపీ భర్త సన్నిహితులకు ఫోన్‌చేసి చెప్పాడు. వారు నర్మెట ఎస్సై జలగం లక్ష్మణ్‌రావుకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసుల తోపాటు పలువురు రిజర్వాయర్ వద్ద వెతకగా కనిపించాడు. అతడికి సర్దిచెప్పి ఇంటికి తీసుకువచ్చారు. ఉదయం ఎంపీడీఓ వైఖరికి నిరసనగా ఎంపీపీ దంపతులు ఎంపీడీఓ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు.