'తెలంగాణను మోసం చేయాలనుకోవడం బాబుకు తగదు' | nagam janardhan reddy takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'తెలంగాణను మోసం చేయాలనుకోవడం బాబుకు తగదు'

Published Thu, Dec 4 2014 12:27 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

'తెలంగాణను మోసం చేయాలనుకోవడం బాబుకు తగదు' - Sakshi

'తెలంగాణను మోసం చేయాలనుకోవడం బాబుకు తగదు'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ బీజేపీ కాపాడుతుందని ఆ పార్టీ నేత నాగం జనార్థనరెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల తాగునీరు కొల్లగొట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నిస్తోందన్నారు. బీమా ప్రాజెక్టు ఆపాలనకోవడం సహేతుకం కాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

తమ కేటాయింపులే తమకే రావాలని నాగం డిమాండ్ చేశారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్నారు. తెలంగాణను మోసం చేయాలనుకోవడం చంద్రబాబుకు తగదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement