సాక్షి, నల్గొండ: ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ డ్యామ్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్యామ్ ఆరు క్రస్ట్ గేట్లను పది అడుగుల ఎత్తు వరకు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం సాగర్‌లో ఇన్ ఫ్లో 1,51765 క్యూసెక్కుల ఉండగా.. ఔట్ ఫ్లో 1,39,9908 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 589.50 అడుగులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 310.5510 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment