కేస్లాపూర్,(ఆదిలాబాద్): అడవితల్లి ఒడిలో కొలువై ఆదివాసులు కొంగుబంగారంలా కొలుచుకునే నాగోబా జాతరను తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితో పాటు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, బాబురావులు పూజల్లో పాల్గన్నారు.
ఆదిలాబాద్‌తో పాటు మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌ల నుంచి వేలాదిగా తరలి వచ్చిన వివిధ తెగల ఆదివాసీలతో జాతర కిటకిటలాడుతోంది. ఈ నెల 27 వరకు నాగోబా జాతర కొనసాగుతుంది.