మెడికల్‌ కళాశాలలో  పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ | Nalgonda Government Medical Colleges Jobs Vacancies | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కళాశాలలో  పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

Published Fri, May 10 2019 12:05 PM | Last Updated on Fri, May 10 2019 12:05 PM

Nalgonda Government Medical Colleges Jobs Vacancies - Sakshi

నల్లగొండ టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి అనుబంధంగా మంజూరు చేసిన మెడికల్‌ కళా శాలలో పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కళాశాల భవన ఆధునికీకరణ పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పనులను పూర్తి చేసిన అధికారులు పోస్టుల భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. రెగ్యులర్‌ పద్ధతిన వివిధ విభాగాల్లో 952 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా మరో 237 పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.
 
కళాశాలలో 32 విభాగాలు..
మెడికల్‌ కళాశాలలో 32 విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో అటానమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫార్మకాలజీ, ఎఫ్‌ఎం, కమ్యూనిటీ మెడిసిన్, ఆర్‌హెచ్‌టీసీ, యూహెచ్‌టీసీ, సైకియాట్రి, పిడియాట్రిక్, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, ఓపీటీహెచ్, ఓబీజీ, రేడియో డయాగ్నొస్టిస్, అనస్తీషియా, బ్లడ్‌బ్యాంక్, సెంట్రల్‌ రికార్డ్, సెంట్రల్‌లైబ్రరీ, మెడికల్‌ ఎడ్యుకేషన్,సెంట్రల్‌ ఫొటోగ్రఫిక్‌ కమ్‌ ఆడియో విజువల్, సీఎస్‌ఎస్‌డీ, లాండ్రీ, సెంట్రల్‌ వర్క్‌షాప్, హాస్పిటల్‌ మెడికల్‌ అడ్మినిస్ట్రేషన్, ఈఎండీ, మార్చురి, ప్రిన్సిపాల్‌ ఆఫీస్, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ఆఫీసుల్లో పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పోస్టులు భర్తీ చేయడానికి జీఎఎంఎస్‌ నం.77ను ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. దీనికి అవసరమైన అన్ని అనుమతులను ఆర్థికశాఖ నుంచి పొందింది.

ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన భర్తీ చేయనున్న పోస్టులు
ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిని నియమించే పోస్టుల్లో ముఖ్యంగా డిసెక్షన్‌ ఆల్‌ అటెండెన్స్, స్వీపర్స్, ల్యాబ్‌ అటెండెన్స్, స్టెనో కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్, రికార్డు కీపర్, ఆఫీస్‌ సబార్డినేట్, వ్యాన్‌ డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, స్టెనో టైపిస్ట్, డార్క్‌రూం అసిస్టెంట్స్, బ్లడ్‌బ్యాంక్‌ టెక్నీషియన్స్, స్టోర్‌ కీపర్స్, అసిస్టెంట్‌ లైబ్రేరియన్, బుక్‌ బేరర్, హెడ్‌ దోబీ, దోబీ, ప్యాకర్, కార్పెంటర్స్, బ్లాక్‌స్మిత్, బార్బర్, టైలర్, ఎలక్ట్రీషియన్‌ ఫోర్‌మన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్, ఏసీమెకానిక్, మాలి, మానిఫోల్డ్‌ సూపర్‌వైజర్, టెలిఫోన్‌ ఆపరేటర్స్, గ్యాస్‌ ఆపరేటర్స్, స్ట్రెచర్‌ బేరర్స్, రిసెప్షనిస్ట్‌ కం క్లర్క్, వార్డు బాయ్స్, మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ, ఆఫీస్‌ సబార్డినేట్స్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి భర్తీకి త్వరలో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు టెండర్లకు కాల్‌ ఫర్‌చేసి ఫోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. పోస్టుల భర్తీకి జరిగే టెండర్లలో పాల్గొనడానికి అనేక ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు పోటీ పడుతున్నట్లు తెలిసింది.

జూన్‌లో పోస్టుల భర్తీకి అవకాశం..
జూన్‌లో ఔట్‌సోర్సింగ్‌ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు మెడికల్‌ కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. మెడికల్‌ కళాశాల ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులను నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉండడంతో అంతకు ముందుగానే పోస్టులు భర్తీ చేయనున్నారు. మెడికల్‌ కళాశాలల ఏర్పాటు వల్ల జిల్లా ప్రజలకు మెరుగైన కార్పొరేట్‌ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement