► ఏల్కేశ్వరం వాసులకు ఫోన్‌కాల్ డబ్బులివ్వాలని డిమాండ్
► ప్రతిఘటించిన ఏల్కేశ్వరం వాసులు
► నిందితుడిని పట్టుకున్న గ్రామస్తులు.. పరారీలో మరో నిందితుడు
► విచారిస్తున్న పోలీసులు
జైపూర్ : ‘హలో మహేశ్వ ర్‌రెడ్డి గారు ఎక్కడున్నారు.. హలో రవీందర్‌రెడ్డి గారు.. బతుకుపై ఆశ ఉంటే తలా లక్ష రూపాయలు రెడీ చేసుకుని ఇద్దరూ కలిసి ఒక చోటుకు రండి.. లేకుంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోండి’ అంటూ మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్‌తో ఏల్కేశ్వరం వాసులు ఉలిక్కిపడ్డారు. జైపూర్ మండల మద్దికల్ పంచాయతీ పరిధిలో గల ఏల్కేశ్వరం గ్రామానికి చెందిన పర్తిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పోటు రవీందర్‌రెడ్డి చిన్నవ్యాపారం చేసుకుంటున్నాడు. వీరిద్దరికీ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒకరి తర్వాత ఒకరికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది.
మహేశ్వర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి ఇద్దరూ తలా లక్ష రూపాయలు ఇవ్వాలని బెదిరింపు ఫొన్ రావడంతో ఎందుకు ‘మేము డబ్బులు ఇవ్వాలి.. మేము ఏదైనా తప్పు చేశామా.. మా వద్ద అన్ని డబ్బులు లేవు’ అని చెప్పారు. ‘మీకు బతకాలని ఉంటే డబ్బులు రెడీ చేసుకుని ఇద్దరు కలిసి ఒక చోటుకు రండి’ అని బెదిరించి ఫోన్ కట్ చేశాడని బాధితులు తెలిపారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మహేశ్వర్‌రెడ్డి ఇంటికి వచ్చి తలుపు తట్టి పిలిచారు. దీంతో అతను గుర్తించి స్థానికులకు సమాచారం చేరవేశాడు. వారు వచ్చి ఆ ఇద్దరినీ పట్టుకునే ప్రయత్నం చేయగా అందులో ఒకరు మాత్రమే పట్టుబడ్డారు.
మరో వ్యక్తి బైక్‌పై తప్పించుకుని పారిపోయాడు. స్థానికులు ఆ వ్యక్తిని వెంబడిస్తూ ఎల్‌బీపేట గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అక్కడ వారు అడ్డం తిరగడంతో బైక్ వదిలిపెట్టి ఆటవీప్రాంతంలోకి పారిపోయాడని తెలిపారు. పట్టబడిన వ్యక్తిని గ్రామస్తులు విచారించగా ఖమ్మంకు చెందిన వారుగా చెప్పారని తెలిపారు. పట్టుబడిన వ్యక్తి పేరు సమ్మయ్య కాగా..పారిపోయిన వ్యక్తి పేరు నరేందర్ అని తెలిపారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పట్టుబడిన వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో వారు ఎవరనే విషయం తేలాల్సి ఉంది.
మావోయిస్టుల పేర బెదిరింపు కాల్స్
Published Sat, Mar 12 2016 2:35 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement