అలజడి | The Maoist movement again | Sakshi
Sakshi News home page

అలజడి

Published Sun, Apr 17 2016 2:18 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

The Maoist movement again

మళ్లీ మావోయిస్టుల కదలిక
తాడ్వాయిలో విధ్వంసక చర్య
అటవీ శాఖ గుడిసె, జీపు దగ్ధం
కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదర్ పేరిట లేఖ
పోలీసులకు సవాల్‌గా మారిన ఘటన



వరంగల్ ఏజెన్సీలో మరోసారి అలజడి రేగింది. తాడ్వాయిలోని అటవీ శాఖ వన్యప్రాణి విభాగం గుడిసెను, వాహనాన్ని తగులబెట్టడం.. సంఘటన స్థలంలో మావోయిస్టుల పేరిట ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖ ఉండడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఒంటిగంట సమయంలో తాడ్వాయిలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. వీరి చర్యతో ఆదివాసీల సంస్కృతి వివరించే ఒక గుడిసె, జీపు కాలిపోయాయి. మావోయిస్టు పార్టీ ఖమ్మం-కరీంనగర్-వరంగల్(కేకేడబ్ల్యూ) కార్యదర్శి దామోదర్ పేరుతో ఘటన స్థలంలో ఇప్ప చెట్టు వద్ద లేఖ ఉంది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ లేఖలోని అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులను మావోయిస్టులు ధ్వంసం చేయడం ఐదారేళ్ల కాలంలో ఎప్పుడూ జరగలేదు. తాడ్వాయిలోని అటవీ శాఖ ఆస్తులను మావోయిస్టు పార్టీ  దగ్ధం చేయడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అంతా స్తబ్ధుగా ఉందనుకుంటున్న దశలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేకుండాపోయిందని పోలీసు ఉన్నతాధికారులు పదేపదే ప్రకటిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో తాడ్వాయి ఘటన జరగడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. సాగునీటి శాఖ ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో భాగంగా నిర్మించనున్న ప్రాజెక్టుల రక్షణ కోసం తుపాకులగూడెం వద్ద పోలీస్ అటాకింగ్ స్టేషన్‌ను నిర్మించేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి ఘటన నేపథ్యంలో స్టేషన్ నిర్మాణం కోసం మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 
సరిగ్గా ఏడు నెలలకు...

తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు చనిపోయిన మొదటి సంఘటన తాడ్వాయి-గోవిందరావుపేట అడవుల్లోనే జరిగింది. 2015 సెప్టెంబరు 15న జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో తంగెళ్ల శృతి(27) అలియాస్ మహిత, మణికంటి విద్యాసాగర్‌రెడ్డి(27) అలియాస్ సాగర్ మృతిచెందారు. వరంగల్ ఏజెన్సీలో అప్పటికే మావోయిస్టుల ప్రభావం పూర్తిగా లేకుండా పోయిందనే పరిస్థితులలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. దీంతో మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల్లోనూ ఆందోళన పెరిగింది. ఇప్పుడు పూర్తిగా పోలీసుల అధిపత్యం ఉందనే భావన ఉంంది. ఇలాంటి పరిస్థితుల్లో తాడ్వాయి ఘటన జరిగింది. ఎన్‌కౌంటర్ జరిగిన ఏడు నెలల తర్వాత అటవీ శాఖ ఆస్తుల దగ్ధమయ్యాయి. పోలీసు వర్గాలు సైతం మావోయిస్టు సానుభూతిపరులే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇదే దిశగా గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలతో స్థానికులకు, మావోయిస్టు పార్టీ మాజీ సభ్యులు, సానుభూతి పరులకు వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

 

మావోస్టులా.. నకిలీలా..
ములుగు / తాడ్వారుు : తాడ్వాయిలో అటవీశా ఖ వన్యప్రాణి విభాగానికి చెందిన గుడిసె, జీపు దగ్ధం చేసింది మావోయిస్టులా.. నకిలీలా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటన స్థలంలో కేకేడబ్ల్యు కార్యదర్శి దామెదర్ పేరుతో లేఖ లభ్యమైంది. లేఖలో ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు గ్రీన్ హంట్ పేరుతో మావోయిస్టులను ఏరి పారేయాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని’ రాసి ఉంది. దీనిని చూస్తే మావోయిస్టులేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరుుతే లేఖ లెటర్‌ప్యాడ్‌పై కాకుండా తెల్లకాగి తంపై రాసి ఉండడాన్ని చూస్తే ఇది చేసింది నకిలేనన్న అనుమానం కూడా కలుగుతోంది. ఇదే తరహాలో గత ఏడాది జూన్ లో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో నడుస్తున్న జేసీబీ, వెంకటాపురం మండలంలోని బూర్గుపేటలో మిషన్‌కాకతీయ పనులు చేస్తున్న జేసీబీలు దగ్ధం చేశారు. ఈ ఘటనల్లో కూడా మావోరుుస్టుల పేరుతో లేఖలు కనిపించారుు. దీనిపై విచారణ చేసిన పోలీసులు ఇది ఆకతాయిల పనిగా తేల్చారు. అయితే మ ల్లంపల్లి సంఘటన జరిగిన నెల రోజుల వ్యవధి లో మొద్దుగుట్టలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో విద్యాసాగర్, శృతి ప్రాణాలు వదిలారు. దీంతో పోలీసులు మావోయిస్టుల కదలికలు, సానుభూతిపరులపై దృష్టి పెట్టారు. తాడ్వాయి సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులకు సమాచా రం అందింది.  తక్షణమే కూబింగ్ చేపట్టినా ఎవరూ తారసపడలేదు. ఒకరిద్దరు మావోరుుస్టులు గానీ, లేదా సానుభూతి పరులు ద్విచక్రవాహనంపై వచ్చి ఈ సంఘటనకు పాల్పడి క్షణాల్లో తప్పించుకొని ఉంటారని భావిస్తున్నారు. 

 
సందర్శించిన ములుగు ఏఎస్పీ

మావోయిస్టులు దగ్ధం చేసిన హట్స్‌ను ములుగు ఏఎస్పీ విశ్వజిత్ సందర్శించారు. ముందుగా తా డ్వాయి ఎస్సై కరుణాకర్‌రావు పోలీసుల బలగాలతో సంఘటన స్థలంలో వివరాలు సేకరించా రు. అనంతరం వచ్చిన సందర్శించిన ఏఎస్పీ దగ్ధమైన జీపు, గుడిసెలను పరిశీలించి నైట్‌వాచ్‌మెన్లు రవి, సమ్మయ్య, జీపు డ్రైవర్‌ను ఘటన జరిగిన తీరుపై అడిగి తెలుసుకున్నారు. 

 
మంటల శబ్దానికి నిద్ర లేశాం..

గుడిసె, జీపు కాలుతున్న మంటల శబ్దానికి రాత్రి ఒంటి గంటకు మేల్కొన్నామని వాచ్‌మెన్లు రవి, సమ్మయ్య చెప్పారు. అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తూనే అధికారులకు సమాచారం అందించామని చెప్పారు. ఆ తర్వా త ఫైర్‌ఇంజన్ వచ్చి ఆర్పేసిందన్నారు.

 
తాడ్వాయి-పస్రా మధ్య కూంబింగ్

పస్రా-తాడ్వాయి-ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు భారీ కూం బింగ్ చేపట్టారుు. గొత్తికోయగూడేలపై పోలీసు లు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎవరైనా తలదాచుకోవడానికి వచ్చారా అనే కోణం లో ప్రశ్నించారని సమాచారం. అనుమానితుల తో పాటు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది.

 
మంత్రి పర్యటన రద్దు

ములుగు : తాడ్వాయి మండలం వనకుటీరంలో మావోయిస్టుల పేరుతో గుడిసె, వాహనాన్ని తగలబెట్టిన నేపథ్యంలో ఏజెన్సీలో మంత్రి చందూలాల్ పర్యటన  రద్దయింది. శనివారం మంత్రి మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. ఇంతలో మావోయిస్టుల పేరుతో ఘటన జరగడంతో పర్యటన రద్దయింది. పోలీసుల సూచనతో మంత్రి చందూలాల్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైనట్టు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement