పాఠశాల విద్యాశాఖలో కొత్త కేడర్! | New cadre of school education! | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యాశాఖలో కొత్త కేడర్!

Published Wed, Sep 24 2014 2:21 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

New cadre of school education!

సమస్యలు పరిష్కారం
 
అయ్యే వరకు కొనసాగింపు
 ఏకీకృత సర్వీసు రూల్స్‌లో పొందుపరిచేందుకు తెలంగాణ సర్కారు చర్యలు

 
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్న విద్యాశాఖ పంచాయతీరాజ్ టీచర్ పోస్టులను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయాలనే అంశంతోపాటు కొత్త కేడర్‌ను సృష్టించే అంశంపైనా దృష్టిసారించింది. మండల, నియోజకవర్గ స్థాయిల్లో ఈ పోస్టులను సృష్టించే అవకాశం ఉంది. వీటికి బ్లాక్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పేర్లతో ప్రవేశపెట్టే అంశాలపై చర్చించింది. వీరిని మండలానికి ఒకరు, నియోజకవర్గానికి ఒకరిని నియమించడం ద్వారా ఇప్పటికిప్పుడు స్కూళ్ల పర్యవేక్షణ చేపట్టవచ్చని భావిస్తోంది. సర్వీసు రూల్స్ రూపకల్పన పై విద్యాశాఖ ఏర్పాటు చేసిన కమిటీతో పాటు పాఠశాల విద్యాశాఖ అదనపు డెరైక్టర్లతో కమిషనర్ జగదీశ్వర్ మంగళవారం సమావేశమై కొత్త సర్వీసు రూల్స్ పై వివిధ కోణాల్లో చర్చించారు. ఒకటీ రెండు రోజుల్లో ప్రభుత్వానికి సిఫారసులు పంపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ తరువాత వాటిపై ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ఇవీ సిఫారసు చేయనున్న ప్రధాన అంశాలు..

రాష్ట్రపతి ఉత్తర్వులప్పుడు ఉన్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, అసిస్టెంట్ లెక్చరర్ పోస్టులు ప్రస్తుతం లేవు. కాని అవి లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ అయి ఉన్నందు నా వాటిని ప్రస్తుతం ప్రవేశపెట్టే అంశంపైనా సిఫారసు చేయనుంది. ఇక న్యాయపరమైన వివాదాలు ఉన్నం దున ఇప్పటికిప్పుడు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలనే సిఫారసును చేయనుంది. తాత్కాలిక నిబంధనలతో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టి సమస్యలనుంచి బయటపడవచ్చని భావిస్తోంది. అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిలో కొత్త కేడర్‌లో పోస్టులను సృష్టించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీఈఓ పోస్టులకు ప్రత్యామ్నాయంగా వీటిని నియమించే అవకాశం ఉంది.     
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement