Unified service teachers
-
1998 నుంచి టీచర్ల ఏకీకృత సర్వీసు నిబంధనలు
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ, జిల్లా పరిషత్ తదితర యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను ఏకీకృతం చేసే ప్రక్రియను 1998 నుంచి వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర హోం శాఖను కోరాయి. ఏకీకృత సర్వీసు నిబంధనల రూపకల్పనకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అవసరమైన నేపథ్యంలో ఈ అంశంపై మంగళవారం హోం శాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ నేతృత్వంలో ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ నుంచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్, సంయుక్త సంచాలకులు మస్తానయ్య, న్యాయసలహాదారు వీరభద్రారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.ఆర్.ఆచార్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు కిషన్, సంయుక్త సంచాలకులు శ్రీహరి హాజరయ్యారు. దాదాపు 4 లక్షల మంది ఉపాధ్యాయులకు సంబంధించి ఏకీకృత సర్వీసు నిబంధనలు ఎప్పటి నుంచి వర్తింపజేయాలన్న విషయంలో 2 రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అన్ని క్యాడర్లకు 1998 నుంచి వర్తింపజేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థించినట్టు ఏపీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు వివరించారు. -
పాఠశాల విద్యాశాఖలో కొత్త కేడర్!
సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగింపు ఏకీకృత సర్వీసు రూల్స్‌లో పొందుపరిచేందుకు తెలంగాణ సర్కారు చర్యలు హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్న విద్యాశాఖ పంచాయతీరాజ్ టీచర్ పోస్టులను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయాలనే అంశంతోపాటు కొత్త కేడర్‌ను సృష్టించే అంశంపైనా దృష్టిసారించింది. మండల, నియోజకవర్గ స్థాయిల్లో ఈ పోస్టులను సృష్టించే అవకాశం ఉంది. వీటికి బ్లాక్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పేర్లతో ప్రవేశపెట్టే అంశాలపై చర్చించింది. వీరిని మండలానికి ఒకరు, నియోజకవర్గానికి ఒకరిని నియమించడం ద్వారా ఇప్పటికిప్పుడు స్కూళ్ల పర్యవేక్షణ చేపట్టవచ్చని భావిస్తోంది. సర్వీసు రూల్స్ రూపకల్పన పై విద్యాశాఖ ఏర్పాటు చేసిన కమిటీతో పాటు పాఠశాల విద్యాశాఖ అదనపు డెరైక్టర్లతో కమిషనర్ జగదీశ్వర్ మంగళవారం సమావేశమై కొత్త సర్వీసు రూల్స్ పై వివిధ కోణాల్లో చర్చించారు. ఒకటీ రెండు రోజుల్లో ప్రభుత్వానికి సిఫారసులు పంపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ తరువాత వాటిపై ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇవీ సిఫారసు చేయనున్న ప్రధాన అంశాలు.. రాష్ట్రపతి ఉత్తర్వులప్పుడు ఉన్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, అసిస్టెంట్ లెక్చరర్ పోస్టులు ప్రస్తుతం లేవు. కాని అవి లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ అయి ఉన్నందు నా వాటిని ప్రస్తుతం ప్రవేశపెట్టే అంశంపైనా సిఫారసు చేయనుంది. ఇక న్యాయపరమైన వివాదాలు ఉన్నం దున ఇప్పటికిప్పుడు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలనే సిఫారసును చేయనుంది. తాత్కాలిక నిబంధనలతో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టి సమస్యలనుంచి బయటపడవచ్చని భావిస్తోంది. అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిలో కొత్త కేడర్‌లో పోస్టులను సృష్టించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీఈఓ పోస్టులకు ప్రత్యామ్నాయంగా వీటిని నియమించే అవకాశం ఉంది.