కొత్త విద్యుత్ చార్జీలు నేడు వెల్లడి! | new power tariff to reveal in telangana | Sakshi
Sakshi News home page

కొత్త విద్యుత్ చార్జీలు నేడు వెల్లడి!

Published Tue, Feb 10 2015 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

new power tariff to reveal in telangana

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు నేడో, రేపో వెల్లడికానున్నాయి. ఇప్పటికే విద్యుత్ సరఫరా సంస్థలు (డిస్కంలు) చార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలతో పాటు ఏఆర్‌ఆర్‌లను కూడా ఈఆర్సీకి సమర్పించాయి. ఈ ప్రతిపాదనల వివరాలను వెంటనే వెబ్‌సైట్లో పెట్టాల్సి ఉన్నా.. డిస్కంలు ఆ పని చేయలేదు. ప్రజలపై ప్రత్యక్షంగా భారం పడే అంశం కావటంతో ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని డిస్కం వర్గాలు పేర్కొన్నాయి.

అయితే దీనిపై స్పందించిన ఈఆర్సీ ఆ ప్రతిపాదనల వివరాలను మంగళవారం రోజున ఆన్‌లైన్‌లో పెట్టాలంటూ డిస్కంలకు సోమవారం మెమో జారీ చేసింది. దీంతోపాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా సోమవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్న నేపథ్యంలో... చార్జీల పెంపు ప్రతిపాదనలు మంగళవారం లేదా బుధవారం వెల్లడయ్యే అవకాశముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement