Power tariff hike
-
ఏమైందండీ! షాక్ కొట్టినట్లు అరిచారు!!
ఏమైందండీ! షాక్ కొట్టినట్లు అరిచారు!! -
Electricity Tariff: కేంద్రమే గుదిబండ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ/ఉత్తర తెలంగాణ డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాల్సిన విద్యుత్ టారిఫ్ (చార్జీల పెంపు) ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం రెండోరోజు ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఏడేళ్లలో డిస్కంలపై పెరిగిన వ్యయ భారాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. కోతల్లేని నిరంతర విద్యుత్ సరఫరా, వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీలు సైతం డిస్కంలపై తీవ్ర భారాన్ని మోపాయని సమీక్షలో మంత్రులకు అధికారులు నివేదించారు. ఈ నేపథ్యంలో డిస్కంల నష్టాలు, ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఒకట్రెండు రోజుల్లో ఈఆర్సీకి డిస్కంలు సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, దక్షిణ డిస్కం సీఎండీ జి. రఘుమారెడ్డి పాల్గొన్నారు. డిస్కంల నష్టాలపై ప్రభుత్వానికి అధికారుల నివేదన ఇదీ... ♦గత నాలుగేళ్లలో బొగ్గు రవాణా రైల్వే చార్జీలను కేంద్రం 40 శాతం మేర పెంచింది. పునరుత్పాదక విద్యత్ (ఆర్పీవో)ను కేంద్రం తప్పనిసరి చేయడంతో జెన్కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించి ప్రైవేటు నుంచి ఖరీదైన సోలార్, పవన విద్యుత్‌ను కొనాల్సి వస్తోంది. సీలేరు, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాల ఒప్పందాల (పీపీఏ)ను రద్దు చేసుకోవడంతో ప్రత్యామ్నాయంగా బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో డిస్కంలపై రూ. 2,763 కోట్ల అదనపు భారం పడింది. ఏపీ జెన్కో ఇతర విద్యుత్ కేంద్రాల నుంచి రావాల్సిన విద్యుత్‌ను సైతం నిలిపేయడంతో డిస్కంలు మరో రూ. 2,502 కోట్ల అదనపు ఖర్చులు చేశాయి. ♦ సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ కోసం ఏటా ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు రూ. 18,167 సబ్సి డీని ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 19.03 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండ గా ఏడేళ్లలో 6.89 లక్షల కొత్త కనెక్షన్లను సర్కారు మంజూరు చేసింది. ఏటా వ్యవసాయ సబ్సిడీగా ప్రభుత్వం రూ. 3,375 కోట్లు ఖర్చు చేస్తోంది. ♦ కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్ సరఫరాకు రూ.3,200 కోట్లు ఖర్చు చేస్తోంది. ♦ 200 యూనిట్లలోపు గృహావసరాల విదుŠయ్త్ వినియోగదారులకు ఏటా రూ. 1,253 కోట్ల రాయితీలను అందిస్తోంది. 5,77,100 ఎస్సీ, 2,69,983 ఎస్టీల గృహాలకు ప్రతి నెలా 101 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తోంది. నాయీ బ్రాహ్మణుల నిర్వహణలోని 15,046 హెయిర్ సెలూన్లు, 47,545 లాండ్రీ షాపులు, 50 దోభీ ఘాట్లకు ప్రతి నెలా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. 4,920 పవర్ లూమ్‌లు, 5,920 కోళ్ల ఫారాలు, 36 స్పిన్నింగ్ మిల్లులకు ఒక్కో యూనిట్‌పై రూ. 2 చొప్పున సబ్సిడీ అందిస్తోంది. ♦ కోవిడ్ లాక్డౌన్ల ప్రభావంతో రూ. 4,374 కోట్ల విద్యుత్ బిల్లుల వసూళ్లు నిలిచిపోయాయి. ఏటేటా డిస్కంలపై ఈ మేరకు వ్యయ భారాలు పెరిగిపోతుండగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను సైతం పెంచలేదు. టన్ను బొగ్గుపై రూ. 50 ఉన్న క్లీన్ ఎనర్జీ సెస్‌ను మోదీ ప్రభుత్వం రూ. 400కు పెంచడంతో ఏడేళ్లలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లపై రూ. 7,200 కోట్ల అదనపు భారం పడింది. బొగ్గు ధరలను కేంద్రం సాలీనా 6–10% పెంచడంతో డిస్కంలపై ఏటా రూ. 725 కోట్ల అదనపు భారం పడింది. రాష్ట్ర విభజన వేళ రూ. 12,185 కోట్ల భారీ నష్టాల తో ఏర్పడిన డిస్కంలపై మోదీ సర్కార్ విద్యుత్ సంస్కరణలూ గుదిబండగా మారాయి. – సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారన్న అధికార వర్గాలు -
‘లోటు’ పాట్లపై లోతుగా..
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారిఫ్ సవరణ(చార్జీల పెంపు) ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆదేశించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు, విద్యుత్‌మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం, ఆ వ్యత్యాసాన్ని పూడ్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లను డిస్కంలు గత నెల 30న ఈఆర్సీకి సమర్పించిన విషయం తెలిసిందే. ఏఆర్‌ఆర్‌తోపాటే సమర్పించాల్సిన టారిఫ్ పెంపు ప్రతిపాదనలను అప్పట్లో డిస్కంలు వాయిదా వేసుకున్నాయి. భారీ ఆదాయలోటులో ఉన్న డిస్కంల మనుగడ కోసం చార్జీలు పెంచకతప్పదని ఇప్పటికే ఈఆర్సీ స్పష్టం చేసింది. ఆదాయలోటు పూడ్చుకోవడానికి ప్రభుత్వ సబ్సిడీలను పెంచేందుకున్న అవకాశాలు ఏమిటి? సబ్సిడీలుపోగా మిగిలి ఉండే లోటు పూడ్చుకోవడానికి ఏ మేరకు టారిఫ్ పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పించాలి? అన్న అంశాలపై మంత్రులు లోతుగా చర్చించారు. ఆర్థికలోటు పూడ్చడానికి ఉన్న ఇతర మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావులకు సూచించారు. డిస్కంల ఆర్థిక పరిస్థితి, టారీఫ్ ప్రతిపాదనలపై మరో మారు భేటీ కావాలని నిర్ణయించారు. విద్యుత్‌పై భారీగా పెట్టుబడులు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.వేల కోట్ల పెట్టుబడులు, వ్యయప్రయాసలతో రాష్ట్ర విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల సామర్థ్యాన్ని భారీగా పెంచినట్టు అధికారులు మంత్రులకు నివేదించారు. జెన్కో స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 16,623 మెగావాట్లకు పెరిగిందన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.33,722 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో 2,700 మెగావాట్ల లోటు ఉండేదని, కేవలం 6 నెలల్లోనే కోతలు అధిగమించి అన్ని రంగాలకు 24 గంటల నిరంతర సరఫరా చేస్తున్నామని వివరించారు. సౌర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 74 మెగావాట్లు నుంచి 3997 మెగావాట్లకు, గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,661 మెగావాట్ల నుంచి 13,688 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. వినియోగదారుల సంఖ్య కోటీ 11 లక్షల నుంచి కోటీ 68 లక్షలకు, తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్ల నుంచి 2,012 యూనిట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 19 లక్షల నుంచి 25.92 లక్షలకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరిగాయన్నారు. ట్రాన్స్‌కో పరిధిలోని సబ్ స్టేషన్ల సంఖ్య 233 నుంచి 361కు పెంచినట్టు తెలిపారు. ఈ మేరకు పెరిగిన ఆర్థిక అవసరాలకు తగ్గట్టు విద్యుత్ సంస్థల విద్యుత్ టారిఫ్ పెంచుకోవడానికి అనుమతికోరినట్టు తెలిసింది. -
ఏ కేటగిరీకి ఎంత పెంచుదాం?
సాక్షి, హైదరాబాద్: తీవ్ర నష్టాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను గట్టెక్కించడానికి విద్యుత్ చార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా డిస్కంల ఆర్థిక పరిస్థితిపై ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలిక సెలవులో ఉన్న ప్రభాకర్‌రావు మంగళవారం మంత్రి సమక్షంలో విధుల్లో చేరారు. ఈ మేరకు ఆయనకు సెలవులు మంజూరు చేయడంతోపాటు విధుల్లో చేరినట్టు ధ్రువీకరిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా చేపట్టిన సమీక్షలో ఏ కేటగిరీల వినియోగదారులపై ఏ మేరకు విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించాలనే అంశంపై చర్చ జరిగిందని, పెంపు ప్రతిపాదనలకు తుదిరూపు వచ్చిందని సమాచారం. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంస్థల సీఎండీలతో సమీక్ష నిర్వహించి ఈ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం అనుమతి లభించిన వెంటనే ఈఆర్సీకి డిస్కంలు చార్జీల పెంపు ప్రతిపాదినలు సమర్పించనున్నాయి. చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఎన్నికల కోడ్ ప్రభావం? విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం ప్రతి ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్ఆర్) నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించడంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వచ్చే నెల 14 వరకు ఎన్నికల కోడ్ అమల్లోకి ఉండనుంది. దీంతో ఈ నెలాఖరులోగా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించడం సాధ్యం కాకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల సంఘం అనుమతిస్తే మాత్రం నిబంధనల ప్రకారం నెలాఖరులోగా ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి చార్జీల పెంపును అమలు చేయడానికి డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి. -
గెలిచిన తర్వాత కరెంట్ షాక్‌లా..?
లక్నో : గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాలన్న యూపీ ప్రభుత్వ ప్రతిపాదన పట్ల బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయవతి మండిపడ్డారు. గృహ వినియోగదారులకు విద్యుత్ టారిఫ్‌లను పెంచేందుకు పవర్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలు దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వారిపైనా విద్యుత్ చార్జీల భారం మోపాలన్న యూపీ ప్రభుత్వ ప్రతిపాదనను అందరూ ఖండించాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం యూపీలో 20 కోట్ల మందిపై విద్యుత్ భారాలను మోపాలని బీజేపీ భావిస్తోందా అని మాయావతి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, శాంతి భద్రతల పరిస్ధితి దారుణంగా తయారైందని ఆమె ఆరోపించారు. మహిళలకు భద్రత కరవైందని ఆందోళన వ్యక్తం చేసిన మాయావతి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. -
తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు త్వరలో చార్జీల మోత మోగనుంది. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో చార్జీల బాదుడుకు షురూ అయింది. అధికారులు బుధవారం ముఖ్యమంత్రితో సమావేశమై విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వివరించారు. ఈ సందర్భంగా సామాన్య, గృహ వినియోగదారులపై అదనపు భారం పడకుండా విద్యుత్ చార్జీల పెంపుకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. 100 యూనిట్ల లోపు ఎలాంటి పెంపుదల ఉండదని.. 100 యూనిట్ల పైబడి స్వల్ప పెరుగుదల ఉంటుందని సమాచారం. విద్యుత్ చార్జీల పెంపుకు అధికారులు ప్రతిపాదనలు ఇవ్వగా, ఏ మేరకు విద్యుత్ చార్జీల పెంచాలన్నదానిపై గురువారం తుది నిర్ణయం వెలువడనుంది. మరోవైపు ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంచనున్నారు. 30 కిలోమీటర్ల లోపు పల్లెవెలుగు బస్సుల్లో రూపాయి, 30 కిలోమీటర్ల పైన 2 రెండు రూపాయలు, పల్లె వెలుగు మినహా మిగతా బస్సుల్లో 10 శాతానికి మించకుండా ఛార్జీలు పెంచాలని నిర్ణయించారు. -
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగాయి. సగటున 4.42 శాతం చొప్పున పెంచుతూ ఛార్జీల టారిఫ్ ఆర్డర్‌ను ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ శుక్రవారం విడుదల చేశారు. గృహ అవసరాల విద్యుత్ పై 1.3 శాతం ఛార్జీలను పెంచారు. పౌల్ట్రీలకు యూనిట్ పై రెండు రూపాయల తగ్గింపు ప్రకటించారు. మొత్తంగా 4.42 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచారు. పెంచిన విద్యుత్ ఛార్జీలతో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.816 కోట్లు కాగా, తెలంగాణ ప్రభుత్వంపై పడనున్న సబ్సిడీ భారం రూ. 4,227 కోట్లు. కుటీర పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈ సందర్భంగా ఇస్మాయిల్ అలీఖాన్ వెల్లడించారు. అయితే మొదటి 200 యూనిట్ల వరకు పాత విద్యుత్ ఛార్జీలే అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. అంటే.. గృహ అవసరాలకు వాడుకునే విద్యుత్తులో కూడా 200 యూనిట్లకు మించని పక్షంలో పాత చార్జీలే అమలవుతాయి. ఆ పైన మాత్రమే 1.3 శాతం చొప్పున పెరుగుతాయన్నమాట. -
బాబు గారి వాత
-
ప్రజలపై విద్యుత్ భారం దుర్మార్గం
వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి సాక్షి, హైదరాబాద్: అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఆ భారాన్ని ప్రజలపై మోపడం దుర్మార్గమైన చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వల్పకాలిక, ద్వైపాక్షిక విద్యుత్ కొనుగోళ్లకు భారీగా ధర చెల్లించిన ఫలితంగా వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆ భారాన్ని ప్రజలపై ఎలా వేస్తారని ప్రశ్నించారు. 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలన్న సంకల్పం మంచిదేనని.. అయితే ఇలా అధిక ధరలకు కొనుగోలు చేసి మాత్రం కాదన్నారు. అవినీతి, దుబారా, స్వలాభం కోసం నేల విడిచి సాము చేయడం వల్ల.. అధిక ధరలకు కొన్న విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేలా డిస్కంలను కోరడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదేనని మైసూరా విమర్శించారు. # 2014-15, 2015-16 సంవత్సరాలకుగాను విద్యుత్ చార్జీలు పెంచేలా అనుమతి కోరుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పంపిణీ సంస్థలు(ఏపీఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్) దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికతమ పార్టీకి ఆమోదయోగ్యం కాదని, సంస్థలు చేసిన అవినీతి, దుబారాకు ప్రజలు మూల్యం చెల్లించాలనడాన్ని అంగీకరించబోమని అన్నారు. # 12 వేల మిలియన్ యూనిట్ల మేరకు జరిగిన విద్యుత్ స్వల్పకాలిక, ద్వైపాక్షిక కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలపై సహా అధిక ధరలపై కూడా ఏపీఈఆర్సీ పూర్తిస్థాయి విచారణ చేయాలని మైసూరా డిమాండ్ చేశారు. విదేశీ బొగ్గు ధరలు పెరిగినందువల్ల నష్టం వాటిల్లిందని పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. # అంతర్జాతీయంగా సహజవాయువు ధరలు తగ్గాయని, అయితే, పెరిగిన సహజ వాయువు ధరల వల్లే అదనపు భారం పడుతోందని డిస్కంలు పేర్కొనడంపై మైసూరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు గ్యాస్‌లో అధిక లాభాలు గడిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గ్యాస్ ధర నిర్ణయంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే జరుగుతున్న విచారణలో ఇంప్లీడ్ అయి.. ధరలు తగ్గేలా ఎంత మాత్రమూ కృషి చేయడం లేదన్నారు. # ‘అందరికీ 24 గంటల విద్యుత్ సరఫరా’ అని కేంద్రంతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా రాష్ట్రానికి లభించే సాయం అరకొరేనన్నారు. ఇలాంటి అసంబద్ధ ఒప్పందాలన్నీ ఈఆర్సీకి చూపి 2014-15 సంవత్సరానికి రూ.1200 కోట్ల మేరకు చార్జీలు పెంచడానికి అనుమతి కోరడం, 2015-16లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ప్రజలపై ఆ భారం మోపడం అన్యాయమే అవుతుందన్నారు. # జెన్కో ఆధీనంలోని థర్మల్, హైడల్, ఐపీపీ(గ్యాస్-బొగ్గు) ద్వారా 51,518 మి.యూ విద్యుత్ ఉత్పాదన జరుగుతోందని, రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా కోసం అయ్యే విద్యుత్ 58,191 మి.యూ.అని మైసూరా వివరించారు. అంటే విద్యుత్ లభ్యతకు, సరఫరాకు తేడా 6,673 మి. యూ మాత్రమేనన్నారు. డిస్కంలు 2013-14 విద్యుత్ వాడకాన్ని పోలిస్తే 2014-15, 2016 సంవత్సరాలకు వినియోగం కాగల విద్యుత్ అంచనాలను సంస్థలు ఎక్కువ చేసి చూపాయన్నారు. # 2014-15లో తొలి 6 నెలల విద్యుత్ వాడకాన్ని చూపకుండా రెండో 6 నెలలకు అంచనాలను చూపారన్నారు. పారిశ్రామిక రంగంలో 33 శాతం, సాధారణ రంగంలో6 శాతం వినియోగం పెరుగుదల ఉంటుందనడం, తేడాను ఎక్కువ చేసి చెప్పడం.. అంకెల గారడీ తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్రంలో అసలు పరిశ్రమలే అంతగా లేనపుడు వినియోగంలో ఇంత వృద్ధి ఎలా ఉంటుందన్నారు. ఈ అంకెలగారడీ వల్ల 6,673 మి.యుల వినియోగంలో తేడా చూపుతూ దానికంటే అదనంగా 11,159 మి.యుల విద్యుత్ కావాలని చెబుతున్నారన్నారు. ఈ విద్యుత్‌ను తక్కువ ధరకు కొంటే ఫర్వాలేదు గానీ, ఎక్కువ ధరలకు కొనడం ఆమోదయోగ్యం కాదన్నారు. # ఒప్పందం కుదుర్చుకున్న విధంగా విద్యుత్‌ను కొనుగోలు చేయలేకపోతే రూ.600 కోట్లు జరిమానా కట్టాలని చెప్పి ఆ నష్టాన్ని కూడా ప్రజల నెత్తిన రుద్దడం బరితెగించడమేనని మైసూరా విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనలు బహిర్గతం
-
మధ్యతరగతిపై మోత!
కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనలు బహిర్గతం ఒక్కో యూనిట్‌పై కనిష్టంగా 10 పైసల నుంచి గరిష్టంగా 48 పైసల వరకూ వడ్డింపు వంద యూనిట్లలోపు వినియోగిస్తే ప్రస్తుత చార్జీలే 200 యూనిట్ల వరకు 4% పెంపు.. ఆపై 5.75 శాతం వాత 26.30 లక్షల గృహాలపై చార్జీల పెంపు ప్రభావం పరిశ్రమలపై 4.75% చార్జీల పెంపు రూ. 1,088.68 కోట్ల వరకూ భారం ఇంకా రూ. 6,476.23 కోట్ల లోటు చూపిన డిస్కంలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యతరగతికి విద్యుత్ షాక్ తగలనుంది.. తక్కువ విద్యుత్ ఉపయోగించే పేదలకు మాత్రం మినహాయింపు లభించినా... ఎక్కువ విద్యుత్ వినియోగించేవారిపై చార్జీల మోత మోగనుంది. వివిధ కేటగిరీల వారీగా నాలుగు శాతం నుంచి 5.75 శాతం వరకు పెంపును వడ్డించనున్నారు. మొత్తంగా కొత్త రాష్ట్రంలో తొలిసారిగా విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ప్రజలపై రూ. 1,089 కోట్ల భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిస్కంలు 2015-16 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను (ఏఆర్‌ఆర్‌లు) గత శనివారమే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి (టీఎస్ఈఆర్సీ) సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కొత్త చార్జీల వివరాలను గోప్యంగా ఉంచిన డిస్కంలు... రెండు రోజుల పాటు హైడ్రామా నడిపించాయి. దీంతో ప్రతిపాదనల వివరాలను మంగళవారం రోజున వెబ్సైట్లో పెట్టాలని సోమవారం డిస్కంలకు ఈఆర్సీ మెమో జారీ చేసింది కూడా. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ ఈఆర్సీ కార్యాలయంలో టీఎస్ఎస్పీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, డెరైక్టర్ శ్రీనివాసరావు, టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులతో సమావేశమయ్యారు. చార్జీల వివరాలు, ఏఆర్ఆర్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని వారికి సూచించారు. భేటీ అనంతరం డిస్కంల ప్రతిపాదనల వివరాలను ఈఆర్సీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. గరిష్టంగా 48 పైసల వరకూ.. వివిధ కేటగిరీల్లో చార్జీల పెంపు నాలుగు శాతం నుంచి 5.75 శాతం వరకు ప్రతిపాదించారు. ఒక్కో యూనిట్‌పై కనిష్టంగా 10 పైసల నుంచి గరిష్టంగా 48 పైసల వరకు పెంచుతూ రేట్ల పట్టికను తయారు చేశారు. ఈ కొత్త టారిఫ్ ప్రకారం వంద యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ప్రస్తుతమున్న చార్జీలే వర్తిస్తాయి. 101-200 యూనిట్ల మధ్య విద్యుత్ వినియోగించే గృహాలకు నాలుగు శాతం చార్జీలు పెరుగుతాయి. మిగతా అన్ని కేటగిరీలకు 5.75 శాతం చార్జీని వడ్డించారు. పరిశ్రమల కేటగిరీలో 4.75 శాతం పెంపును ప్రతిపాదించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం యథాతథంగా కొనసాగుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో మొత్తంగా రూ. 7,564.91 కోట్ల లోటును చూపించాయి. ఇందులో రూ. 1,088.68 కోట్లను చార్జీల పెంపు ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈఆర్సీని కోరాయి. ఈ పెంపు అమలైనా కూడా రూ. 6,476.23 కోట్లు నికరంగా లోటు ఉంటుంది. దీనిని పూడ్చుకునేందుకు డిస్కంలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు రూ. 300 కోట్ల చొప్పున ఏటా రూ. 3,600 కోట్లు సబ్సిడీగా తెలంగాణ సర్కారు డిస్కంలకు చెల్లిస్తోంది. వచ్చే ఏడాది అదనంగా మరో రూ.2,876.23 కోట్లను సర్కారు నుంచి ఆశిస్తున్నట్లు డిస్కంల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో సరిపడేంత విద్యుత్ అందుబాటులో లేకపోవటంతో పాటు, విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావటంతో.. గతంతో పోలిస్తే డిస్కంల ఖర్చులు పెరిగిపోయాయి. 2015-16లో మొత్తం రూ. 26,473.76 కోట్ల వ్యయం అవుతుందని.. ప్రస్తుత చార్జీల ద్వారా రూ. 18,908.85 కోట్లు ఆదాయం వస్తుందని.. పెంపుతో అదనంగా మరో రూ.1,088.68 కోట్లు ఆదా యం వస్తుందని డిస్కంలు పేర్కొన్నాయి. పేదలకు ఊరట చార్జీల పెంపుతో దాదాపు 70% మంది వినియోగదారులకు అదనపు భారమేమీ ఉండబోదని డిస్కంలు చెబుతున్నాయి. తెలంగాణలో వంద యూనిట్లలోపు వినియోగించే కుటుంబాలు సుమారు 62.10 లక్షలు ఉన్నాయి. వారందరికీ ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీలే వర్తించనున్నాయి. అంతకు మించి విద్యుత్ వినియోగించే 26.3 లక్షల కుటుంబాలపై చార్జీల భారం పడుతుంది. 200 యూనిట్లు దాటితే వాత: తాజా చార్జీల పెంపు ప్రతిపాదనలను పరిశీలిస్తే... వంద యూనిట్ల వరకు భారం లేకున్నా, విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే స్లాబ్ పద్ధతిలో రేట్లు వర్తిస్తాయి. దీంతో వినియోగదారులపై ఎక్కువగా భారం పడనుంది. సాధారణంగా 200 యూనిట్లు వినియోగించే మధ్య తరగతి గృహాలకు ప్రస్తుత పెంపుతో విద్యుత్ బిల్లు రూ. 600 నుంచి రూ. 625కు పెరుగుతుంది. కానీ అంతకన్నా అదనంగా ఒక్క యూనిట్ వాడితే.. బిల్లు అమాంతం రూ. 872.75కు చేరుతుంది. 500 యూనిట్లు వాడే వినియోగదారులు ప్రస్తుతం రూ. 3,007 వరకు చెల్లిస్తుండగా.. ఈ మొత్తం రూ.3,180.50కు పెరగనుంది. అదే మరో యూనిట్ అదనంగా (501 యూనిట్లు) వాడితే.. బిల్లు మోత ఏకంగా రూ. 4,438.86కు చేరుతుంది. హెచ్చు వినియోగానికి.. 2015-2016 సంవత్సరానికి సంబంధించి డిస్కంలు ఎక్కువ విద్యుత్ వినియోగించేవారికి, పరిశ్రమలు, వ్యవసాయం వంటి పలు రంగాలకు చెందిన పెంపు ప్రతిపాదనలను సమర్పించాయి. గృహ లేదా వాణిజ్యావసరాలకు ఎల్టీ-2 కేటగిరీ కింద 50 యూనిట్ల వరకు రూ. 5.71 చార్జీగా నిర్ణయించారు. ఇక ఎల్టీ-2 (బీ) కేటగిరీలో 0-50 యూనిట్ల వరకు రూ. 7.01, 51-100 యూనిట్ల వరకు రూ. 7.80, 101-300 యూనిట్ల వరకు రూ. 8.60, 301-500 యూనిట్ల వరకు రూ. 9.13, 500పైగా యూనిట్లకు రూ. 9.65 చొప్పున నిర్ధారించారు. ఇక ఎల్టీ-2(సి) కేటగిరీ కింద ప్రకటనల హోర్డింగ్‌లకు రూ.11.66 చార్జీగా నిర్ధారించారు. ఎల్టీ కేటగిరి 3-కింద పరిశ్రమలకు యూనిట్‌కు రూ.6.43, సీజనల్ పరిశ్రమలకు రూ.7.14, చేప/రొయ్యల సాగుకు రూ. 4.90, చెరకు కర్మాగారానికి రూ. 4.90, కోళ్ల ఫారాలకు రూ. 5.95, పుట్టగొడుగులు/కుందేలు ఫారాలకు రూ. 5.95, గ్రీన్హౌస్లో ఫ్లోరికల్చర్కు రూ. 5.95కు చార్జీ పెంపును ప్రతిపాదించారు. ఎల్టీ కేటగిరీ 4- కుటీర పరిశ్రమలు (10హెచ్‌పీపైగా) రూ. 3.97, ఆగ్రోబేస్డ్కు (10హెచ్‌పీపైగా) రూ. 3.97; ఎల్టీ కేటగిరి 5 కింద వ్యవసాయానికి చార్జీలను మార్చలేదు. ఎల్టీ కేటగిరి 6 కింద వీధి దీపాలు, పీడబ్ల్యుఎస్లకు స్వల్పంగా పెం చారు. ఎల్టీ కేటగిరి 7 (ఏ) కింద జనరల్ వినియోగానికి యూనిట్‌కు రూ. 6.91, ఎల్టీ 7(బి) కింద రిలీజియస్ ప్రాంతాల్లో రూ.4.97ను నిర్ధారించారు. ఎల్టీ కేటగిరి 8 కింద తాత్కాలిక సరఫరాకు రూ. 9.97, హెచ్‌టీ-1(ఎ) జనరల్‌లో 11 కెవీ, 33, 132 కేవీలకు సంబంధించి కొద్దిపాటి మార్పులు చేశారు. -
కొత్త విద్యుత్ చార్జీలు నేడు వెల్లడి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు నేడో, రేపో వెల్లడికానున్నాయి. ఇప్పటికే విద్యుత్ సరఫరా సంస్థలు (డిస్కంలు) చార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలతో పాటు ఏఆర్ఆర్లను కూడా ఈఆర్సీకి సమర్పించాయి. ఈ ప్రతిపాదనల వివరాలను వెంటనే వెబ్సైట్లో పెట్టాల్సి ఉన్నా.. డిస్కంలు ఆ పని చేయలేదు. ప్రజలపై ప్రత్యక్షంగా భారం పడే అంశం కావటంతో ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని డిస్కం వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై స్పందించిన ఈఆర్సీ ఆ ప్రతిపాదనల వివరాలను మంగళవారం రోజున ఆన్లైన్లో పెట్టాలంటూ డిస్కంలకు సోమవారం మెమో జారీ చేసింది. దీంతోపాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా సోమవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్న నేపథ్యంలో... చార్జీల పెంపు ప్రతిపాదనలు మంగళవారం లేదా బుధవారం వెల్లడయ్యే అవకాశముంది. -
విద్యుదావేశం
విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదన తగదు బహిరంగ విచారణలో సర్వత్రా వ్యతిరేకత సెమిటెలిస్కోపిక్తో సామాన్యుడి బలి ప్రభుత్వ తీరును ఎండగట్టిన నేతలు సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనపై పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ), తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) శనివారం స్థానిక అంకోసా భవనంలో నిర్వహించిన బహిరంగ విచారణలో ముక్తకంఠంతో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకించారు. తొలుత ఈపీడీసీఎల్ సంస్థ సీఎండీ ఎం.వి.శేషగిరిబాబు డిస్కం ప్రతిపాదించిన ధరల్ని, సంస్థ భవిష్యత్ కార్యాచరణను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. టారిఫ్ రేట్లు ఎందుకు పెంచాల్సి వచ్చిందో వెల్లడించారు. వినియోగదారుల ఫిర్యాదుల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని, వినియోగదారుల సేవా కేంద్రాల్ని ఏర్పాటు చేశామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిష్కారానికి నోచుకోని వాటిని సీజీఆర్ఎఫ్ పరిష్కరిస్తుందని చెప్పారు. అనంతరం బహిరంగ విచారణలో తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు ముందుగా పేర్లను నమోదు చేసుకున్న 43 మందితోపాటు, అప్పటికప్పుడు నమోదయిన 22 మందికి అవకాశమిచ్చారు. వీరిలో సుమారు 30 మంది మాత్రమే తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. చార్జీల పెంపు ప్రతిపాదనల్ని తీవ్రంగా నిరసించారు. సెమీ టెలిస్కోపిక్ విధానంతో సామాన్యులే బలవుతున్నారని ఆక్షేపించారు. ఏపీఈఆర్సీ చైర్మన్ డాక్టర్ వి.భాస్కర్, సభ్యులు పి.రాజగోపాలరెడ్డి, ఆర్.ఆశోక్ ఆచారి, కార్యదర్శి మనోహర్‌రాజు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహం కరువు మొత్తం ఆదాయంలో 45 శాతం పరిశ్రమల నుంచే వస్తోంది. పంపిణీ నష్టాలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. కొత్తగా పరిశ్రమల్ని స్థాపించే వారికి రాయితీ మరింత పెంచాలి. దేశంలో అన్ని రాష్ట్రాల్లోకంటే.. మన రాష్ట్రంలోనే రేట్లు భారీగా ఉన్నాయి. హార్మోనిక్ సర్ చార్జీల్ని ఉపసంహరించుకోవాలి. సాంకేతిక, వాణిజ్యపరమైన నష్టాల్ని నియంత్రించాలి. ప్రభుత్వం పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నదనేది ప్రకటనలకే పరిమితమవుతోంది. - సుజాత, ఫ్యాప్సీ లాభాలు పక్కదారి ఈపీడీసీఎల్ లాభాల్ని పక్క డిస్కంలకు సర్దుబాటు చేస్తున్నారు. నష్టాల్ని మాత్రం ఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులపై వేస్తున్నారు. కేవలం ఇక్కడి ఈపీడీసీఎల్లోనే శతశాతం బిల్లు వసూళ్లున్నాయి. దిగువ, మధ్య తరగతి వినియోగదారులు 1.97 కోట్ల మంది ఉంటే.. వారికి 31 శాతం పెంపు వర్తింపజేస్తూ.. పెద్దలకు మాత్రం 17 శాతం పెంచడం దారుణం. ఎల్వీఎస్ నుంచి ఒక్క యూనిట్ కూడా తీసుకోనప్పటికీ.. ఏటా దానికి రూ.కోట్లలో చెల్లిస్తున్నారు. సామాజిక ఆడిట్ అస్సలు జరగట్లేదు. విద్యుత్ కొనుగోలు సమయంలో ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలి. - బి.గంగారావు, విశాఖ కార్యదర్శి, సీపీఎం ఐటీ పరిశ్రమ కుదేల్ ఐటీ పరిశ్రమకు విద్యుత్ పరంగా కనీస ప్రోత్సాహం లేదు. వేసవిలో యూనిట్‌కు రూ.50 వరకు వసూలు చేస్తుంటే.. పరిశ్రమల్ని మూసేయాల్సి వస్తోంది. నిరుద్యోగం పెరుగుతోంది. పంపిణీ నష్టాల్లో కేవలం 6 శాతం మాత్రమే ఉన్న డిస్కంగా ఈపీడీసీఎల్ పేరొందినా.. దీని పరిధిలో విద్యుత్ కేటాయింపులు మాత్రం ఆశించినంతగా లేవు. వచ్చిన కేటాయింపుల్లో కూడా ఎక్కువగా రక్షణ రంగానికే ఇస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వ వాటా నుంచే నేరుగా పంపిణీ చేసి, ఈపీడీసీఎల్ కోటాలో విశాఖకు ఎక్కువ ప్రాధాన్యతివ్వాలి. - నరేష్కుమార్, కార్యదర్శి, వీడీసీ రిలయన్స్ కేసులో ఇంప్లీడ్ కండి రిలయన్స్‌తో కేంద్రం ఒప్పందం సరికాదు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసులో డిస్కంలు కూడా ఇంప్లీడ్ అయ్యేలా ఏపీఆర్ఈసీ చొరవ చూపాలి. ప్రయివేటు విద్యుత్ సంస్థలు తప్పుడు లెక్కలు, ప్రభుత్వాల్ని ప్రలోభాలకు గురిచేసి ఫక్తు వ్యాపార ధోరణిలో నడుస్తున్నాయి. హిందూజా ప్లాంట్ గతంలో చేసుకున్న ఒప్పందాన్ని కూడా మార్పులు చేస్తోంది. ఈపీడీసీఎల్ మాదిరి మిగిలిన డిస్కంలలో కూడా నష్టాలను తగ్గించడం ద్వారా ఏటా రూ.5 వేల కోట్ల వరకు ఆదా చేయొచ్చు. - జె.వి.సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి, సీపీఐ