ARR
-
మిగులు విద్యుత్ మోపెడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–26లో ఏకంగా 25,312 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ మిగిలిపోనుంది. వచ్చే ఏడాది రాష్ట్ర విద్యుత్ అవసరాలు 98,319 ఎంయూగా అంచనా వేయగా.. 1,23,631 ఎంయూ విద్యుత్ లభ్యత ఉండనుంది. ఇప్పటికే కుదుర్చుకున్న/భవిష్యత్తులో చేసుకోనున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మేరకు ఇంత భారీగా విద్యుత్ సమకూరనుంది. కొనుగోలు చేసే విద్యుత్‌లో రాష్ట్ర అవసరాలు పోగా 25,312 ఎంయూ మిగిలిపోనుంది. సగటున యూనిట్‌కు రూ.5.54 ధర లెక్కన మిగులు విద్యుత్ విలువ రూ.14,022.84 కోట్లు అవుతోంది. అదనంగా ఉందనే ఉద్దేశంతో మిగులు విద్యుత్‌ను కొనుగోలు చేయకపోయినా... ఒప్పందాల మేరకు విద్యుదుత్పత్తి సంస్థలకు ఫిక్స్డ్ చార్జీలు చెల్లించాల్సిందే.అంటే డిస్కంలపై, పరోక్షంగా రాష్ట్ర ప్రజలపై భారం పడినట్టే అవుతుందని విద్యుత్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విద్యుత్ అవసరాలు 98,318 ఎంయూ కాగా.. డిస్కంలు రాష్ట్రంలోని వినియోగదారులకు విక్రయించనున్న మొత్తం విద్యుత్ 87,384 ఎంయూ మాత్రమే. మిగతా 10,934 ఎంయూ విద్యుత్‌ను డిస్కంలు ‘సాంకేతిక, వాణిజ్య నష్టాల (ఏటీ అండ్ సీ లాసెస్)’రూపంలో నష్టపోనున్నాయి. ఈ నష్టాల విలువ సుమారు రూ.6,057.43 కోట్లు కావడం గమనార్హం. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇటీవల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సమర్పించిన ‘వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) 2025–26’లో వెల్లడించిన వివరాలు ఈ వాస్తవాలను స్పష్టం చేస్తున్నాయి. రూ.20,151 కోట్ల విద్యుత్ సబ్సిడీ అవసరం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కోసం 2025–26లో రూ.65,849 కోట్లు వ్యయం కానుండగా.. ప్రస్తుత విద్యుత్ చార్జీలతో డిస్కంలకు రూ.45,698 కోట్లే ఆదాయం అందుతుంది. అయినా విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రస్తుత చార్జీలనే కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. దీనితో మిగిలిన రూ.20,151 కోట్ల ఆదాయ లోటును భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను పెంచక తప్పదని.. లేకుంటే డిస్కంలు గట్టెక్కే అవకాశాలు ఉండవని విద్యుత్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రూ.64,227 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న డిస్కంలు ఆర్థికంగా మరింత కుంగిపోతాయని పేర్కొంటున్నాయి.భారీగా పెరిగిన కాస్ట్ ఆఫ్ సర్విస్! విద్యుత్ కొనుగోలు చేసేందుకు డిస్కంలు మొత్తంగా రూ. 50,572 కోట్లను ఖర్చు చేయనున్నాయి. అంటే విద్యు దుత్పత్తి కంపెనీలకు ఒక్కో యూనిట్‌కు సగటున రూ.5.54 చెల్లించనున్నాయి. అయితే వినియోగదారులకు సరఫరా చేసేసరికి వ్యయం యూనిట్‌కు రూ.7.54కు చేరుతోంది. ఇలా విద్యుత్‌ను వినియోగదారులకు చేర్చే సరికి అయ్యే వ్యయాన్ని విద్యుత్ రంగ పరిభాషలో ‘కాస్ట్ ఆఫ్ సర్విస్’అంటారు. విద్యుత్ ఉద్యోగుల జీతభత్యాలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, పర్యవేక్షణ వ్యయాలు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, ఇతర వ్యయాలన్నీ ఇందులో కలసి ఉంటాయి. అంటే సగటున ఒక్కో యూనిట్‌కు రూ.2 చొప్పున పెరిగిపోయినట్టు కాస్ట్ ఆఫ్ సర్విస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎనీ్పడీసీఎల్) కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఏకంగా యూనిట్‌కు రూ.8.28గా ఉండటం ఆందోళనకరమని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) కాస్ట్ ఆఫ్ సర్విస్ యూనిట్‌కు రూ.7.26గా ఉండటం గమనార్హం. -
కరెంటు చార్జీలు పెరగవు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–26లో సైతం విద్యుత్ చార్జీలు పెరగవు. ప్రస్తుత చార్జీలనే యథాతథంగా కొనసాగించాలని కోరుతూ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరాయి. ఈ మేరకు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలు 2025–26ను మంగళవారం ఈఆర్సీకి సమర్పించాయి. డిస్కంల అంచనాల ప్రకారం 2025–26లో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని రకాల ఖర్చులు కలిపి మొత్తం రూ.65,849 కోట్ల వ్యయం కానుంది. అందులో విద్యుత్ కొనుగోళ్లకే రూ.50,572 కోట్ల వ్యయం కానుండగా, నిర్వహణ, పర్యవేక్షణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు కలిపి మిగిలిన వ్యయం కానుంది. అయితే, ప్రస్తుత చార్జీలతో రూ.45,698 కోట్ల ఆదాయం మాత్రమే రానుంది. దీంతో విద్యుత్ చార్జీలు పెంచకపోతే రూ.20,151 కోట్ల నష్టాలను మూటగట్టుకోనున్నాయి. అయితే, డిస్కంలు సమర్పించిన అంచనా ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన తర్వాత హైదరాబాద్, వరంగల్‌లో బహిరంగ విచారణ సైతం జరపనుంది. అనంతరం వాస్తవికతకు దగ్గరగా ఉండేలా డిస్కంల అంచనాలను సవరిస్తూ ఆమోదించనుంది. ఒకవేళడిస్కంల ఆదాయ లోటు రూ.20,151 కోట్లు వాస్తవమేనని ఈఆర్సీ ఆమోదిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను పెంచాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వంపై సబ్సిడీల భారం పడకుండా గతంలో ఈఆర్సీ.. డిస్కంల ఆదాయ లోటును తగ్గించి చూపించినట్టు విమర్శలున్నాయి. ఏటేటా నష్టాలు ప్రభుత్వం ఏ మేరకు సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరిస్తే ఆ మేరకు మాత్రమే ఆదాయ లోటు ఉందని ఈఆర్సీ నిర్ధారించడంతో డిస్కంల నష్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. 2023–24లో రూ.6,299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, టీజీఎన్పీడీసీఎల్ రూ.17,756 కోట్ల నష్టాల్లో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం డిస్కంలకు రూ.11,499 కోట్ల సబ్సిడీలను చెల్లించేందుకు అంగీకరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి సబ్సిడీలను మరింతగా పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, విద్యుత్ టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించినా, హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులకు గ్రిడ్ సపోర్ట్ చార్జీలతోపాటు స్టాండ్ బై చార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీలను మాత్రం సవరించాలని డిస్కంలు ఈఆర్సీని కోరినట్టు తెలిసింది. -
ఆంధ్రప్రదేశ్: విద్యుత్ చార్జీలు పెంచం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) భారీ ఊరటనిచ్చాయి. వచ్చే ఏడాది ఏ వర్గం వినియోగదారులపైనా విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రకటించాయి. రూ.13,878.11 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ చార్జీల భారం వేయబోమని స్పష్టం చేశాయి. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యుత్ ప్రసార (ఏపీ ట్రాన్స్‌కో), పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2024–25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), 2024–2029 నియంత్రణ కాలానికి సంబంధించి నెట్వర్క్ ఆదాయ అవసరాల నివేదికలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించాయి. ఈ నివేదికలోని ముఖ్యాంశాలను ఇంధన శాఖ శుక్రవారం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తక్కువ ధరలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు కట్టుబడి ఉన్నాయని తెలిపింది. దానికి తగ్గట్టుగానే ఏఆర్‌ఆర్‌లలో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపుదలను ప్రతిపాదించలేదని వివరించింది. లోటు ఉన్నప్పటికీ భారం మోపబోం.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 74,522.67 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని డిస్కంలు అంచనా వేశాయి. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 12,321.58 మిలియన్ యూనిట్లు అవసరమని నివేదించాయి. మొత్తం మీద 83,118.13 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని లెక్కగట్టాయి. విద్యుత్ ప్రసార నష్టాలు 2.6 శాతం, ఇంటర్ స్టేట్ నష్టాలు 0.9 శాతం, పంపిణీ నష్టాలు 6.84 శాతం, మొత్తం ట్రాన్స్మిషన్ అండ్ డి్రస్టిబ్యూషన్ నష్టాలు 10.34 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేశాయి. ఈ లెక్కన విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.39,017.60 కోట్లు అవుతుందని భావిస్తున్నాయి. అది కాకుండా ట్రాన్స్మిషన్ అండ్ లోడ్ డిస్పాచ్ ఖర్చు రూ.5,722.88 కోట్లు, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ ధర రూ.9,514.42 కోట్లు, ఇతర ఖర్చులు రూ.2,321.13 కోట్లుగా పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. దీని ప్రకారం మొత్తంగా రూ.56,576.03 కోట్ల రాబడి అవసరమని నివేదించాయి. అయితే అన్ని రకాల ఆదాయాలు కలిపి రూ.42,697.92 కోట్లు మాత్రమే వస్తున్నాయని.. దీంతో రూ.13,878.11 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని వివరించాయి. అయినప్పటికీ ఈ లోటును భర్తీ చేసుకోవడం కోసం ప్రజలపై చార్జీల భారం మోపాలనుకోవడం లేదని ఏపీఈఆర్సీకి డిస్కంలు నివేదించాయి. యధావిధిగా ఉచిత, రాయితీలు రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వం డిస్కంలకు తిరిగి చెల్లిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా డిస్కంలు దాదాపు రూ.11,800 కోట్ల రెవెన్యూ లోటుతో వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో డిస్కంలను ఆదుకోవడానికి రూ.10,135.22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. అలాగే ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరా, తక్కువ స్లాబ్ గృహవినియోగదారులకు సబ్సిడీ, ఆక్వాకల్చర్ రైతులు, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులు, పవర్ లూమ్స్, హ్యాండ్లూమ్స్, సెలూన్లు, గోల్డ్ ప్లేటింగ్, రజక సంఘాలు మొదలైన వాటికి రాయితీలు వచ్చే ఏడాది కూడా కొనసాగనున్నాయి. దీంతో డిస్కంలు వినియోగదారుల టారిఫ్‌లలో ఎలాంటి మార్పును ప్రతిపాదించలేదు. -
ఛత్తీస్‌గఢ్ విద్యుత్ చాలా చౌక!
యూనిట్ రూ. 3.90కే లభిస్తుందని డిస్కంల అంచనాలు ఏడాదికి విద్యుత్ కొనుగోలు వ్యయం రూ. 2,528 కోట్లు ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఖరారు చేసిన తాత్కాలిక ధరే దీనికి ప్రామాణికం వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్ఆర్) నివేదికలో డిస్కంల లెక్కలు ఇంకా వాస్తవ ధరను ఖరారు చేయని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ సాక్షి, హైదరాబాద్: చౌక ధరకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లభించ నుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంచనాలను సమర్పిం చాయి. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ యూనిట్ లభ్యత ధర ప్రాథమికంగా రూ.3.90 ఉండనుందని తాజాగా ఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) 2017-18లో పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం 2015 సెప్టెంబర్ 22న దీర్ఘకాలిక ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ విద్యుత్‌కు సంబంధించిన తుది ధరను ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఖరారు చేయాల్సి ఉండగా, ఇంత వరకు కాలేదు. అయితే, 2016-17లో ఈ విద్యుత్‌ను రూ.3.90కు యూనిట్ చొప్పున విక్రయించాలని ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఏడాది కింద తాత్కాలిక ధరను ఖరారు చేసింది. ఇదే ధరను 2017-18 కోసం తెలంగాణ డిస్కంలు టీఎస్ ఈఆర్సీకి ప్రతిపాదించారుు. అరుుతే, 2017-18కి సంబంధించిన ధరను ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఖరారు చేయకపోవడం గమనార్హం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలోగా ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అసలు ధరలపై స్పష్టత వచ్చే అవకాశముంది. అసలు ధర ఎంత? ఖరీదైన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారనుందని విద్యుత్‌రంగ నిపుణుల అభ్యంతరాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పన్నులు, సుంకాలు, వివిధ దశల్లోని ట్రాన్సమిషన్ చార్జీలు కలుపుకుని ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వచ్చే సరికి వ్యయం యూనిట్‌కు రూ.5.50 వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. దీంతో ఈ విద్యుత్ వల్ల రాష్ట్రంపై ఏటా రూ.వెయి కోట్ల అదనపు భారం పడుతుందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరలు తగ్గించేందుకు పీపీఏలో కొన్ని సవరణలు చేయాలని టీఎస్ఈఆర్సీ సైతం డిస్కంలకు సూచించింది. పీపీఏలో సవరణల విషయంలో ఛత్తీస్‌గఢ్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ పీపీఏను టీఎస్ఈఆర్సీ ఆమోదించిన తర్వాతే విద్యుత్‌ను రాష్ట్ర డిస్కంలు కొనుగోలు చేయాల్సి ఉండనుంది. అయితే, ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌కు సంబంధించిన తుది ధరను ఆ రాష్ట్ర ఈఆర్సీ ఖరారు చేయాల్సి ఉంది. ఆ ధరలతోనే మన డిస్కంలు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉండనుంది. ఏడాదికి వ్యయం రూ.2,528 కోట్లు మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 2017-18 లో రాష్ట్రానికి 6,482.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభ్యత ఉండనుందని, ఈ విద్యుత్ కొనుగోలు వ్యయం రూ.2,528 కోట్లు కానుందని డిస్కంల అంచనాలు పేర్కొంటున్నాయి. యూనిట్‌కు రూ.3.90 లెక్కన కొనుగోలు చేస్తేనే ఈ మేరకు వ్యయం కానుంది. వాస్తవ ధర ఇంత కంటే ఎక్కువ ఉంటే వందల కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశముంది. -
ప్రతి పనికి పైసలే!
హైదరాబాద్: విద్యుత్ సిబ్బంది లంచగొండితనం, ఏటా వందల మంది రైతులు, కాంట్రాక్టు ఉద్యోగుల మృతికి కారణమవుతున్న విద్యుదాఘాతాలు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులో తీవ్ర జాప్యం.. వేళాపాల లేని విద్యుత్ సరఫరా.. ప్రభుత్వ రాయితీల్లో కోత.. తదితర అంశాలపై రైతు సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వినియోగదారులు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(టీఎస్ఎస్పీడీసీఎల్)పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా సంస్థ పనితీరులో ఏ మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015-16 సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపు కోసం ఎస్పీడీసీఎల్ సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)పై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) శుక్రవారం ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన బహిరంగ విచారణలో డిస్కంల పనితీరుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కంల పద్ధతిలో మార్పు రాకుంటే ఈ విచారణలు ఎందుకని, వచ్చే ఏడాది నుంచి మానుకోవాలని ఈఆర్సీ చెర్మైన్ ఇస్మాయిల్ అలీ ఖాన్, సభ్యులు హెచ్ శ్రీనివాసులు, ఎల్.మనోహర్‌రెడ్డి ఎదుట వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనలు బహిర్గతం
-
మధ్యతరగతిపై మోత!
కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనలు బహిర్గతం ఒక్కో యూనిట్‌పై కనిష్టంగా 10 పైసల నుంచి గరిష్టంగా 48 పైసల వరకూ వడ్డింపు వంద యూనిట్లలోపు వినియోగిస్తే ప్రస్తుత చార్జీలే 200 యూనిట్ల వరకు 4% పెంపు.. ఆపై 5.75 శాతం వాత 26.30 లక్షల గృహాలపై చార్జీల పెంపు ప్రభావం పరిశ్రమలపై 4.75% చార్జీల పెంపు రూ. 1,088.68 కోట్ల వరకూ భారం ఇంకా రూ. 6,476.23 కోట్ల లోటు చూపిన డిస్కంలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యతరగతికి విద్యుత్ షాక్ తగలనుంది.. తక్కువ విద్యుత్ ఉపయోగించే పేదలకు మాత్రం మినహాయింపు లభించినా... ఎక్కువ విద్యుత్ వినియోగించేవారిపై చార్జీల మోత మోగనుంది. వివిధ కేటగిరీల వారీగా నాలుగు శాతం నుంచి 5.75 శాతం వరకు పెంపును వడ్డించనున్నారు. మొత్తంగా కొత్త రాష్ట్రంలో తొలిసారిగా విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ప్రజలపై రూ. 1,089 కోట్ల భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిస్కంలు 2015-16 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను (ఏఆర్‌ఆర్‌లు) గత శనివారమే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి (టీఎస్ఈఆర్సీ) సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కొత్త చార్జీల వివరాలను గోప్యంగా ఉంచిన డిస్కంలు... రెండు రోజుల పాటు హైడ్రామా నడిపించాయి. దీంతో ప్రతిపాదనల వివరాలను మంగళవారం రోజున వెబ్సైట్లో పెట్టాలని సోమవారం డిస్కంలకు ఈఆర్సీ మెమో జారీ చేసింది కూడా. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ ఈఆర్సీ కార్యాలయంలో టీఎస్ఎస్పీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, డెరైక్టర్ శ్రీనివాసరావు, టీఎస్ఎన్పీడీసీఎల్ అధికారులతో సమావేశమయ్యారు. చార్జీల వివరాలు, ఏఆర్ఆర్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని వారికి సూచించారు. భేటీ అనంతరం డిస్కంల ప్రతిపాదనల వివరాలను ఈఆర్సీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. గరిష్టంగా 48 పైసల వరకూ.. వివిధ కేటగిరీల్లో చార్జీల పెంపు నాలుగు శాతం నుంచి 5.75 శాతం వరకు ప్రతిపాదించారు. ఒక్కో యూనిట్‌పై కనిష్టంగా 10 పైసల నుంచి గరిష్టంగా 48 పైసల వరకు పెంచుతూ రేట్ల పట్టికను తయారు చేశారు. ఈ కొత్త టారిఫ్ ప్రకారం వంద యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ప్రస్తుతమున్న చార్జీలే వర్తిస్తాయి. 101-200 యూనిట్ల మధ్య విద్యుత్ వినియోగించే గృహాలకు నాలుగు శాతం చార్జీలు పెరుగుతాయి. మిగతా అన్ని కేటగిరీలకు 5.75 శాతం చార్జీని వడ్డించారు. పరిశ్రమల కేటగిరీలో 4.75 శాతం పెంపును ప్రతిపాదించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం యథాతథంగా కొనసాగుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో మొత్తంగా రూ. 7,564.91 కోట్ల లోటును చూపించాయి. ఇందులో రూ. 1,088.68 కోట్లను చార్జీల పెంపు ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈఆర్సీని కోరాయి. ఈ పెంపు అమలైనా కూడా రూ. 6,476.23 కోట్లు నికరంగా లోటు ఉంటుంది. దీనిని పూడ్చుకునేందుకు డిస్కంలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు రూ. 300 కోట్ల చొప్పున ఏటా రూ. 3,600 కోట్లు సబ్సిడీగా తెలంగాణ సర్కారు డిస్కంలకు చెల్లిస్తోంది. వచ్చే ఏడాది అదనంగా మరో రూ.2,876.23 కోట్లను సర్కారు నుంచి ఆశిస్తున్నట్లు డిస్కంల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో సరిపడేంత విద్యుత్ అందుబాటులో లేకపోవటంతో పాటు, విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావటంతో.. గతంతో పోలిస్తే డిస్కంల ఖర్చులు పెరిగిపోయాయి. 2015-16లో మొత్తం రూ. 26,473.76 కోట్ల వ్యయం అవుతుందని.. ప్రస్తుత చార్జీల ద్వారా రూ. 18,908.85 కోట్లు ఆదాయం వస్తుందని.. పెంపుతో అదనంగా మరో రూ.1,088.68 కోట్లు ఆదా యం వస్తుందని డిస్కంలు పేర్కొన్నాయి. పేదలకు ఊరట చార్జీల పెంపుతో దాదాపు 70% మంది వినియోగదారులకు అదనపు భారమేమీ ఉండబోదని డిస్కంలు చెబుతున్నాయి. తెలంగాణలో వంద యూనిట్లలోపు వినియోగించే కుటుంబాలు సుమారు 62.10 లక్షలు ఉన్నాయి. వారందరికీ ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీలే వర్తించనున్నాయి. అంతకు మించి విద్యుత్ వినియోగించే 26.3 లక్షల కుటుంబాలపై చార్జీల భారం పడుతుంది. 200 యూనిట్లు దాటితే వాత: తాజా చార్జీల పెంపు ప్రతిపాదనలను పరిశీలిస్తే... వంద యూనిట్ల వరకు భారం లేకున్నా, విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే స్లాబ్ పద్ధతిలో రేట్లు వర్తిస్తాయి. దీంతో వినియోగదారులపై ఎక్కువగా భారం పడనుంది. సాధారణంగా 200 యూనిట్లు వినియోగించే మధ్య తరగతి గృహాలకు ప్రస్తుత పెంపుతో విద్యుత్ బిల్లు రూ. 600 నుంచి రూ. 625కు పెరుగుతుంది. కానీ అంతకన్నా అదనంగా ఒక్క యూనిట్ వాడితే.. బిల్లు అమాంతం రూ. 872.75కు చేరుతుంది. 500 యూనిట్లు వాడే వినియోగదారులు ప్రస్తుతం రూ. 3,007 వరకు చెల్లిస్తుండగా.. ఈ మొత్తం రూ.3,180.50కు పెరగనుంది. అదే మరో యూనిట్ అదనంగా (501 యూనిట్లు) వాడితే.. బిల్లు మోత ఏకంగా రూ. 4,438.86కు చేరుతుంది. హెచ్చు వినియోగానికి.. 2015-2016 సంవత్సరానికి సంబంధించి డిస్కంలు ఎక్కువ విద్యుత్ వినియోగించేవారికి, పరిశ్రమలు, వ్యవసాయం వంటి పలు రంగాలకు చెందిన పెంపు ప్రతిపాదనలను సమర్పించాయి. గృహ లేదా వాణిజ్యావసరాలకు ఎల్టీ-2 కేటగిరీ కింద 50 యూనిట్ల వరకు రూ. 5.71 చార్జీగా నిర్ణయించారు. ఇక ఎల్టీ-2 (బీ) కేటగిరీలో 0-50 యూనిట్ల వరకు రూ. 7.01, 51-100 యూనిట్ల వరకు రూ. 7.80, 101-300 యూనిట్ల వరకు రూ. 8.60, 301-500 యూనిట్ల వరకు రూ. 9.13, 500పైగా యూనిట్లకు రూ. 9.65 చొప్పున నిర్ధారించారు. ఇక ఎల్టీ-2(సి) కేటగిరీ కింద ప్రకటనల హోర్డింగ్‌లకు రూ.11.66 చార్జీగా నిర్ధారించారు. ఎల్టీ కేటగిరి 3-కింద పరిశ్రమలకు యూనిట్‌కు రూ.6.43, సీజనల్ పరిశ్రమలకు రూ.7.14, చేప/రొయ్యల సాగుకు రూ. 4.90, చెరకు కర్మాగారానికి రూ. 4.90, కోళ్ల ఫారాలకు రూ. 5.95, పుట్టగొడుగులు/కుందేలు ఫారాలకు రూ. 5.95, గ్రీన్హౌస్లో ఫ్లోరికల్చర్కు రూ. 5.95కు చార్జీ పెంపును ప్రతిపాదించారు. ఎల్టీ కేటగిరీ 4- కుటీర పరిశ్రమలు (10హెచ్‌పీపైగా) రూ. 3.97, ఆగ్రోబేస్డ్కు (10హెచ్‌పీపైగా) రూ. 3.97; ఎల్టీ కేటగిరి 5 కింద వ్యవసాయానికి చార్జీలను మార్చలేదు. ఎల్టీ కేటగిరి 6 కింద వీధి దీపాలు, పీడబ్ల్యుఎస్లకు స్వల్పంగా పెం చారు. ఎల్టీ కేటగిరి 7 (ఏ) కింద జనరల్ వినియోగానికి యూనిట్‌కు రూ. 6.91, ఎల్టీ 7(బి) కింద రిలీజియస్ ప్రాంతాల్లో రూ.4.97ను నిర్ధారించారు. ఎల్టీ కేటగిరి 8 కింద తాత్కాలిక సరఫరాకు రూ. 9.97, హెచ్‌టీ-1(ఎ) జనరల్‌లో 11 కెవీ, 33, 132 కేవీలకు సంబంధించి కొద్దిపాటి మార్పులు చేశారు. -
కొత్త విద్యుత్ చార్జీలు నేడు వెల్లడి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు నేడో, రేపో వెల్లడికానున్నాయి. ఇప్పటికే విద్యుత్ సరఫరా సంస్థలు (డిస్కంలు) చార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలతో పాటు ఏఆర్ఆర్లను కూడా ఈఆర్సీకి సమర్పించాయి. ఈ ప్రతిపాదనల వివరాలను వెంటనే వెబ్సైట్లో పెట్టాల్సి ఉన్నా.. డిస్కంలు ఆ పని చేయలేదు. ప్రజలపై ప్రత్యక్షంగా భారం పడే అంశం కావటంతో ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని డిస్కం వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై స్పందించిన ఈఆర్సీ ఆ ప్రతిపాదనల వివరాలను మంగళవారం రోజున ఆన్లైన్లో పెట్టాలంటూ డిస్కంలకు సోమవారం మెమో జారీ చేసింది. దీంతోపాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా సోమవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్న నేపథ్యంలో... చార్జీల పెంపు ప్రతిపాదనలు మంగళవారం లేదా బుధవారం వెల్లడయ్యే అవకాశముంది. -
మా కరెంటులో తెలంగాణకు వాటా
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో తెలంగాణకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది! ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో తెలంగాణకు వాటా ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది! ఏపీఈఆర్సీకి తాజాగా సమర్పించిన వార్షిక ఆదాయ, అవసర నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కమ్‌లు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కృష్ణపట్నం తదితర కేంద్రాల్లో ఉత్పత్తయ్యే కరెంటును తెలంగాణకు ఇచ్చేది లేదని ఇప్పటిదాకా ఏపీ వాదిస్తుండటం, దీనిపై న్యాయ పోరాటానికి తెలంగాణ సిద్ధమవడం, పీపీఏల వివాద పరిష్కారానికి నీరజా మాథుర్ కమిటీ వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు విద్యుత్ వాటా ఇస్తామంటూ ఏకంగా ఏఆర్‌ఆర్‌లో ఏపీ డిస్కంలు పొందుపరచడం రాష్ట్రానికి సానుకూల పరిణామమని నిపుణులు అంటున్నారు. ఏం జరిగింది? రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ప్రభుత్వం జీవో నంబర్ 20 ద్వారా విద్యుదుత్పత్తిని పంపిణీ చేసింది. తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం కేటాయించారు. విభజన తర్వాత అప్పటికి ఉమ్మడిగానే ఉన్న ఏపీఈఆర్సీ పీపీఏలపై తీర్పు చెప్పింది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రం పీపీఏ మినహా మిగతా అన్ని పీపీఏలనూ ఆమోదించినట్టుగానే భావించాలని కేంద్రానికి తెలిపింది. కానీ ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టాక కొత్త వివాదానికి తెర తీశారు. పాత ఈఆర్సీ ఆదేశాలు చెల్లవని, రాష్ట్రంలో ఉత్పత్తయ్యే కరెంటంతా తమకే దక్కుతుందని వాదించారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. పీపీఏలను ఏపీ అంగీకరించకపోవడం వల్ల తమకు 462 మెగావాట్ల వాటా రాకుండా పోతుందని, కృష్ణపట్నం, హిందూజా వాటాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ కరెంటులో తెలంగాణకు వాటా ఇస్తామని ఏఆర్‌ఆర్‌లోనే డిస్కంలు తాజాగా పేర్కొనడం కోర్టులో కూడా తెలంగాణ వాదనకు బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అలాగే కృష్ణపట్నం కరెంటులోనూ తెలంగాణ తన వాటాను మరింత గట్టిగా డిమాండ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. పీపీఏలు ఆమోదం పొందలేదని ఏపీ ప్రభుత్వం కోర్టులో వాదించినా అది నిలబడబోదని అభిప్రాయపడుతున్నారు. -
ఏపీకి కరెంట్ చార్జీల వాత!
-
ఇక చార్జీల మోత
విద్యుత్ భారం రూ. 4,500 కోట్లకు పైగా ⇒ యూనిట్‌కు కనీసం 50 నుంచి 75 పైసల పెంపు! ⇒ ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్ చార్జీలకు అవకాశం ⇒ రూ.7,716 కోట్ల ఆర్థిక లోటుతో ఏఆర్‌ఆర్‌లు సమర్పించిన డిస్కమ్‌లు ⇒ సబ్సిడీపై నోరు మెదపని ప్రభుత్వం ⇒ విద్యుత్ కొనుగోలుతో నష్టాలు పెరిగాయన్న డిస్కమ్‌లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై రూ.4,528 కోట్ల అదనపు విద్యుత్ చార్జీల భారం మోపేందుకు సర్కారు సిద్ధమవుతోంది. సగటున 15 శాతం చార్జీల మోత తప్పదనే సంకేతాలు ఇచ్చింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, వ్యయ నివేదికలను (ఏఆర్‌ఆర్‌లు) మంగళవారం విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించాయి. ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, రెండు విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఈఆర్సీ చైర్మన్ భవానీప్రసాద్‌ను కలిసి ఏఆర్‌ఆర్‌లు అందజేశారు. అంతకుముందు సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి, విద్యుత్ సంస్థల లోటు గురించి వివరించారు. మొత్తం రూ.7,716 కోట్ల మేర ఆర్థిక లోటును డిస్కమ్‌లు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. వీటిని ఎలా భర్తీ చేస్తాయనేది మాత్రం చెప్పలేదు. ఏటా ఏఆర్ఆర్లతో పాటు, కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనలు సమర్పించే డిస్కమ్‌లు ఈసారి ఇందుకు భిన్నంగా వ్యహరించాయి. ఆదాయ, వ్యయ వివరాలను మాత్రమే ఈఆర్సీ ముందుంచాయి. వీటిని పూడ్చుకునేందుకు ఏ కేటగిరీకి ఎంత పెంచుతారు అనే విషయాన్ని గోప్యంగా ఉంచాయి. మరో వారం రోజుల్లో దీనిపై ప్రత్యేకంగా ఈఆర్సీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించాయి. ప్రభుత్వం ప్రకటించే సబ్సిడీని బట్టి చార్జీల పెరుగుదల ఉండే వీలుంది. అయితే సబ్సిడీ ఎంతో సర్కారు ఇప్పటివరకు తేల్చలేదు. గత ఏడాది మాదిరి రూ. 3,188 కోట్లు ఇచ్చినా, ఇంకా రూ.4,528 కోట్ల మేర ప్రజల నుంచే వసూలు చేయక తప్పదని తెలుస్తోంది. 100 యూనిట్లలోపు వినియోగదారులకు చార్జీల నుంచి ఊరట ఇస్తామంటూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా.. లోటు భర్తీకి ఆపై విద్యుత్ వాడకం దారులకు భారీగానే వాత ఖాయంగా కన్పిస్తోంది. యూనిట్‌కు కనీసం 50 నుంచి 75 పైసల మేర పెరిగే వీలుంది. వచ్చే నెల 2న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనిపై స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఆ మొత్తం ఆధారంగా డిస్కమ్‌లు కొత్త విద్యుత్ టారిఫ్‌ను రూపొందిస్తాయి. ఒకవేళ సబ్సిడీ ఇవ్వని పక్షంలో మొత్తం రూ.7,716 కోట్ల లోటును డిస్కమ్‌లు ప్రజల నుంచే వసూలు చేస్తాయి. మొత్తం మీద వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి వస్తాయి. దక్షిణ ప్రాంత (ఎస్పీడీసీఎల్), తూర్పు ప్రాంత (ఈపీడీసీఎల్) పంపిణీ సంస్థలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,308 కోట్లు అవసరమని ప్రతిపాదించాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీల ద్వారా రూ.22,592 కోట్లు వస్తాయని పేర్కొంది. ఇంకా రూ.7,716 కోట్లు అవసరమని (లోటు) స్పష్టం చేశాయి. ప్రస్తుతం యూనిట్ విద్యుత్‌కు రూ. 1.55 పైసలు నష్టం వస్తోందని డిస్కమ్‌లు తెలిపాయి. విద్యుత్ కొనుగోళ్ళ భారం ఆర్థిక లోటుకు దారి తీసినట్టు వివరించాయి. రాష్ట్రంలో 58,191 మిలియన్ యూనిట్లు (ఎంయూలు) విద్యుత్ అవసరం ఉంటే, అందుబాటులో ఉన్నది 54,884 ఎంయూలేనని, డిమాండ్, లభ్యత మధ్య 3,307 మిలియన్ యూనిట్ల అంతరం ఉందని పేర్కొంది. ఈ వ్యత్యాసాన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు.