యువత ఉపాధికి.. కొత్తబాట | new route... youth employment | Sakshi
Sakshi News home page

యువత ఉపాధికి.. కొత్తబాట

Published Fri, Aug 22 2014 3:30 AM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM

యువత ఉపాధికి.. కొత్తబాట - Sakshi

యువత ఉపాధికి.. కొత్తబాట

భారీస్థాయిలో ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం
రూరల్ లైవ్లీహుడ్ మిషన్‌గా డీఆర్‌డీఏ   
నిర్వహణపై కేంద్రం ప్రత్యేక దృష్టి
శాశ్వత లక్ష్యంగా పనిచేయనున్న మిషన్    
 యువతకు మరింత రాయితీ..
పాలమూరు : దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలైన పల్లె లిప్పుడు కరువు కాటేయడంతో విలవిల్లాడిపోతున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల్లోని యువకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక అవస్థలు పడుతున్నారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకొని వలసబాట పట్టడంతో.. ఊర్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. సాయంత్రమైతే గ్రామాల్లో పెద్దలు రచ్చబండ వద్ద, యువకులు మరోచోట సమావేశమై ఆ రోజు విశేషా లను చెప్పుకొని ఆనందపడే పరిస్థితులు ఇప్పుడెక్కడా కనబడటం లేదు. బతుకుదెరువుకోసం గ్రామాలను విడిచి పట్టణాలకు వలసవెళ్లే వారి సంఖ్య పెరగడంతో  పల్లెలు మూగబోతున్నాయి. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 41లక్షలు.

అందులో సగభాగం యువతే.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత తగిన ఉద్యోగావకాశాల్లేక నిస్తేజంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో..గ్రామీణ యువతకు శాశ్వత ఉపాధి అవ కాశాలు కల్పించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)ను రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కొత్తరూపు తీసుకువచ్చి గ్రామీణాభివృద్ధికి కొత్తబాట వేసేందుకు కా ర్యాచరణ చేపట్టారు. ఈమేరకు సర్కారు కసరత్తు మొదలు పెట్టిం ది. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులపై దృష్టి సారించగా.. ఇకపై గ్రామీణ ప్రాంతా ల్లో శాశ్వత ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల గ్రా మీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించి ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే పలురాష్ట్రాల్లో ఈ మిషన్ ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
 
అధికమొత్తంలో నిధులు
గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధిని కల్పించి నిరుద్యోగాన్ని రూపుమాపడమే లక్ష్యంగా ఈ మిషన్ పనిచేస్తుంది. ఎస్జీఎస్‌వై కింద జిల్లాలో నిరుద్యోగ యువతకిస్తున్న రుణాలపై ఏటా 4కోట్ల రూపాయల వరకు రాయితీని భరిస్తున్నారు. అయితే కొత్తగా చేపట్టే గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఆర్‌ఎల్‌ఎం) ద్వారా కొత్త కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన నిధులను కూడా సర్కారు వెనక్కు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అందుబాటులో ఉన్న నిధులను సర్కారు ఖాతాలో జమచేశారు. అయితే ఆర్‌ఎల్‌ఎం ద్వారా శాశ్వత ఉపాధి ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.

అంటే అరకొరగా కాకుండా ఉపాధి యూనిట్‌ను నెలకొల్పేందుకు అవసరమయ్యేలా అధిక మొత్తంలో రుణ సదుపాయాన్ని కల్పించడంతో పాటు పెద్దఎత్తున రాయితీలు ఇవ్వనున్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్రం స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్‌జీఎస్‌వై)ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకు ద్వారా రాయితీ రుణాలిస్తున్నారు. అయితే ఈ రాయితీ రుణాలు అరకొరగా ఉండడంతో ఆశించిన స్థాయిలో పురోగతి ఉండడం లేదు. ఈ నేపథ్యంలో భారీస్థాయిలో రుణాలిచ్చి ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది.

ఇందులో భాగంగా కొత్తగా చేపట్టే ఆర్‌ఎల్‌ఎమ్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు.
 నిర్వహణలో మార్పు: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రా మీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టులు కొనసాగుతుండగా.. ప్రపంచ బ్యాంకు నిధులతో ఐకేపీ ద్వారా పలు కార్యక్రమాలు నడుస్తున్నా యి. ఈ రెండు కూడా ఒకే విభాగంలో ఉన్నప్పటికీ ఖాతాల నిర్వహణ తదితర అంశాలన్నీ వేర్వేరుగా సాగుతున్నాయి. అయితే తాజాగా చేపట్టే ఆర్‌ఎల్‌ఎం ఖాతాలను, ఐకేపీ ఖాతాలను ఇకపై ఒక్కరికే అప్పగించనున్నారు. దీంతో ఈ నిర్వహణ ప్రక్రియ వేగవంతం కానుంది. అంతే కాకుం డా ఉద్యోగుల విషయంలోనూ కీలకమైన మార్పులుంటాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement