Rural Livelihood Mission
-
గ్రామీణ జీవనోపాధిం రయ్.. రయ్
రాష్ట్రంలో గత ఆర్థిక ఏడాది (2023–24)లో గ్రామీణ జీవనోపాధి గణనీయంగా మెరుగు పడింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం భారీగా తగ్గింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో ప్రజల పొదుపు సైతం ఎక్కువగానే ఉంది. ఈ ప్రగతి సాధనలో నాటి ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ పథకాలు కీలక పాత్ర పోషించాయి. – ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక సాక్షి, అమరావతి: గత∙ఆర్థిక ఏడాదిలో మన రాష్ట్రంలో గ్రామీణ జీవనోపాధి గణనీయంగా మెరుగుపడటంతోపాటు జాతీయ స్థాయిని మించి ప్రజల నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంతో పాటు దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం తగ్గిందని చెప్పింది. ఇందుకు ఆయా ప్రభుత్వాలు గ్రామీణ ప్రజలకు నగదు బదిలీ ద్వారా పథకాలను అమలు చేయడం, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగు పరచడమే కారణమని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రైతుల ఆదాయం పెరిగిందని తెలిపింది.దీంతో గ్రామీణ జీవనోపాధి గణనీయంగా మెరుగు పడినట్లు నివేదిక పేర్కొంది. మధ్య ఆదాయ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో 2011–12లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం 53 శాతం ఉండగా, 2022–23లో 39 శాతానికి తగ్గిందని, 2023–24లో 35 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. దేశంలో కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం భారీగా తగ్గిందని తెలిపింది. 2009–10లో గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగం వ్యయంలో అంతరం 88.2 శాతం ఉండగా, 2023–2024లో 69.7 శాతానికి తగ్గిందని పేర్కొంది.2022–23తో పోల్చితే 2023–24లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం పెరుగుదలలో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపింది. పట్టణ నెలవారీ తలసరి వినియోగ వ్యయం కన్నా, గ్రామీణ తలసరి వినియోగం వ్యయం పెరుగుదల ఏపీలో ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. జాతీయ స్థాయిలో పొదుపు 31 శాతం ఉంటే, రాష్ట్రంలో 34 శాతం ఉందని వెల్లడించింది. దేశంలో 2022–23లో గ్రామీణ పేదరికం 7.20 శాతం ఉండగా, 2023–24లో 4.86 శాతానికి తగ్గిందని తెలిపింది. పట్టణాల్లో 2022–23లో 4.60 శాతం పేదరికం ఉండగా, 2023–24లో 4.09 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది. -
శాశ్వత ఉపాధికి..సర్కారు కసరత్తు
సాక్షి, మంచిర్యాల : స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్జీఎస్వై) పథకాన్ని మరింత నవీకరించేందుకు కేంద్ర సర్కారు నడుం బిగించింది. ఈ పథకంలో మార్పు చేయడమే కాకుండా దాని స్థానంలో కొత్త పేరుతో మరో పథకాన్ని తీసుకువచ్చే దిశగా కసరత్తు సాగుతోంది. ఇందులో భాగంగా పెద్దఎత్తున రుణంతోపాటు అధిక సబ్సిడీని ఇచ్చే మార్గదర్శకాలను సిద్ధంచేస్తోంది. రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఆర్ఎల్ఎం) పేరుతో శాశ్వత ఉపాధి కల్పించేందుకు పథకాన్ని రూపొందించే దిశగా కసరత్తు వేగంగా జరుగుతోందని గ్రామీణాభివృద్ధి సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. పల్లెల పరిపుష్టే ధ్యేయం.. పల్లెలను కరువు కాటేసిన స్థితిలో రైతులతోపాటు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు చెందిన యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గ్రామాల నుంచి హైదరాబాద్, ముంబై వంటి ప్రాంతాలకు వలసబాట పట్టిన వారున్నారు. ఇటీవల తెలంగాణ సర్కారు నిర్వహించిన సమగ్ర సర్వేకు హాజరైన వారిలో కొందరికి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ‘ఈ ఏడాది వానలు పడేట్లు లేవు. మేం కూడా మీ దగ్గరకు వచ్చి ఏదో పనిచేసుకుంటాం. మాకు కూడా జర పని సూడుండ్రి’ అంటూ హైదరాబాద్, ముంబయి, భీవండి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి విన్నవించుకోవడం కనిపించింది. వలసలకు వెళ్లిన వారు సర్వేకు పెద్దఎత్తున తిరిగిరావడం సైతం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ పరిస్థితులన్నీ గమనించి సర్కారు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సమాయత్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధి కల్పించే దిశగా ఒక పథకం రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది. ఇప్పటివరకు మహిళలకు, స్వయం ఉపాధి సంఘాలకు ఉపాధి కల్పించడంపైనే దృష్టిసారించిన గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ)ను ఇందుకు ఎంచుకున్నట్లు సమాచారం. అధిక రుణం.. ఎక్కువ సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్జీఎస్వై) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకు ద్వారా రాయితీ రుణాలిస్తున్నారు. ఈ రాయితీ అరకొరగా ఉండటంతో ఆశించిన స్థాయిలో నిరుద్యోగులు ఉపాధి పొందేందుకు ముందుకు రావడంలేదని సర్కారు భావించింది. తాజాగా ఏర్పాటు చేయబోయే పథకంలో అధిక మొత్తంలో రుణ సదుపాయాన్ని కల్పించడంతోపాటు యూనిట్ కాస్ట్లో పెద్దఎత్తున రాయితీలు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చర్యల ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉపాధి యూనిట్లను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామీణాభివృద్ధి సంస్థ, ప్రపంచ బ్యాంకు నిధులతో ఐకేపీ ద్వారా చేసే పనులను సమష్టిగా ఒక్కరే నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో పాలన పరమైన అనుమతులతోపాటు ఉపాధి యూనిట్లు పెట్టుకున్న వారికి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడం మరింత సులభతరం కానుంది. -
యువత ఉపాధికి.. కొత్తబాట
►భారీస్థాయిలో ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం ►రూరల్ లైవ్లీహుడ్ మిషన్‌గా డీఆర్డీఏ ► నిర్వహణపై కేంద్రం ప్రత్యేక దృష్టి ►శాశ్వత లక్ష్యంగా పనిచేయనున్న మిషన్ ►యువతకు మరింత రాయితీ.. పాలమూరు : దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలైన పల్లె లిప్పుడు కరువు కాటేయడంతో విలవిల్లాడిపోతున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల్లోని యువకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక అవస్థలు పడుతున్నారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకొని వలసబాట పట్టడంతో.. ఊర్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. సాయంత్రమైతే గ్రామాల్లో పెద్దలు రచ్చబండ వద్ద, యువకులు మరోచోట సమావేశమై ఆ రోజు విశేషా లను చెప్పుకొని ఆనందపడే పరిస్థితులు ఇప్పుడెక్కడా కనబడటం లేదు. బతుకుదెరువుకోసం గ్రామాలను విడిచి పట్టణాలకు వలసవెళ్లే వారి సంఖ్య పెరగడంతో పల్లెలు మూగబోతున్నాయి. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 41లక్షలు. అందులో సగభాగం యువతే.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత తగిన ఉద్యోగావకాశాల్లేక నిస్తేజంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో..గ్రామీణ యువతకు శాశ్వత ఉపాధి అవ కాశాలు కల్పించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)ను రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కొత్తరూపు తీసుకువచ్చి గ్రామీణాభివృద్ధికి కొత్తబాట వేసేందుకు కా ర్యాచరణ చేపట్టారు. ఈమేరకు సర్కారు కసరత్తు మొదలు పెట్టిం ది. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులపై దృష్టి సారించగా.. ఇకపై గ్రామీణ ప్రాంతా ల్లో శాశ్వత ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల గ్రా మీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించి ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే పలురాష్ట్రాల్లో ఈ మిషన్ ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అధికమొత్తంలో నిధులు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధిని కల్పించి నిరుద్యోగాన్ని రూపుమాపడమే లక్ష్యంగా ఈ మిషన్ పనిచేస్తుంది. ఎస్జీఎస్వై కింద జిల్లాలో నిరుద్యోగ యువతకిస్తున్న రుణాలపై ఏటా 4కోట్ల రూపాయల వరకు రాయితీని భరిస్తున్నారు. అయితే కొత్తగా చేపట్టే గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఆర్ఎల్ఎం) ద్వారా కొత్త కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన నిధులను కూడా సర్కారు వెనక్కు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అందుబాటులో ఉన్న నిధులను సర్కారు ఖాతాలో జమచేశారు. అయితే ఆర్ఎల్ఎం ద్వారా శాశ్వత ఉపాధి ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. అంటే అరకొరగా కాకుండా ఉపాధి యూనిట్‌ను నెలకొల్పేందుకు అవసరమయ్యేలా అధిక మొత్తంలో రుణ సదుపాయాన్ని కల్పించడంతో పాటు పెద్దఎత్తున రాయితీలు ఇవ్వనున్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్రం స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్జీఎస్వై)ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకు ద్వారా రాయితీ రుణాలిస్తున్నారు. అయితే ఈ రాయితీ రుణాలు అరకొరగా ఉండడంతో ఆశించిన స్థాయిలో పురోగతి ఉండడం లేదు. ఈ నేపథ్యంలో భారీస్థాయిలో రుణాలిచ్చి ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా చేపట్టే ఆర్ఎల్ఎమ్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. నిర్వహణలో మార్పు: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రా మీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టులు కొనసాగుతుండగా.. ప్రపంచ బ్యాంకు నిధులతో ఐకేపీ ద్వారా పలు కార్యక్రమాలు నడుస్తున్నా యి. ఈ రెండు కూడా ఒకే విభాగంలో ఉన్నప్పటికీ ఖాతాల నిర్వహణ తదితర అంశాలన్నీ వేర్వేరుగా సాగుతున్నాయి. అయితే తాజాగా చేపట్టే ఆర్ఎల్ఎం ఖాతాలను, ఐకేపీ ఖాతాలను ఇకపై ఒక్కరికే అప్పగించనున్నారు. దీంతో ఈ నిర్వహణ ప్రక్రియ వేగవంతం కానుంది. అంతే కాకుం డా ఉద్యోగుల విషయంలోనూ కీలకమైన మార్పులుంటాయని అధికారులు చెబుతున్నారు.