
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మండలం రాఘవాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక(23)కు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే సాయికృష్ణతో ఈ నెల 6 వ తేదీన వివాహమైంది. దంపతులిద్దరూ ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ సాయికృష్ణ సోదరి ఇంట్లో రెండు రోజుల పాటు ఉన్నారు.
అనంతరం సాయికృష్ణ తిరిగి బెంగళూరు వెళ్లిపోయాడు. సోమవారం సాయంత్రం మౌనికను తల్లి పుట్టింటికి రాఘవాపూర్ తీసుకువచ్చింది. మంగళవారం ఉదయం మౌనిక బాత్‌రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ ఘటనకు దారి తీసిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment