newly wedded bride
-
ఈ చలాకీ చిన్నారి.. పెళ్లి కూతురైంది.. బంగారు బొమ్మలా! (ఫోటోలు)
-
అనంతపురంలో విషాదం.. వారం కిందటే పెళ్లి.. ఏం జరిగిందో ఏమో!
పెళ్లి వేడుక సందడి.. తీపి జ్ఞాపకాల్లోంచి బంధువులు, ఆత్మీయులు ఇంకా బయటకురానేలేదు. పైళ్లె పట్టుమని వారం రోజులు కూడా గడవలేదు.. కట్టుకున్న భర్తతో మూడు రోజులు కలసి లేదు. ఏం కష్టమొచ్చిందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఓ యువతి అయినవాళ్లను శోకంసంద్రంలోకి నెట్టింది. పెళ్లి సందడిగా జరగడంతో మొక్కు తీర్చుకుందామని తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్లిన తల్లిదండ్రులు పిడుగులాంటి వార్త హతాశులయ్యారు. విగతజీవిగా పడిఉన్న కుమార్తె మృతదేహం వద్ద వారు రోదించిన తీరు కలచి వేసింది. సాక్షి, అనంతపురం: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు అనుమానస్పద స్థితిలో తనువు చాలించింది. త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు.. బళ్లారి జిల్లా, కూడ్లిగి తాలూకా, చిరుమనెహళ్లికి చెందిన శశికళ నగరంలోని స్థానిక ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో పనిచేసేది. ఆత్మకూరు మండలం, పంపనూరు తండాకు చెందిన రమేష్‌నాయక్‌కు ఈ నెల 12న ఈమెతో వివాహం జరిగింది. 13న కొత్త దంపతులు శశికళ పుట్టింటికి వెళ్లారు. ఈ నెల 14న అనంతపురం వచ్చారు. ఇల్లు ఇంకా ఎక్కడా సరిపోలేదని రెండు రోజులు శశికళను హాస్టల్లో ఉంచిన రమేష్‌నాయక్ 16న నాల్గవరోడ్డు సమీపంలోని ఎస్వీఎన్ఆర్ అపార్టుమెంటుకు తీసుకెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు గాని మరుసటి రోజు అంటే 17వ తేది రాత్రి శశికళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. భర్త ప్రవర్తనపై అనుమానాలు.. కొత్త దంపతులు ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి శశికళకు ఆమె భర్త రమేష్‌నాయక్‌కు మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శశికళ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘర్షణ జరిగిన కొద్దిసేపటికే తనను లోపలి గదిలో పెట్టి బయట తలుపులకు శశికళ తాళం వేసినట్లు రమేష్‌నాయక్ చెబుతున్నాడు. బయట వాళ్ల సాయం కోసం గట్టిగా కేకలు వేస్తే వచ్చి తలుపులు విరగ్గొట్టారని తెలిపాడు. అయితే, అపార్ట్మెంట్లోని రెండో ఫ్లోర్‌లోకి వచ్చి తలుపులు తీసిన వారెవరో చెప్పడంలేదు. పైగా శశికళ ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు ఎత్తు కోసం ఎలాంటి చైర్గాని ఉపయోగించలేదు. దీంతో రమేష్‌పై బాధిత కుటుంబ సభ్యులకు మరింత అనుమానం పెరుగుతోంది. ఇంత జరిగినా శశికళ కుటుంబ సభ్యులకు ఉదయం 10.30 వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 11 గంటల సమయంలో ఫోన్ చేసి మీ పాప ఉరివేసుకుంది, కొన ఊపిరితో ఉందని ఆస్పత్రికి తీసుకెళుతున్నామని చెప్పాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో శశికళ చనిపోయిందని తెలిపాడు. పోలీసులకు కూడా ఉదయం 10.30 వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. హతమార్చాడని బంధువుల ఆరోపణ రమేష్‌నాయక్ వ్యవహారంపై శశికళకు అనుమానం వచ్చినట్లు తెలుస్తోంది. అతనికి మరొకరితో సంబంధాలున్నాయిన ,ఈ విషయం శశికళకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆమెను హతమార్చి ఉండవచ్చని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కన్నీరు మున్నీరైన కన్నవారు.. నాలుగు రోజుల క్రితం నవ్వుతూ అత్తారింటికి వెళ్లొస్తానని చెప్పిన కూతురుని గుర్తు చేసుకుని తండ్రి ఠాగూర్‌నాయక్ రోదించిన తీరు అందరిని కలచి వేసింది. ఠాగూరునాయక్ది అతి పెద్ద కుటుంబం. ఏడుగురు అన్నదమ్ములు. అంతా కలసే ఉంటున్నారు. ఠాగూర్నాయక్కి ఐదుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. అందరిలో చిన్నదైన శశికళంటే ఆ కుటుంబానికి చాలా ఇష్టం. తిరుమల వెంకన్న స్వామి దయతో చిన్నబిడ్డ పెళ్లి కూడా బాగా జరిపించానని సంబరపడ్డానని తెలిపారు. నా బాధ్యతలు సంతృప్తిగా తీర్చుకోవడానికి తిరుమల వెంకటేశ్వరస్వామి దయే కారణమని, ఈక్రమంలో మొక్కు తీర్చుకునేందుకు 16వ తేదీ భార్య జయబాయితో కలిసి వెళ్లానని, తీరా ఉదయం ఫోన్ వస్తే తిరుమల నుంచి ఇటే అనంతకు చేరుకున్నామని కన్నీరుమున్నీరయ్యారు. అక్కకు బంగారం ఇద్దామని.. శనివారం ఉదయం శశికళ తమ్ముడు వైద్య విద్యార్థి విశ్వనాథ్‌నాయక్ అనంతపురం రావాల్సి ఉంది. ఈ విషయంపై నిన్న అక్కతో మాట్లాడాను. రేపు మా ఇంటికి వస్తావా? అని అక్క పిలిచింది. ఉదయాన్నే అక్కబావల వద్దకు వెళ్లాలని ఎంతో సంతోష పడ్డాను. ఇంతలో ఇలా జరిగిపోయిందంటూ సోదరుడు గుండెలవిసేలా రోదించాడు. కేసు నమోదు: నవ వధువు ఆత్మహత్య సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. బిడ్డ చావుకు అల్లుడే కారణమని బాధితు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు. -
కిలేడీ మాస్టర్ ప్లాన్.. పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో పరార్!
లక్నో: వివాహం జరిగిన మరుసటి రోజునే వరుడికి షాక్ ఇచ్చింది ఓ నవ వధువు. ఇంట్లోని డబ్బులు, బంగారు ఆభరణాలతో పరారైంది. ఆ తర్వాత వరుడికి ఫోన్ చేసి తన కోసం వేచి చూడొద్దని తెగేసి చెప్పేసింది. ‘నేను నిన్ను ప్రేమించలేదు. నున్వు నాకు ఫోన్ చేయొద్దు’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది. ఇంట్లోని డబ్బులు, నగలు, ఇతర విలువైన వస్తువులను పట్టుకెళ్లిన క్రమంలో పోలీసులను ఆశ్రయించాడు వరుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన అక్టోబర్ 4నే జరిగినా.. బిల్హార్ పోలీస్ స్టేషన్లో శనివారం వరుడు ఫిర్యాదు చేసిన క్రమంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జదేపూర్ గ్రామానికి చెందిన అరవింద్‌ను తాత్కౌలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి పెళ్లి కుదిర్చుతామని నమ్మించారు. అందుకు తమకు రూ.70వేలు ఇవ్వాలి డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకున్నాక అరవింద్‌ను బిహార్ తీసుకెళ్లి రుచి అనే యువతితో పెళ్లి కుదిర్చారు. సెప్టెంబర్ 30న హోటల్‌కు తీసుకెళ్లి పెళ్లి కూతురి ఫోటో చూపించారు. అక్టోబర్ 1న గయాలోని ఓ ఆలయంలో వివాహం జరిపించారు. ఆ తర్వాత తన భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు అరవింద్. అక్టోబర్ 4న తెల్లవారి నిద్రలేచే సరికి అతని భార్య కనిపించలేదు. ఇంట్లో ఉంచిన రూ.30వేల నగదు, బంగారు నగలు, పెళ్లి కోసం తీసుకున్న బట్టలు సైతం కనిపించలేదు. దీంతో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత అరవింద్‌కు రుచి ఫోన్ చేసి తన కోసం వెతకొద్దని చెప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతితో పాటు పెళ్లి కుదిర్చిన ఇద్దరు వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: మాట్లాడుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్.. గుండెపోటుతో మృతి -
కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి
బెంగళూరు: నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా కట్నం వేధింపులు కూడా ఈ ఘటనకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా మీయాపురలో జరిగింది. మియాపురకు చెందిన గంగాధర్‌తో అదే గ్రామానికి చెందిన రూపాబాయి(22)తో మూడు నెలల క్రితం వివాహమైంది. వివాహం సమయంలో మూడు గ్రాముల బంగారం తక్కువ ఇచ్చారంటూ గంగాధర తల్లిదండ్రులు రూపాబాయిని సూటిపోటి మాటలతో వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ఆమె గర్భం దాల్చింది. ఈక్రమంలో వేధింపులు మరింతగా పెరిగాయి. రెండు రోజుల క్రితం రూపాబాయి విషం తాగడంతో చెన్నగిరి ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. అయితే తమ కుమార్తెతో ఆమె భర్త గంగాధర్, అత్త, మామలు బలవంతంగా విషం తాగించి రూపాబాయి మృతికి కారణమైనట్లు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (Extramarital Affair: అత్త హత్యకేసులో మేనల్లుడే నిందితుడు) -
నవ వధువు ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మండలం రాఘవాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక(23)కు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసే సాయికృష్ణతో ఈ నెల 6 వ తేదీన వివాహమైంది. దంపతులిద్దరూ ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ సాయికృష్ణ సోదరి ఇంట్లో రెండు రోజుల పాటు ఉన్నారు. అనంతరం సాయికృష్ణ తిరిగి బెంగళూరు వెళ్లిపోయాడు. సోమవారం సాయంత్రం మౌనికను తల్లి పుట్టింటికి రాఘవాపూర్ తీసుకువచ్చింది. మంగళవారం ఉదయం మౌనిక బాత్రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఈ ఘటనకు దారి తీసిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నవవధువు ఆత్మహత్య
నెల రోజుల క్రితం పెళ్లైన నవవధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మామిళ్లకుంట గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గువ్వల రాజుకు రంగలక్ష్మీ(22)తో గత నెల 20న పెళ్లైంది. కాగా.. ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో రంగలక్ష్మీ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
కొత్త కోడలి వినూత్న పోరాటం
బీహార్‌లోని బేగుసరాయి జిల్లాలో పెళ్లి వాయిద్యాల మధ్య అత్తారింటికి కొత్త కోడలి బారాత్ బయల్దేరింది. పిల్లల కేరింతల మధ్య ముత్తయిదువులు తోడు రాగా పెళ్లిదుస్తుల్లో ముస్తాబైన ప్రీతి కుమారి పెళ్లి పాటలకు అనుగుణంగా డాన్సు చేస్తూ రాగా మరీ ముందుకు సాగింది. అలా ఆ బారాత్ మక్దూంపూర్ గ్రామంలోని పెళ్లి కొడుకు ఇంటి వరకు వెళ్లింది. కొత్త కోడలిని మంగళ హారతులతో ఇంట్లోకి ఆహ్వానించేందుకు అత్తారింటి నుంచి ఎవరూ బయటకు రాలేదు. పైగా లోపలి నుంచి తలుపులు గడియ పెట్టుకొని 'నువ్వు మా కోడలివి కాదు. ఇక్కడి నుంచి వెళ్లిపో' అంటూ చీత్కారాలు, ఈసడింపులు వినిపించాయి. పెళ్లి కూతురు ప్రీతి కుమారి తన అత్తారింటి ముందున్న చెట్టు కింద కూర్చొని వినూత్న పోరాటం ప్రారంభించారు. ఇరుగుపొరుగు వారు ఓ మంచం తెచ్చి పెళ్లి కూతురుకి తమవంతు సాయం చేశారు. అత్తారింటిలోకి తనను అనుమతించే వరకు తన పోరాటం సాగుతుందని, చావనైనా చస్తానుగానీ పుట్టింటికి తిరిగి వేళ్లనంటూ ఆమె భీష్మించుకు కూర్చుంది. శనివారం ప్రారంభమైన ఆమె పోరాటం మంగళవారం కూడా కొనసాగింది. ఇంత జరుగుతున్నా పెళ్లి కొడుకు ధీరజ్ ఠాకూర్ జాడ మాత్రం కనిపించలేదు. వాస్తవానికి ఇదే జిల్లాలోని భరౌల్ గ్రామానికి చెందిన ప్రీతి కుమారికి, ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ధీరజ్ ఠాకూర్‌కు గత ఏడాది ఏప్రిల్ నెలలోనే పెళ్లి జరిగింది. సంప్రదాయ కుటంబమైన ఠాకూర్ తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించలేదు. పైగా తమ కుమారుడిని కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేశారంటూ పెళ్లికూతురు తల్లిదండ్రులపై కేసు కూడా పెట్టారు. మేజరైన పెళ్లి కొడుకు తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నాడని తెలిసి పోలీసులు అంతటితో కేసును వదిలేశారు. అయితే పెళ్లి కూతురుతో కాపురం పెట్టకుండా పెళ్లికొడుకు తల్లి దండ్రులు అతన్ని కట్టడి చేశారు. దాంతో ఏడాది కాలంగా పుట్టింట్లోనే ఉండిపోయిన ప్రీతి ఎలాగైనా అత్తారింటిలో అడుగు పెట్టేందుకు ఈ వినూత్న ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలిసిన సామాజిక కార్యకర్తలు, మహిళా హక్కుల కార్యకర్తలు రంగప్రవేశం చేసి పెళ్లికొడుకు తల్లిదండ్రులను ఒప్పించేందుకు శతవిధాల ప్రయత్నించారు. తమ బొందిలో ప్రాణం ఉండగా ధీరజ్‌కు జరిగిన పెళ్లిని అనుమతించే ప్రసక్తే లేదని ఆతని తల్లిదండ్రులు మొండికేస్తున్నారు. కట్నం కింద ఐదు లక్షల రూపాయలతోపాటు సంప్రదాయబద్దంగా కానుకలు చెల్లించాలని వారు కోరుతున్నట్లు ప్రీతి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటివరకు ఆ రెండు కుటుంబాల మధ్య రాజీ కుదరలేదు.