న్యాయశాఖ కార్యదర్శిగా వి.నిరంజన్‌రావు | Niranjanrao appointed as Judiciary Secretary | Sakshi
Sakshi News home page

న్యాయశాఖ కార్యదర్శిగా వి.నిరంజన్‌రావు

Published Fri, Jun 30 2017 1:21 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

న్యాయశాఖ కార్యదర్శిగా వి.నిరంజన్‌రావు

న్యాయశాఖ కార్యదర్శిగా వి.నిరంజన్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: న్యాయశాఖ కార్యదర్శిగా ఒలిమినేని నిరంజన్‌రావు నియమితులయ్యారు. నల్లగొండ మొదటి అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా పనిచేస్తున్న నిరంజన్‌రావును ఉమ్మడి హైకోర్టు సిఫారసు మేరకు డిప్యుటేషన్‌పై న్యాయశాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయన న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని సీఎస్‌ ఎస్పీసింగ్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అంతకుముందు న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్న సంతోష్‌రెడ్డి డిప్యుటేషన్‌ కాలం ముగియడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి గ్రామంలో 1961 జనవరి 26న నిరంజన్‌రావు జన్మించారు. 1986లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 1994లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లోకి ప్రవేశించిన ఆయన తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు.

7 నుంచి అమరుల స్ఫూర్తి యాత్ర
తెలంగాణ జేఏసీ అమరుల స్ఫూర్తి యాత్ర సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో జూలై 7 నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ యాత్ర తొలిరోజు ఎల్లారెడ్డిపేటలో ముగుస్తుంది. 2వ రోజు గర్జనపల్లిలో ప్రారంభమై వేములవాడలో ముగియనుంది. 3వ రోజు సిరిసిల్లలోబహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుందని జేఏసీ తెలిపింది.

Advertisement

పోల్

Advertisement