niranjanrao
-
ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించి సెషన్స్ జడ్జి స్థాయిలో హైదరాబాద్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు జీవో విడుదల చేశారు. ఫాస్ట్‌కోర్టుకు సంబంధించిన ఆదేశాలను న్యాయశాఖ ఈ ఏడాది ఇప్పటికే వెలువరించినా అందులో రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించలేదు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ సెషన్స్ జడ్జి నేతృత్వంలో నిర్వహించే ప్రత్యేక న్యాయస్థానం కిందకు వస్తాయని పేర్కొన్నారు. 2016లో దాఖలైన ఓ రిట్ పిటిషన్‌పై తీర్పు సందర్భంగా ప్రతి రాష్ట్రంలోనూ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసినట్లు న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. -
న్యాయశాఖ కార్యదర్శిగా వి.నిరంజన్‌రావు
సాక్షి, హైదరాబాద్: న్యాయశాఖ కార్యదర్శిగా ఒలిమినేని నిరంజన్‌రావు నియమితులయ్యారు. నల్లగొండ మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న నిరంజన్‌రావును ఉమ్మడి హైకోర్టు సిఫారసు మేరకు డిప్యుటేషన్‌పై న్యాయశాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయన న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని సీఎస్ ఎస్పీసింగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతకుముందు న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్న సంతోష్‌రెడ్డి డిప్యుటేషన్ కాలం ముగియడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి గ్రామంలో 1961 జనవరి 26న నిరంజన్‌రావు జన్మించారు. 1986లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా జ్యుడీషియల్ సర్వీసెస్‌లోకి ప్రవేశించిన ఆయన తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. 7 నుంచి అమరుల స్ఫూర్తి యాత్ర తెలంగాణ జేఏసీ అమరుల స్ఫూర్తి యాత్ర సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో జూలై 7 నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ యాత్ర తొలిరోజు ఎల్లారెడ్డిపేటలో ముగుస్తుంది. 2వ రోజు గర్జనపల్లిలో ప్రారంభమై వేములవాడలో ముగియనుంది. 3వ రోజు సిరిసిల్లలోబహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుందని జేఏసీ తెలిపింది.