
'చంద్రబాబు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నష్టాలు'
నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నష్టాలు వచ్చాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మట్లాడారు. కమలనాథన్ కమిటీ వల్లే ఉద్యోగుల విభజన ప్రక్రియలో జాప్యం జరిగిందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే బీజేపీ నేతలు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదంటూ ఈ సందర్భంగా ఎంపీ కవిత ప్రశ్నించారు.