మహబూబ్‌నగర్ టౌన్: రుణమాఫీ లెక్క ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. జాబితాలు సమర్పిం చేందుకు శుక్రవారం గడువు విధిం చారు. అయినా, ఇప్పటివరకు 58 మండలాల నుంచే బ్యాంకర్లు జాబితాలు అందజేశారు. ఆరు మండలాల నుంచి స్పందన కరువైంది. ఇక బ్యాంకర్లు అందించిన జాబితాపై సామాజిక తనిఖీలు నిర్వహించి బినామీల లెక్కలు తేలుస్తామన్న అధికారులు చెప్పారు.
ఈ మేరకు ముందు రోజు బోగస్ పాస్‌బుక్‌లు వేలల్లో లెక్క చూపారు. ఆ తరువా త ఏమైందో.. ఇప్పుడు బినామీలే లేరని చెబుతున్నారు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు ఆత్మకూర్, దామరగిద్ద, దౌల్తాబాద్, మద్దూర్, ఊట్కూర్, అలంపూర్ మండలాలు జాబితాలు సమర్పించలేదు.
నేడు ప్రభుత్వం చెంతకు జాబితా..?
జిల్లా వ్యాప్తంగా సిద్ధం చేసిన రుణమాఫీ తుది జాబితాను శనివారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించారు. కానీ, ఇంకా ఆరు మండలాల నుంచి జాబితా అందకపోవడంతో జాబితాను శనివారం ప్రభుత్వానికి సమర్పిస్తారా.. లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బినామీల సంఖ్య కూడా తేలకపోవడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది.
లెక్క తేలలేదు...
Published Sat, Sep 6 2014 1:44 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement