ఏటూరునాగారం: సమావేశ మందిరంలో కనీస సౌకర్యాలు లేక అంగన్‌వాడీ టీచర్లు నానా అవస్థలు పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అంగన్‌వాడీ కేంద్రాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు సంగూలాల్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి మొత్తం ఆరు మండలాల పరిధిలోని 442 కేంద్రాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు హాజరయ్యారు. వారికి కనీసం కూర్చోవడానికి సదుపాయం కల్పించలేదు. కుర్చీలు లేకపోవడంతో కొందరు సమావేశ మందిరంలోని టేబుళ్ల మధ్యలో కూర్చోగా.. చాలా మంది వరండాలోనే సర్దుకున్నారు. సుమారు రెండు గంటల పాటు నరకం అనుభవించాల్సి వచ్చిందని పలువురు అంగన్‌వాడీ టీచర్లు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment