మాక్లూర్ : గ్రామాల్లో తాగు నీటి సమస్య ఉంటే అధికారుల పై చర్యలు కఠినంగా ఉంటాయని జెడ్పీ సీఈఓ మోహన్‌లాల్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగు నీటి కోసం జెడ్పీ, మండల, ఏఆర్‌డబ్ల్యూఎస్, బీఆర్‌జీఎఫ్ కింద నిధులు మంజూరు చేశామన్నారు. ఏదైనా గ్రామంలో నీటి సౌకర్యం లేకపోతే ట్యాంకర్లలో అద్దెకు తెచ్చి నీటి సౌకర్యం కల్పించాలని సూచించినట్లు తెలిపారు. ఈజీఎస్, మిషన్ కాకతీయ, హరితహారం పథకం పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. త నిఖీ సమయంలో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
మూమెంట్ రిజిష్టర్, హాజరు పట్టిక సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి నిధులు సక్రమంగా వినియోగించాలని సూచించారు. అనంతరం మాదాపూర్‌లో పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. ముందుగా ఓ గ్రామానికి చెందిన వికలాంగురాలు తనకు వికలాంగ పింఛను రావడం లేదని జెడ్పీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లగా సదరం సర్టిఫికెట్ పరిశీలించడంతో పాటు ఆమె చేతిని తన సెల్‌లో ఫొటో తీసుకున్నారు. కార్యక్రమంలో ఈఓపీఆర్‌డీ చంద్రశేఖర్‌శర్మ, జూనియర్ పర్యవేక్షకులు శ్రీనివాస్‌గౌడ్, సిబ్బంది, పాల్గొన్నారు.
గ్రామాల్లో నీటి సమస్య ఉండొద్దు
Published Fri, May 8 2015 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement