The problem of drinking water
-
తాగునీటి కోసం ఆందోళన
సర్పంచ్ ఇంటి ఎదుట మహిళల నిరసన రెండు నెలలుగా నీరు సరఫరా కాకపోవడంతో ఆగ్రహం వర్ధన్నపేట : రెండు నెలలుగా తాగునీరు సరఫరా చేయడం లేదని ఆగ్రహించిన మíßహిళలు ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన తెలిపారు. మండలంలోని ఇల్లంద ఎస్సీ కాలనీలో కొన్ని కుటుంబాలకు రెండు నెలలుగా నీటి సరఫరా కావడం లేదు. వేసవి రావడంతో సమస్య జఠిలం కాగా, ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో సర్పంచ్ రాయపురం కుమారస్వామి ఇంటికి చేరుకున్నారు. తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలంటూ నిరసన తెలిపారు. దీనిపై గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్ కాలనీకి నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
ప్రతిఇంటికి సురక్షిత మంచినీరు
పుల్కల్/పెద్దశంకరంపేట: మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. 2017 మార్చిలోగా 275 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ముందుగు సాగుతున్నామని చెప్పారు. సోమవారం మెదక్ జిల్లా పుల్కల్ మండల పరిధిలోని పెద్దరెడ్డిపేట శివారులో జరుగుత్ను భగీరథ పనుల పరిశీలన, పెద్దశంకరంపేట మండలం జంబికుంట నుంచి నిజామాబాద్ జిల్లాకు నిర్మిస్తున్న తాగునీటి పైప్‌లైన్ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా 1.75 లక్షల కిలోమీటర్ల మే పైప్లైన్లు వేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.40 వేల కోట్లతో 26 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. రూ.1,350 కోట్లతో సింగూరు- జూకల్, రూ.1400 కోట్లతో శ్రీరాంసాగర్- కామారెడ్డి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. సింగూర్-జూకల్ ప్రాజెక్టును నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేయాలన్నారు. జూకల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు బోధన్ ప్రాంతానికి ఈ పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నిజామాబాద్ జిల్లాకు రెండు ప్యాకేజీల ద్వారా రూ. 1000 కోట్లతో ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. ఆయన వెంట జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు ఉన్నారు. -
హమ్మయ్య దాహం తీరింది!
హార్సిలీహిల్స్‌కు 2 కొత్త బోర్ల నుంచి ప్రారంభమైన పంపింగ్ బి.కొత్తకోట: మండలంలోని హర్సిలీహిల్స్లో రెండేళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్య ఎట్టకేలకు తీరింది. ఇటీవల వేసిన 2 కొత్తబోర్ల నుంచి నీటి పంపింగ్ ప్రారంభమైంది. దీంతో కొంత దాహం తీరినట్లయింది. ఆదివారం కొత్తబోర్లకు విద్యుత్ సరఫరా ఇవ్వడంతో నీటిని సంపులకు పంపింగ్ చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో సమ స్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. హార్సిలీ కొండకు 7 దశల్లో నీటిని కురబలకోట మండలం గాలేటివారిపల్లె నుంచి పం పింగ్ చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ బ్రిటీష్ పాలకుల హయాంలో నిర్మాణం చేసిం ది. ఈ ప్రాంతంలో టూరిజం శాఖకు చెందిన 7 బోర్లున్నాయి. రెండేళ్లుగా ఆరు బోర్ల నుంచి నీటి పంపింగ్ లేకుండాపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ రైతుల నుంచి నాలుగు బోర్లను లీజుకు తీసుకున్నారు. అయినా నీటి స మస్య తీరలేదు. నీటి సమస్య కారణంగా 10 అతిథి గృహాలను పర్యాటకులకు కేటాయించకుండా నిలిపివేయాల్సి వచ్చింది. రోజుకు లక్ష లీటర్ల కొరత తీరింది నిన్నటి వరకు హార్సిలీకొండకు రోజుకు లక్షల నీటి కొరత ఉండేది. ఆదివారం నుంచి ఆ కొరత నుంచి బయపడ్డారు. కొండపై రోజుకు 1.5 లక్షల లీటర్ల నీటి వినియోగం ఉంది. అయితే బోర్లు ఎండిపోవడంతో వేసవికి ముందు రోజుకు కేవలం 40 వేల లీటర్లు, ఇటీవల వరకు 25 వేల లీటర్ల నీళ్లే లభ్యమయ్యేది. ఈ నీరు పర్యాటక శాఖకే సరిపోకపోవడంతో స్థానికులకు, ఇతర శాఖలకు అం దించే వీలులేకపోయింది. ఒక ట్యాంకర్ నీటిని రూ.2 వేలతో కొనుగోలు చేశారు. పర్యాటక శాఖకు నీటినిల్వల కోసం నిర్మించిన 2.4 లక్షల లీటర్ల సామర్థ్యమున్న రెండు సంపులు ఎండిపోయాయి. ప్రస్తుతం కొత్తగా వేసిన 2 బోర్ల నుంచి నాలుగించుల నీళ్లు లభ్యమవుతున్నాయి. ఇప్పుడు రోజుకు లక్ష లీటర్ల నీటి లభ్యత మొదలైంది. అయితే లక్ష లీటర్ల వినియోగం తగ్గించి 80 వేల లీటర్లే పంపింగ్ అయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. సంపులకు నీటిని నింపేసి, మిగిలిన పంపింగ్ నీటిని అందరికీ సరఫరా చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మారిన నీటి ధరలు కొండపై నీటి వినియోగంపై కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. గతంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే నీటికి లీటర్‌కు 3పైసలు ఉండగా 10పైసలు పెంచారు. గృహ అవసరాలకు వినియోగించే నీటికి 2 పైసల నుంచి 5 పైసలకు పెంచారు. పెరిగిన ఈ ధరతో పర్యాటక శాఖకు కొంతమేరకు ఆదాయం సమకూరనుంది. -
నీటి కష్టాలు తీరుస్తా
‘‘జిల్లాలో నీటి సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పొలాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. చెరువుల్లో చుక్కనీరు లేకుండా పోయింది. భూగర్భజలాలు అడుగంటాయి. అయినా అధైర్యపడొద్దు. ఈ ఏడాదే హంద్రీ-నీవా ద్వారా పడమటి మండలాలకు నీటిని తీసుకొస్తా. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను నిర్మిస్తా. నీటిసమస్యే లేకుండా చూస్తా’’ అంటూ సీఎం చంద్రబాబు బుధవారం రేణిగుంట మండలం ఆర్.మల్లవరం వద్ద జరిగిన సభలో హామీ ఇచ్చారు. - ఈ ఏడాదే హంద్రీ-నీవా ద్వారా మదనపల్లెకు నీళ్లు - నీరు-చెట్టు ద్వారా భూగర్భ జలాల పెంపు - రెండేళ్లలో గాలేరు- నగరిని పూర్తిచేస్తా - అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతా - అధికారులపై తీవ్ర ఆగ్రహం - సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన వైనం సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో తాగునీటి సమస్య ఉందని, దాని పరిష్కారం కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన బుధవారం రేణిగుంట మండలం ఆర్ మల్లవరంలో స్థానిక సర్పంచ్ మునిశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ ఈ ఏడాదే హంద్రీ-నీవా ద్వారా పుంగనూరు, మదనపల్లెకు నీటిని తీసుకు వస్తామన్నారు. స్వర్ణముఖి, సోమశిల లింకు కెనాల్‌ను నిర్మిస్తామన్నారు. జీఎన్ఎస్ఎస్ పనులను రెండేళ్లల్లో పూర్తి చేసి, నగరికి నీళ్లు వచ్చేలా చేస్తామన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రముఖ విద్యాసంస్థలకు శంకుస్థాపన చేశామన్నారు. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో చెక్‌లు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఆర్ మల్లవరం గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై శ్రద్ధ చూపాలన్నారు. పట్టిసీమ, పోలవరం నీరు, రాయలసీమకు తెచ్చేవరకు రాత్రింబవళ్లు పనిచేస్తానని చెప్పారు. సీఎం ప్రసంగిస్తుండగానే... ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే సగం మందికి పైగా మహిళలు వెళ్లిపోయారు. ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకు సభకు వచ్చిన మహిళల నుంచి లేదు లేదు అని సమాధానం రావడంతో సీఎం తీవ్ర అసహనానికి గురయ్యారు. ఓ దశలో ఆగ్రహంతో అధికారులపై ఊగిపోయారు. తమాషాలు చేస్తున్నారా? అంటూ సహనం కోల్పోయారు. సమావేశం మధ్యలోనే వెళ్లిపోతున్న మహిళలను సైతం సీఎం మందలించారు. సభ నిర్వహణపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖం చాటేసిన అధికారులు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సీఎం సభకు అధికారులంతా హాజరయ్యారు. అయినప్పటికీ వారు వేదికపైకి వెళ్లకుండా ముఖం చాటేశారు. సీఎం పలుమార్లు ఇక్కడ అధికారులు ఎవరంటూ ప్రశ్నించినప్పుడు వేదిక దగ్గరగా ఉన్న అధికారులు వణికి పోయారు. సీఎం దగ్గరకు వెళితే ఎలాంటి ఇబ్బంది వస్తుందో అని వెళ్లకుండా ఉండిపోయారు. సమావేశానికి కలెక్టర్ తప్ప మిగిలిన ఉన్నతాధికారులందరూ హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ వేదిక పైకి వెళ్లలేదు. సీఎం ప్రసంగానికి ఆశించిన మేర స్పందన కరువైంది. చెరుకు రైతులు బకాయిలు చెల్లించాలని సీఎంను నిలదీశారు. -
గ్రామాల్లో నీటి సమస్య ఉండొద్దు
మాక్లూర్ : గ్రామాల్లో తాగు నీటి సమస్య ఉంటే అధికారుల పై చర్యలు కఠినంగా ఉంటాయని జెడ్పీ సీఈఓ మోహన్‌లాల్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగు నీటి కోసం జెడ్పీ, మండల, ఏఆర్‌డబ్ల్యూఎస్, బీఆర్జీఎఫ్ కింద నిధులు మంజూరు చేశామన్నారు. ఏదైనా గ్రామంలో నీటి సౌకర్యం లేకపోతే ట్యాంకర్లలో అద్దెకు తెచ్చి నీటి సౌకర్యం కల్పించాలని సూచించినట్లు తెలిపారు. ఈజీఎస్, మిషన్ కాకతీయ, హరితహారం పథకం పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. త నిఖీ సమయంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మూమెంట్ రిజిష్టర్, హాజరు పట్టిక సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి నిధులు సక్రమంగా వినియోగించాలని సూచించారు. అనంతరం మాదాపూర్‌లో పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. ముందుగా ఓ గ్రామానికి చెందిన వికలాంగురాలు తనకు వికలాంగ పింఛను రావడం లేదని జెడ్పీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లగా సదరం సర్టిఫికెట్ పరిశీలించడంతో పాటు ఆమె చేతిని తన సెల్లో ఫొటో తీసుకున్నారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ చంద్రశేఖర్‌శర్మ, జూనియర్ పర్యవేక్షకులు శ్రీనివాస్‌గౌడ్, సిబ్బంది, పాల్గొన్నారు. -
మీరు ఏమి చేస్తారో తెలియదు.. నీళ్లు ఇవ్వాల్సిందే!
జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశం మదనపల్లె రూరల్: ‘‘జిల్లాకు రూ.2కోట్ల నిధులు ఇచ్చాం. ప్రజలకు, పశువులు తాగునీటి సమస్య తలెత్తకుండా మీరు ఏం చేస్తారో తెలియదు.. నీళ్లు ఇవ్వాల్సిందే. ఎక్కడైనా తాగునీటి సమస్య ఉందని ఫిర్యాదు వస్తే ఊరుకునేది లేదు’’ అని కలెక్టర్ సిద్ధార్థజైన్ అన్నారు. స్థానిక టౌన్‌హాల్, మిషన్ కాంపౌండ్‌లోని కమ్యూనిటీ హాల్లో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల డివిజన్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన కల్పించారు. ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో బోర్లు వుంటే స్వాధీన పరుచుకోమన్నారు. అవసరమైతే రైతుల బోర్లను కూడా తీసుకుని తాగునీటి సరఫరా చేయమని ఆదేశించారు. ఈ మూడు నెలలు కొత్తబోర్లకు అనుమతించేదిలేదన్నారు. ఉన్న వాటితోనే తాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నారు. ముఖ్యంగా వేసవిలో పశువులకు గ్రాసం కొరత లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గడ్డి రూ.3 కే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సూచించారు. అనర్హులకు పింఛను చేరితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కరువులో ఉపాధి పనులను వేగవంతం చేసి వలసలు నివారించాలని సూచించారు. మండలాల వారీగా తాగునీటి సమస్య, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ గోపీచంద్, ఎంపీడీవోలు లక్ష్మీపతి, వసుంధర, ఇన్చార్జ్ ఎంపీడీవో సురేష్, తహశీల్దార్లు, సీడీపీవోలు సరళాదేవి, సరస్వతి, ఏపీడీ దీక్షాకుమారి, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
తాగు నీటి సమస్యకే తొలి ప్రాధాన్యం
కౌతాళం: జిల్లాలో తాగు నీటి సమస్యకు తాను తొలి ప్రాధాన్యం ఇస్తానని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఒక వేళ ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సోమవారం రాజనగర్ క్యాంపు వద్ద ఉన్న కౌతాళం ఎస్ఎస్ ట్యాంకును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు కరకట్ట పనులు వేగవంతం చేసి తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 33.65 లక్షల క్యూబిక్ మీటర్లు సామర్థం ఉంటే అదనంగా 40 వేల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ చేయడం వల్ల కరకట్ట కుంగిందని అన్నారు. నాణ్యత లోపం కూడా విచారణ చేస్తామని అన్నారు. నాణ్యత లోపం వల్ల కరకట్ట కుంగిపోయిందని నివేదిక వస్తే ఈ ఖర్చు అంత కాంట్రాక్టర్ ద్వారా వసూలు చేయాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతానికి మరమ్మతులు చేస్తామన్నారు. కౌతాళం ప్రజలకు తాగు నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటానన్నారు. రాయలసీమలోని ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో నీటి సమస్య చాల తక్కువగా ఉందన్నారు. జిల్లాలో ఎల్ఎల్సి, హెచ్ఎల్సీ, కెసీకెనాల్ ద్వారా ఆయా గ్రామాల్లో ఉన్న ట్యాంకులను నింపి ఈ వేసవికాలంలో తాగునీటిని అందిస్తామన్నారు. తాగునీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్డీవోలకు పూర్తి అధికారం ఇచ్చామన్నారు. -
ఇప్పుడే ఇలా ఉంటే..!
నియోజకవర్గం ట్యాంకర్లతో అద్దె బోర్లు నీరందిస్తున్న గ్రామాలు రాయచోటి 198 109 రాజంపేట 120 25 రైల్వేకోడూరు 33 04 కమలాపురం 27 07 పులివెందుల 15 06 జమ్మలమడుగు 14 -- సాక్షి, కడప : మండుటెండలు రాకముందే జిల్లాను తాగునీటి సమస్య వెంటాడుతోంది. ఇప్పటికే జిల్లాలోని వందలాది గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. రాబోయే రోజులు తలచుకుని ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందోనని గ్రామీణ తాగునీటి విభాగం అధికారులు ఆందోళన చెందుతున్నారు. మార్చి ఆరంభం కాగానే అన్నో ఇన్నో బోర్లలో వస్తున్న నీళ్లు నిలువునా అడుగంటిపోతున్నాయి. ఒకపక్క పండ్ల తోటల రైతులు, మరోపక్క గ్రామీణ ప్రజలు నీరు లేక తల్లడిల్లిపోతున్నారు. ఏళ్ల చరిత్ర కలిగిన చెయ్యేరు లాంటి నీటి పథకాలు కూడా నిలువునా ఎండిపోతుండటంతో ఏమి చేయాలో అధికారులకు కూడా పాలుపోవడం లేదు. 557 గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య రాయచోటి, రాజంపేట, పులివెందుల, కమలాపురం, రైల్వేకోడూరు తదితర ప్రాంతాల పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్య నేపధ్యంలో దాదాపు ఎనిమిది నెలలుగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు దాదాపు 406 గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో బోర్లు వేసినా నీరు పడకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారానే నీటిని అందిస్తున్నారు. 557 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొనడంతో దాదాపు 1.50 లక్షల మందికి పైగా ప్రజలు అవస్థలు ఎదుర్కొవాల్సి వస్తోంది. మున్సిపాలిటీలను వేధిస్తున్న నీటి గండం జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో కూడా తాగునీటి సమస్య వేధిస్తోంది. పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఆగస్టులో ఎండిపోవడంతో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తాగునీటి సమస్యపై ప్రత్యేక చొరవ తీసుకుని దాదాపు రూ. 80 లక్షలకు పైగా నిధులు తాగునీటి అవసరాలకు కేటాయించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తూ వస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని పలు వీధుల్లో తాగునీటి సమస్య ఏర్పడటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. రాయచోటి ప్రాంతంలో ఎక్కడ చూసినా ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. ఒక్క రాయచోటి నియోజకవర్గంలోనే 198 గ్రామాల్లో ట్యాంకర్లతో నీరు తోలుతుండగా, 109 గ్రామాల్లో అద్దె బోర్ల సాయంతో తాగునీరు అందిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతోంది. -
గండం...!
వేసవి వచ్చిందంటే జిల్లాలో తాగునీటి కోసం ఓ మోస్తరు యుద్ధాలు జరగాల్సిందే. అలాంటిది గత ఏడాది వర్షపాతం మరింత తక్కువ కావడంతో మార్చిలోనే తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. ముందస్తు ప్రణాళికలకు ఇప్పటికైనా బూజు దులుపకపోతే రానున్న రోజుల్లో జిల్లా ప్రజానీకం గుక్కెడు నీటికి కూడా అల్లాడాల్సిన పరిస్థితి తప్పదు. అనంతపురం అర్బన్ : తీవ్ర కరువుతో సతమతమవుతున్న జిల్లాలో ములిగే నక్కపై.. తాటికాయ పడ్డ చందంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నేనున్నానంటూ పలకరిస్తోంది. వేసవి మొదలయ్యేటప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనంతపురం నగరంతో పాటు జిల్లాలో 547 గ్రామాలకు శ్రీ భగవాన్ సత్యసాయి బాబా తాగునీటి సౌకర్యాన్ని సత్యసాయి ట్రస్టు ద్వారా కల్పించారు. అయినా జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య సర్వసాధారణంగా మారుతోంది. జిల్లాలో 1003 గ్రామ పంచాయితీల్లో సుమారు 31.18 లక్షల మంది జనాభా ఉన్నారు. వేసవిలో ఒక్కో మనిషికి సగుటున ప్రతిరోజు 2 నుంచి 3 లీటర ్ల తాగునీరు అవసరమవుతుంది.. అలాగే జిల్లాలో ఉన్న 15 ల క్షల పశువులకు రోజుకు ఒక్కో దానికి 10 నుండి 12 లీటర్లు తాగునీరు అవసరమవుతుంది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంత అవసరాలకు రోజుకు సుమారు 2.40 కోట్ల లీటర్ల తాగునీరు అవసరం కాగా ప్రస్తుతం 1.80 కోట్ల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మే నెలలో తాగునీటి పరిస్థితి మరింత దారుణంగా ఏర్పడే ప్రమాదం ఉంది. జిల్లాలో సాధారణంగా 502 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి కేవలం 274 మి. మీ. మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. అడుగంటుతున్న భూగర్భజలాలు జిల్లాలో పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత.. నదీ పరివాహక ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. జిల్లాలో 13,386 తాగునీటి బోరు బావులు ఉండగా. వీటిలో వర్షకాలంలో 1304 బోరు బావుల్లో తాగునీరు లభించగా, 4146 పూర్తిగా అడుగంటి పోయాయి. 216 బోరు బావులు మరమ్మతులకు నోచుకోక దిష్టిబొమ్మలా మారాయి. ప్రస్తుతం జిల్లాలో 302 గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి దాదాపు 1200 ట్యాంక ర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే సుమారు 576 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైనట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను గుర్తించకపోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో బోరుబావులు మరమ్మతులకు నోచుకోపోవడంతో సుమారు ఒక కిలోమీటరు దూరం నుండి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో వచ్చే వేసవిలో తాగునీటి సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితి ఏర్పడనుంది. ఇప్పటికే పుట్లూరు, యల్లనూరు, కళ్యాణదుర్గం, కదిరి, బుక్కపట్నం, ఓడీ చెరువు, ఎన్‌పి కుంట త దితర మండలాల్లో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. తెప్పులుగా ట్యాంకర్ల బకాయిలు తాగునీటి సమస్యత్మాక గ్రామాల్లో సుమారు 1200 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ట్యాంకర్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే రూ.4.39 కోట్లు ట్యాంకర్ల యాజమానులకు ప్రభుత్వం బకాయి ఉంది. బకాయిలు చెల్లించకపోతే తాగునీటి సరఫరాను ఆపివేస్తామని ట్యాంకర్ల యాజమానులు బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా తాగునీటి సరఫరాను ఆపివేస్తే.. పలు పల్లెల్లో తాగునీటి కోసం విలవిలలాడాల్సిన పరిస్థితి. వచ్చే వేసవిలో తాగునీటి సమస్యనుంచి అధికారులు గట్టెక్కిస్తారో..? లేక మహిళలను ఖాళీ బిందెలతో రోడ్లపై నిలబెడతారో...? వేచి చూడాల్సిందే..! ట్యాంకర్లకు బకాయిలు చెల్లిస్తాం : ట్యాంకర్ల యజమానులకు బకాయిలు చెల్లిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి ఎస్ కాంతనాథం తెలిపారు. నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపగా.. ఇటీవల రూ. 11 కోట్లు మంజూరు చేసిందన్నారు. వీటితో బకాయిలు చెల్లించి.. బోరు బావుల మరమ్మతులు, ముందస్తు చర్యలు చేపట్టి జిల్లాలో తాగునీటి సమస్యను అధిగమిస్తామన్నారు. -
మాటలేకానీ... చేతలేవి బాబూ
నేడు కుప్పంకు చంద్రబాబు రాక అధికారం చేపట్టి 8 నెలలు జిల్లాకు ఇచ్చిన హామీలు 25 పైనే ఒక్క హామీ నెరవేర్చని వైనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు చిత్తూరు: చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 8 నెలలు గడిచిపోయింది. అధికారం చేపట్టిన తరువాత ఆయన జిల్లాకు రావడం ఇది ఆరోసారి. ఎన్నికల ప్రచారంలో, ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు చంద్రబాబు వందల కొద్దీ హామీలిచ్చారు. అందులో జిల్లాకు సంబంధించినవి 25కు పైగా ఉన్నాయి. కానీ జిల్లాకు సంబంధించి ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. జిల్లాలో అడుగుపెట్టిన ప్రతిసారీ పుట్టిన ఊరికి అన్నీ చేసేస్తానంటూ బాబు మాటలతో జనాన్ని మభ్యపెడుతున్నారు. జిల్లాలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి తీసుకునే చర్యలు కానరావడం లేదు. నీటి సమస్య పరిష్కారం కావాలంటే హంద్రీ-నీవా, కండలేరు పథకాలు పూర్తికావడం మినహా మరో మార్గం లేదు. కానీ ప్రభుత్వం ఆ పథకాలకు నామమాత్రపు నిధులు కూడా కేటాయించలేదు. ఇక జిల్లాలో రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీలనే బుట్టదాఖలు చేసిన చంద్రబాబు ఆ తరువాత ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. సొంత నియోజకవర్గం కుప్పం రైతులు ఏనుగుల వరుస విధ్వంసాలకు తీవ్రంగా నష్టపోతున్నా వారికి సరైన పరిహారమూ ఇచ్చే పరిస్థితి లేదు. సీఎం అయిన తరువాత సొంత జిల్లాకు పలుమార్లు వస్తున్నా ఒక పనీ నేరవేర్చకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు హామీలను పరిశీలిస్తే.... జిల్లాలో 40 జాతీయ, ప్రాంతీయ, సహకార బ్యాంకుల పరిధిలోని 478 బ్రాంచుల పరిధిలో 2013 డిసెంబర్ 31వనాటికి 8,70,321 మంది రైతులు 11,180.25 కోట్ల పంట రుణాలను తీసుకోగా, వారిలో 3.73లక్షల మంది రైతులు మాత్రమే రుణమాఫీకి అర్హులంటూ బ్యాంకులు ప్రభుత్వానికి నివేదించి చేతులు దులుపుకున్నా యి. రుణమాఫీ చేస్తారని కోటి ఆశలతో ఓట్లు వేసి గెలిపించిన జనానికి చంద్రబాబు నిరాశ కల్పించారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నిక ల్లో హామీ ఇచ్చారు. తరువాత ఒక్కొక్క డ్వాక్రా మహిళకు రూ.10వేల చొప్పున ఇస్తానంటూ మా టమార్చారు. జిల్లాలో 7.8లక్షల మంది సభ్యులున్నారు. ఈ లెక్కన రూ.780 కోట్లు చెల్లించాలి. ఇంతవరకు పైసా ఇచ్చిన పాపాన పోలేదు. ఎన్నికల ముందు చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తానని పదేపదే చెప్పిన బాబు చిత్తూరు, గాజులమండ్యం సహకార చక్కెర ఫ్యాక్టరీల పరిధిలో దాదాపు రూ.30 కోట్లు బకాయిలున్నా పట్టించుకోలేదు. మేర్లపాక వద్ద ఐఐటీ ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చినా అది ఆచరణ దాల్చలేదు. 450 ఎకరాల భూమిని గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వచ్చే విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభిస్తామని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకటించినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినా ప్రతిపాదనలేవీ కేంద్రానికి చేరని దాఖలాలు లేవు. కుప్పంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని బాబు చెప్పినా సెప్టెంబర్‌లో పర్యటించిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఐఏ) చైర్మన్ అలోక్ సిన్హా ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయలేమని, అవసరమైతే ఎయిర్‌స్ట్రిప్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై ప్రభుత్వ చర్యలేవీ లేవు సెంట్రల్ యూనివర్శిటీ హామీ గాలిలో కలిసింది. యూనివర్శిటీని అనంతపురం జిల్లాకు తరలించారు. తిరుపతి మెగాసిటీ ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. రంగంపేట సమీపంలో అటవీ భూములను డీ - నోటిఫై చేసి తిరుపతి మెగాసిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై నిర్ణయం వెలువడలేదు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మె ట్రోరైలు ప్రాజెక్టు మంజూరు చేస్తూ ప్రభుత్వం నాలు గు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వు ల్లో తిరుపతి ప్రస్తావన లేదు. తిరుపతిలో మెట్రోరైలు ప్రాజెక్టు సాధ్యసాధ్యాలను పరిశీలించే బాధ్యత శ్రీధరన్‌కు అప్పగించారు. అది ఏమైందో మరి. జిల్లాను హార్టికల్చర్ హబ్ చేస్తానని నవంబర్ 5న పర్యటనలో చంద్రబాబు మరోమారు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకు చర్యలు లేవు. తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంను ఆధ్యాత్మిక కారిడర్ చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. హాంద్రీనీవా రెండవ దశ పనులకు సంబంధించి 2015-16లో రూ.2,500 కోట్లు కేటాయించాలని త్రిసభ్య కమిటీ ప్రతిపాదించింది. కానీ 2015 బడ్జెట్లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. టమాట రైతులకు రుణమాఫీని అమలుచేస్తానని తొలుత హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ తరువాత ఎకరాకు రూ.10వేల చొప్పున మాఫీ చేస్తామంటూ మాటమార్చారు. ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా పైసా ఇవ్వలేదు. -
తాగునీటి సమస్య లేకుండా చూడండి
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎమ్మెల్యేలతోపాటు కడప మేయర్ కోరారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన నిధుల గురించి మంగళవారం ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జయరాములుతోపాటు కడప మేయర్ సురేష్‌బాబులు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, సీఈఓ మాల్యాద్రితో చర్చించారు. ఈ చర్చల్లో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పర్వతరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ రమేష్‌లు కూడా ఉన్నారు. జిల్లాలో చిం తకొమ్మదిన్నె, సుండుపల్లె, రాయచోటి, రామాపురం, పెండ్లిమర్రి, బద్వేలు, కోడూరు, లక్కిరెడ్డిపల్లెలతోపాటు ఇంకా చాలా మండలాల్లో తీవ్ర మంచినీటి సమస్య ఉందని వారు వివరించారు. ఈ గ్రామాలలో తక్షణం మంచి నీటి సమస్యను తీర్చాలంటే నియోజకవర్గానికి రూ. 30 లక్షల చొప్పున నిధులు కావాలని వారు జెడ్పీ చెర్మైన్ గూడూరు రవి, సీఈఓ మాల్యాద్రిలను కోరారు. దీనికి స్పం దించిన వారు నిధులు రాగానే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వీటితోపాటు ఇంకా ఏయే మండలాల్లో మంచినీటి సమస్య ఉందని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పర్వతరెడ్డితో ఎమ్మెల్యేలు చర్చించారు. గాలివీడు మండలంలో రూ. 5 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన మంచినీటి స్కీం పనులు ఎలా జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఈఈని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత స్కీం పనులను మార్చిలోపు పూర్తిచేయాలని కోరారు. -
బోరు బావురు !
ఇష్టారాజ్యంగా తవ్వకం 60 శాతం మంచినీటి బోర్లు ఫెయిల్ అయినా కొత్త బోర్లు మంజూరు పర్సెంటేజీల కోసమే అధికారుల కక్కుర్తి జిల్లా తాగునీటి కోసం రూ.32.91 కోట్లు పాతబకాయిలకే రూ.7.41 కోట్లు బోర్లు వేసిన వారానికే ఎండిపోతున్న వైనం చిత్తూరు: జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు సద్వినియోగం కావడం లేదు. నీటి ఎద్దడిని వ్యాపారంగా చేసుకున్న కొందరు అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు వచ్చిన నిధులు బొక్కుతున్నారు. అధికారులు సైతం తాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వత ప్రణాళికల గురించి ఆలోచించడం మాని నేతలు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. నేతలు అడిగిందే తడవు కొత్త బోరు బావులు మంజూరు చేస్తున్నారు. కొందరు పర్సెంటేజీల కోసమే అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాబోయే వేసవి నిధులను సైతం బొక్కేందుకు అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కలిసి వ్యూహం రచించినట్లు సమాచారం. కొత్త బోర్లకు ప్రతిపాదనలు.. జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి, పూతలపట్టు తదితర నియోజకవర్గాల పరిధిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వేసవి నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం జిల్లాకు ఎన్ఆర్డబ్ల్యూ కింద రూ.8 కోట్ల13 లక్షల 45 వేలు, గ్రామీణ నీటిసరఫరా విపత్తుల నిర్వహణ కింద మరో రూ.24.78 కోట్లు మంజూరు చేసింది. ఇందులో తాగునీటి సరఫరా పాత బకాయిలకు రూ.7.41 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన నిధులను తాగునీటి సమస్య పరిష్కారానికి ఖర్చుచేయాల్సి ఉంది. అధికారులు తాజాగా పలమనేరు, మదనపల్లి, పుంగనూరు, పీలేదు, చిత్తూరు ప్రాంతాల్లో 350 కొత్త బోర్లకు ప్రతిపాదనలు పంపారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు ప్రజల నీటి సమస్య తీర్చడం సంగతి దేవుడెరుగు బోరు బావుల పేరుతో నిధులు బొక్కేందుకు సిద్ధమయ్యారు. వెయ్యి అడుగులు వేసినా పడని నీళ్లు.. కరువు ప్రాంతాల్లో తాగునీటి కోసం తవ్వుతున్న బోరు బావులలో 60 శాతానికి పైగా బోర్లలో నీళ్లు పడడం లేదు. అక్టోబర్‌లో కుప్పం, తంబళ్లపల్లి నియోజకవర్గాలలోనే 229 బోర్లు మంజూరు కాగా, 177 బోర్లు డ్రిల్లింగ్ చేశారు. అయితే 60 శాతం బోర్లలో నీళ్లు పడలేదు. వేయి అడుగుల లోతు వేస్తుండడంతో ఒక్కో బోరుకు లక్షల రూపాయలకు ఖర్చువుతున్నాయి. బోరు బావుల్లో నీళ్లు పడడం లేదని తెలిసినా అధికారులు పర్సెంటేజీల కోసమే కొత్తబోర్లు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా జియాలజిస్టులు పరిశీలించిన తరువాతనే బోర్లు వేయాలి. తాగునీటి సరఫరా శాఖలో జియాలజిస్టులు లేరు. భూగర్భ జలవనరుల శాఖలో ఉన్న జియాలజిస్టులనూ వాడుకోలేదు. స్థానిక నేతల మెప్పు కోసం ఎక్కడంటే అక్కడ బోర్ల తవ్వకం చేపట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులే పేర్కొంటున్నారు. -
మౌలిక వసతులతోనే చిక్కులకు చెక్..!
ఏప్రిల్ నుంచి నగరమే రాష్ట్ర పరిపాలన కేంద్రం అమాత్యులు, అధికారులు ఇక్కడే మకాం తక్షణమే 5 వేల కుటుంబాలూ వస్తాయి.. రోజూ లక్షలాది మంది వచ్చే అవకాశం అందుకనుగుణంగా సదుపాయాలు కల్పించాలి ట్రాఫిక్ సమస్య నివారించాలి పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలి తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాలి విజయవాడ : నగరం నాలుగు నెలల్లోనే నవ్యాంధ్రప్రదేశ్‌కు పరిపాలన కేంద్రం కానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పారు. దీనిపై నగరవాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆనందం ఇలాగే కొనసాగాలంటే పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరాన్ని తక్షణమే అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ట్రాఫిక్ భారీగా పెరిగింది. రానున్న నాలుగు నెలల్లో మరింత పెరుగుతుంది. ప్రస్తుతం తాగునీటి సమస్య కూడా నెలకొంది. నేరాలూ పెరిగాయి. అధికారులకు భవనాలు సమకూర్చడంతోపాటు కీలకమైన ట్రాఫిక్ సమస్యను పరిస్కరించాలి. డ్రెయిన్లు, తాగునీటి కష్టాలు కూడా తలెత్తకుండా చూడాలి. ఈ మేరకు సదుపాయల కల్పనపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ నగర అధికారులతో చర్చించారు. పాలకులు, అధికారులు ఒక్కసారిగా వస్తే అవసరాలు తీర్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య నగరంలో ఇటీవల ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ప్రధాన రోడ్లతోపాటు అంతర్గత రహదారుల్లో సైతం గంటల తరబడి వాహనాలు బారులుతీరుతున్నాయి. దీంతో నిత్యం నగరవాసులు నరకయాతన పడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు జరిగిన సమయంలో హైదారాబాద్ వైపు వెళ్లే వాహనాలను జాతీయ రహదారి నుంచి నగరం మీదుగా మళ్లించాల్సి వస్తోంది. ఆ సమయంలో వన్‌టౌన్‌లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. ఆ ప్రభావం కృష్ణలంక జాతీయ రహదారిపై పడుతోంది. ఎర్రకట్ట, సింగ్‌నగర్ ఫ్లై ఓవర్లపై, రమేష్ ఆస్పత్రి జంక్షన్, నిర్మల కాన్వెంట్ జంక్షన్, ఎన్టీఆర్ సర్కిల్, పశువుల ఆస్పత్రి జంక్షన్లలో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఇలా చేస్తే ట్రాఫిక్ సమస్య నివారించవచ్చు ► గొల్లపూడి బైపాస్ నుంచి సొరంగ మార్గం ద్వారా ఎర్రకట్ట కేదారేశ్వరపేట మీదుగా బీఆర్టీఎస్ రోడ్డులోకి వాహనాలను మళ్లించాలి. మధ్య, పశ్చిమ నియోజకవర్గాలను కలిపే ఎర్రకట్టపై పైప్లైన్ల లీకేజీలను అరికట్టాలి. ► గుణదల వంతెన పనులు పూర్తిచేయాలి. దీనివల్ల నూజివీడు వైపు నుంచి వచ్చే వాహనాలను జాతీయ రహదారిపైకి సులభంగా మళ్లించవచ్చు. తద్వారా సింగ్‌నగర్ ఫ్లై ఓవర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ►నగరం మీదుగా వెళ్తున్న రెండు జాతీయ రహదారులను కలిపేందుకు నిర్మిస్తున్న ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలి. దీని వల్ల నగరంలోకి భారీ వాహనాలు రాకుండా నివారించవచ్చు. ► రోడ్ల విస్తరణ కూడా అత్యవసరం. బందరురోడ్డులో కంట్రోల్ రూం నుంచి ఆటోనగర్ చెక్‌పోస్టు వరకు విస్తరించాలి. గురునానక్ కాలనీ రోడ్డు, పటమటలంక రోడ్డు, పిన్నమనేని పాలిక్లినిక్‌రోడ్డు, టిక్కిల్‌రోడ్డు, ఎన్ఎస్ఎం రోడ్డు, రామలింగేశ్వరనగర్ కట్ట, రామకృష్ణాపురంరోడ్డు, గవర్నమెంట్ ప్రెస్ రోడ్డు, గుణదల నుంచి పడవల రేవు వరకు, గుణదల-పుల్లేటిడొంక రోడ్లు విస్తరించాల్సి ఉంది. చిట్టినగర్ జంక్షన్ నుంచి కాలేశ్వరరావు మార్కెట్ వరకు, రాజగోపాలాచారి వీధి, మ్యూజియంరోడ్డు, బీసెంట్రోడ్డులను విస్తరించాల్సి ఉంది. తాగునీటికి కటకట కృష్ణానది చెంతనే ఉన్నప్పటికీ నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి కొరతతీవ్రంగా ఉంది. సింగ్‌నగర్, రాజీవ్‌నగర్, పాయకాపురం, రాజరాజేశ్వరీపేట పరిదిలోని పలు కాలనీలకు రెండు మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఒక మనిషికి సగటున రోజుకు 150 లీటర్ల నీరు కావాలి. ప్రస్తుతం నగరంలో ఉన్న జనాభాకు రోజూ 15,72,36,000 లీటర్ల నీరు కావాలి ఉంది. నగరపాలక సంస్థ 12,14,52,000 లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. ఇందులో 2,63,84,000 లీటర్ల నీటిని బోర్ల ద్వారా తీస్తున్నారు. కేవలం 60 శాతం మాత్రమే కృష్ణానది ఉపరితల భాగం నుంచి సరఫరా అవుతోంది. ఏప్రిల్ నుంచి మరో 5వేల కుటుంబాలు నగరానికి వస్తాయని అంచనా. వీరితోపాటు సుమారు 3లక్షల మంది నగరానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో మరో 3కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుంది. జనాభాకు ఏడాదికి 2.3 టీఎంసీలు అవసరమని అంచనా వేస్తున్నారు. పరిశ్రమలు, ఇతర అవసరాలకు కలిపి ఏడాదికి 5టీఎంసీలు నీరు నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నీటి కష్టాల నుంచి గట్టెక్కవచ్చు ► ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రతి సంవత్సరం 400 నుంచి 800 టీఎంసీల వరకు నీటిని దిగువకు వదులుతున్నారు. దీనిలో 5 టీఎంసీలను తగిన ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటే నగర ప్రజల నీటి కష్టాలను తొలగించవచ్చు. ► ఆటోనగర్‌లో తాగునీటి అవసరాల కోసం నగరపాలక సంస్థ రూ.53 కోట్లతో గుణదల గంగిరెద్దుల దిబ్బ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌ను త్వరగా పూర్తిచేయాలి. దీనివల్ల ఆటోనగర్‌లో తాగునీటి సమస్యను నివారించవచ్చు. ► రామలింగేశ్వరనగర్, గుణదల ప్రాంతాల్లో ఉన్న వాటర్ప్లాంట్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. ► కొండప్రాంతాల వాసుల అవసరాలు తీర్చేందుకు త్వరగా రిజర్వాయర్లు నిర్మించాలి. వీటికోసం ఇప్పటికే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు రూపొందిస్తున్నారు. కార్యాలయాల సమస్య... నగరంలో ప్రభుత్వ కార్యాలయాల సమస్య తీవ్రంగా ఉంది. గెస్ట్‌హౌస్‌ల కొరత కూడా నెలకొంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా నగరంలోని తమ శాఖల కార్యాలయాల్లోనే క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో భవిష్యత్తులో భవనాల కొరత వల్ల ఒక్కోచోట ఒక్కో కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ► ఇలా చేస్తే మేలు : ఇప్పటికే అందుబాటులో ఉన్న పురాతన భవనాలకు మరమ్మతులు చేయించాలి. ► కేసరపల్లిలోని మేథా టవర్‌తోపాటు నగరం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ సంస్థలను వినిగించుకోవాలి. ► ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలను ముందస్తు ప్రణాళికతో తాత్కాలిక అవసరాలకు షెడ్లు, పార్కింగ్ స్థలాలుగా వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది. ► గెస్ట్‌హౌస్‌లను ఆధునికీకరించాలి. ఉన్న గదులను కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసురావాలి. నేరాలకు అడ్డాగా మారుతోంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నగరంలో నేరాలు పెరిగాయి. ఈ విషయాన్ని పార్లమెంట్‌లోనే ప్రకటించారు. నగరంలో ఇటీవల గన్ సంస్కృతి వచ్చింది. శివారు ప్రాంతాల్లో ఖాళీ భూములను కైవసం చేసుకునేందుకు గ్యాంగ్‌లు బయలు దేరాయి. న్యూ రాజరాజేశ్వరీపేట, సింగ్‌నగర్, పాయకపురం, పెజ్జోనిపేట ప్రాంతాల్లో భూవివాదాలు పెరిగాయి. చెరువులు సైతం కబ్జాకు గురవుతున్నాయి. నేరాలను నియంత్రించేందుకు ఇలా... ► పోలీసు అధికారులు, సిబ్బంది సంఖ్య పెంచి గస్తీని ముమ్మరం చేయాలి. ► కీలకమైన రైల్వేస్టేషన్, బస్టాండ్లలో నిఘా పెంచాలి. ► పాత నేరస్తులపై దృష్టిసారించాలి. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. నగరంలోకి వచ్చే రహదారుల్లో నిఘా ఉంచాలి. కమిషనరేట్ అధికారులు పొరుగు జిల్లాల పోలీసు అధికారులతో సమన్వయం కలిగి ఉండాలి. ఏదైనా ఘటన జరిగితే వెంటనే పొరుగుజిల్లా అధికారులను అప్రమత్తం చేయాలి. వాహనాల నంబరు ప్లేట్ల విషయంలోనూ ప్రత్యేక చర్యలుతీసుకోవాలి. ఇంద్రకీలాద్రిపై.. నిత్యం రద్దీగా ఉండే ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది. వీఐపీలు, వీవీఐపీలు రోజూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా తగిన జాగ్రత్తలుతీసుకోవాల్సి ఉంది. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉంది. ఇలా చేస్తే మేలు.. ► రాజగోపురం నుంచి భక్తులు పైకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి. ► భక్తులు, వీఐపీల కోసం ప్రత్యేకంగా కాటేజీలు నిర్మించాలి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవాటిని వెంటనే పూర్తిచేయాలి. ► కొండ దిగువన ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలి. ► స్నానఘాట్లలో తగిన ఏర్పాట్లు చేయాలి. ► కొండదిగువన, పైనా భద్రతను కట్టుదిట్టంచేయాలి. -
బాబూ.. గుక్కెడు నీళ్లివ్వు!
సాక్షి, చిత్తూరు: సీఎం చంద్రబాబుకు స్వాగతం. మాగోడు నీకు తెలియంది కాదు. అయినా సరే తీరని మా సమస్యలు మరొక్కమారు మీదృష్టికి తెస్తున్నాం. పడమటి ప్రాంతంలోని 36 మండలాల పరిధిలో రోజురోజుకూ తాగునీటి సమస్య పెరుగుతోంది. వానంకాలంలోనూ వేసవి తరహాలో కష్టాలు తప్పడం లేదు. వేలాది బోరుబావులు ఎండిపోయాయి. పంచాయత్లీ, మున్సిపాలిటీల్లో సక్రమంగా నీళ్లివ్వడం లేదు. నీటిసరఫరా పేరుతో వచ్చిన డబ్బులూ వాల్లే తింటుం డరు. ఏమన్నా అంటే నీళ్లే ఇవ్వమంటున్నరు. అది కూడా డిసెంబర్ దాకనే ఇస్తరంట. మల్ల గవర్నమెంటు వాల్లే ఇవ్వాల. మాతో కాదని చెబుతావుండరు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బిందెడు నీళ్లు మూడు రూపాయలు పెట్టి కొంటావుండం. ఇలా ఎన్నాళ్లో తెలియడంలేదు. కడుపునిండా అన్నం తినడం సంగతి దేవుడెరుగు నీళ్లు తాగడమే గగనంగావుంది. అధికారులనడిగితే వర్షాలు లేక వేలబోర్లు ఎండిపోయినయి అంటుండరు. భూగర్భజలాలు లోతుకు పోతాండయని తెలిసినా మన తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇసక అమ్ముకోవడం మానలేదు. అధికారం మనదైనపుడు అధికారులు మాత్రం ఏం చేస్తరు పాపం. అంతకుముందు తొమ్మిదేండ్ల పాటు నిన్ను ముఖ్యమంత్రిని జేసుకున్నం. రాష్టం సంగతి దేవుడెరుగు జిల్లా తాగునీటి సమస్య తీరుతుందిలే అనుకున్నెం. కానీ మా తాగునీటి సమస్య తీరనేలేదు. రోజురోజుకూ వానలూ తగ్గిపోయి నీటిమట్టం పడిపాయ. ఇప్పుడు బోర్లన్నీ వట్టిపోయి పడమటి ప్రాంతం ఎడారిమాదిరై పోతాంది. పంటలులేవు, పైర్లులేవు. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లేకరువాయ. ఇప్పటికే చాలామంది జనం వలసలు పోయిరి. జిల్లా తాగునీటి సమస్య తీరాలంటే హంద్రీ-నీవా, కండలేరు నుంచి నీళ్లు రావాల్సిందే అంటావుండరు. ఈ దఫా ముఖ్యమంత్రిని చేస్తే జిల్లాలో నీటిసమస్య తీరుస్తానని ఎన్నికలముందు మాటిచ్చినవు. ఎన్నన్నా మనోడివి కదా కొంతయినా ప్రేముంటదిలే అని మల్లీ నమ్మి ఓట్లేసినం. నీటి సమస్య తీరుస్తావని ఆశగా ఉన్నం. హంద్రీ-నీవా పూర్తి కావాలంటే * 4,500 కోట్లు అవసరమైతే కేవలం * 750 కోట్లే ఇవ్వడం బాధ కలిగించింది. ఆ డబ్బు కాంట్రాక్టర్ పాతబకాయిలకే సరిపోవంట. ఇక హంద్రీ-నీవాకు నిధులెప్పుడిస్తవు, పనులలెప్పుడు చేయిస్తవు. వాటర్‌గ్రిడ్ సంగతేంది. ఇదంతా జరిగేది కాదన్న అనుమానం తలెత్తుతాంది. ఇక కండలేరు ఊసేలేదు. అప్పుడెప్పుడో మన పెద్దమనిషి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పనులకు టెండర్లు పిలిస్తే వాటినీ నిలిపేశారంట. అసలే మీకు రైతు వ్యతిరేకి అనే పేరుంది. ఈ దఫా అయినా ఆ పేరు పోగొట్టుకుంటావులే అనుకుంటే మల్లీ మొదటికొచ్చావు. రుణమాఫీ సక్రమంగా చేయక అందరినీ మోసగిం చావు. ఒక్కోరైతుకు మూడు వేలు, ఆరు వేలు వచ్చింది. బ్యాంకులు అప్పులివ్వలేదు, మా పంటలకు బీమా రాదంట. ఇక మహిళలకు రుణమాఫీ లేదు, రుణాలు లేవు, పదివేలు ఇస్తానన్న మాట నెరవేర్చలేదు. ఉద్యానవన రైతులనూ మోసగించావు. జిల్లాను మిల్క్జిల్లా చేస్తానన్నావు. డెయిరీల ఏర్పాటన్నావు. వాటికి * 500 కోట్లు అవసరమంట. పైసా ఇవ్వకుండా మిల్క్జిల్లాను ఎలా చేస్తావు? చిత్తూరు నుంచి అటు బెంగుళూరు, ఇటు తిరుపతికి ఫోర్‌లేన్ రోడ్లన్నావు. వీటికి * 3 నుంచి 4 వేల కోట్లు అవసరమంట. అన్నీ మాటలతో కావుకదా..! ఇంకా చాలా వున్నాయి. చిత్తూరుకు మెడికల్‌కాలేజీ కావాలి, స్పెషల్ ఎకనమిక్ జోన్ చేయాలి. ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలి. రైల్వేలైన్ పై ఓవర్‌బ్రిడ్జీలు కావాలి ఇలా.. కానీ నిన్ను నమ్మి ఏదీ అడగలేని పరిస్థితి. ఏదడిగినా కాదనవని తెలుసు. అట్టని చేయవనీ తెలుసు. అవన్నీ ఎందుకులే బాబూ.. ముందు జనానికి గుక్కెడు నీళ్లిచ్చే సంగతి చూడు. జిల్లా ప్రజల గొంతులెండకుండా చూడు. జనం దృష్టిలో మోసగాడిగా మిగలకు. జిల్లాకు చెడ్డపేరు తేకు. - ఇట్లు చిత్తూరు జిల్లా ప్రజలు -
జిల్లాలో భూగర్భజల్లాలు అట్టడుగు స్థాయికి ....
సాక్షి, మంచిర్యాల : ఇంకా చలికాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కానేలేదు. వేసవికి ఇంకా మూడు నాలుగు నెలల సమయం ఉంది. కానీ.. అప్పుడే జిల్లాలో భూగర్భజల్లాలు అట్టడుగు స్థాయికి చేరుతున్నాయి. వేసవికి ముందే వేసవిని గుర్తుచేస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల బోర్లు, బావులు ఎండిపోయాయి. 16 మండలాల్లో పది మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే గతనెల అక్టోబర్ వరకు 14 మండలాల్లో భూగర్భ జలాలు లోతులోకి వెళ్లాయి. ఇది ఆందోళన కలిగించే విషయమేనని భూగర్భ జల శాఖ అధికారులే స్వయానా చెబుతున్నారు. వేసవి ప్రారంభంలోగా రెండు..మూడు మండలాలు మినహా అన్ని మండలాల్లోనూ తాగునీటి సమస్య జఠిలంగా మారే ప్రమాదం ఉందని అంచ నా వేశారు. ముందస్తు చర్యలో భాగంగా యుద్ధప్రాతిపదికన జిల్లాకు రూ.12.20 కో ట్లు అవసరమని ప్రభుత్వానికి ఇటీవల నివేదికలు పంపారు. జిల్లాలో 52 మండలాలుం డగా.. ప్రతినెలా సుమారు 30 మండలాల్లో భూగర్భ జల శాఖ అధికారులు సర్వే చేయ గా ఆసిఫాబాద్, బెల్లంపల్లి, బెజ్జూర్, బోథ్, దహెగాం, దిలావర్పూర్, కాగజ్‌నగర్, కెరమెరి, లోకేశ్వరం, ముథోల్, సారంగాపూర్, తాండూర్, తానూర్ మండలాల్లో నీటి మట్టం భూ ఉపరితలం నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయినట్లు గుర్తించారు. ఖానాపూర్, మందమర్రి, తాంసి, వాంకిడి మండలాల్లో ఎనిమిది మీటర్లకు చేరాయి. ఇప్పటికే 200లకు పైగా ఆవాసాల్లో నీటి సమస్య నెలకొంది. రూ.12.20 కోట్ల పనులకు ప్రతిపాదనలు.. జిల్లాలో దారుణంగా పడిపోయిన భూగర్భ జల మట్టంతో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదం ఉన్నందునా.. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఏర్పడనున్న నీటి ఎద్దడి నివారణకు అత్యవసరంగా రూ.12.20 కోట్లు విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందు లో బావుల లీజు, ట్యాంకుల నీటి సరఫరా కోసం రూ.3.80 కోట్లు కా వాలని నివేదించారు. జిల్లాలో 3,490 తాగునీటి పథకాలుండగా.. అందులో 425 పథకాలు పని చేయడం లేదని వాటి మరమ్మతు, నిర్వహణ కోసం రూ.10.40 కోట్లు అవసరమని ప్రభుత్వాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికే బోర్‌వెల్స్ మరమ్మతు, నీటి ట్రాన్స్‌పోర్టేషన్, బావులు అద్దెకు చర్యలు ప్రారంభించారు. గ్రామాల్లో కాలిపోయిన మోటార్ల మరమ్మతు, కొత్త మోటార్లు, పైప్‌లైన్ లీకేజీ పనులపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21,682 బోర్వెల్లలో సుమారు తొమ్మిది వేల బోర్లు పనిచేయడం లేదు. 13వ ఫైనాన్స్ నిధులు రూ.2.50 లక్షల (మూడు నెలలకోసారి)తో వీటి మరమ్మతు చేయించుకోవాలని ఎంపీడీవోలకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదనలు పంపాం.. - ఇంద్రసేన్, ఎస్ఈ, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ సారి వేసవికి ముందే నీటి సమస్య జఠిలంగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ నెలారంభంలో భూగర్భ జల శాఖ ఇచ్చిన నివేదికలు చూసి మరింత అప్రమత్తమయ్యాం. బావుల లీజు, ట్యాంకుల నీటి సరఫరా కోసం రూ.3.80 కోట్లు, పనిచేయని 425 నీటి పథకాల నిర్వహణకు రూ.10.40 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. నిధులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. -
‘గోదావరి’ నీటి పథకానికి రూ.60 కోట్లు
గజ్వేల్ : గజ్వేల్ నగర పంచాయతీలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి పథకం కింద రూ.60 కోట్లను మంజూరు చేస్తూ ఆర్డీఎంఏ (రీజినల్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) నగర పంచాయతీకి అధికారికంగా లేఖను పంపారు. ఈ మేరకు నగర పంచాయతీ పాలకవర్గం శనివారం ప్రత్యేకంగా సమావేశమై ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యకు తెరదించేందుకు సింగూర్ నుంచి పైప్‌లైన్ ద్వారా ఇక్కడికి నీటిని తీసుకురావాలని తొలుత భావించి. ఇందుకోసం రూ.150 నుంచి 200 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసిన సంగతి తెల్సిందే. అయితే సింగూర్ నుంచి పైప్‌లైన్ ద్వారా నీరు తేవడం వ్యయ భారమే కాకుండా ఈ పథకాన్ని నిరంతరంగా నడపటానికి కోట్ల రూపాయల కరెంట్ బిల్లులను మోయాల్సి వస్తుందని గుర్తించారు. ఈ ప్రాంతం నుంచి జంట నగరవాసుల దాహార్తిని తీర్చడానికి పైప్‌లైన్ ద్వారా పరుగులు పెట్టడానికి సిద ్ధమవుతున్న ‘గోదావరి సుజల స్రవంతి’ పథకాన్ని ట్యాప్ చేస్తే సమస్య పరిష్కారమవుతుందని ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన నేపథ్యంలో ఈ వ్యవహారం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లడం.. ఫలితంగా సీఎం నుంచి ఆదేశాలు వెలువడడంతో అధికారులు పథకానికి అంచనాలు సిద్ధం చేశారు. నిత్యం 40 లక్షల లీటర్ల నీటిని నగర పంచాయతీకి ఈ పైప్‌లైన్ ద్వారా తీసుకురానున్నారు. తొలుత షామీర్పేట ప్రాంతంలో గోదావరి సుజల స్రవంతి పైప్‌లైన్‌ను ట్యాప్ చేయాలని భావించారు. కానీ తిరిగి నగర పంచాయతీ పరిధిలోని లింగారెడ్డిపేట వద్ద ఉన్న పైప్‌లైన్‌ను ట్యాప్ చేస్తే సరిపోతుందనే నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం లింగారెడ్డిపేట పైప్‌లైన్ ట్యాపింగ్‌తో పాటు నగర పంచాయతీలోని నాలుగు చోట్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం, పైప్‌లైన్ విస్తరణ, భూములు సేకరణ తదితర పనుల కోసం ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆర్డీఏంఎ నుంచి నగర పంచాయతీకి లేఖ రావడంతో శనివారం నగర పంచాయతీ పాలకవర్గం చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నేతృత్వంలో సమావేశమై పనులకు ఏకగ్రీవ ఆమోదం పలికింది. తీర్మాన కాపీని ప్రభుత్వానికి అందిన వెంటనే.. తాగు నీటి పథకం పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’కి చైర్మన్ భాస్కర్, కమిషనర్ సంతోష్ కుమార్‌లు ధ్రువీకరించారు. -
గళం విప్పండి !
నేటి నుంచి శాసనసభా పర్వం సమస్యలపై సభ్యులు స్పందించాలి జిల్లావాసిగా సీఎం ఏంచేస్తారో ! ఆశల పల్లకిలో జనం చిత్తూరు టౌన్: జిల్లాకు చెందిన చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఒకరు తొ మ్మిదేళ్లు.. మరొకరు మూడేళ్లకు పైబడి ఉన్నప్ప టికీ జిల్లా అభివృద్ధికి బాటలు పడలేదు. మళ్లీ జిల్లావాసే సీఎం పీఠమెక్కారు. అభివృద్ధికి ఇప్పుడైనా బీజం పడుతుందా? తాగు, సాగునీరుతో పాటు ఉపాధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయాభివృద్ధికి నిధుల వరద పారించి కష్టాల నుంచి గట్టెక్కిస్తారా అని జిల్లా వాసులు బాబుపై కోటి ఆశలతో ఉన్నారు. సభ్యులు అసెంబ్లీలో గళంవిప్పి ప్రధాన సమస్యల పరిష్కారానికి దోహదపడతారని, ముఖ్యంగా రైతు, డ్వాక్రా రుణాలమాఫీపై చర్చించి పరిష్కారమార్గం చూపుతారని ఆశిస్తున్నారు. తీరని తాగునీటి సమస్య జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అధికారుల లెక్కల ప్రకారం 1,222 గ్రామాలు సమస్యను ఎదుర్కొంటుండగా అధికారుల లెక్కల్లోకి రాని గ్రామాలు మరో 500 వరకు ఉన్నాయి. 1,063 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా, 159 గ్రామాల్లో టైఅప్ ద్వారా నీళ్లు అందిస్తున్నారు. అధికారుల లెక్కల్లోకి రాని 500 గ్రామాలు నీటి కోసం అలమటిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు తాగునీటి ఎద్దడి నివారణ కోసం జిల్లా ప్రజాపరిషత్ నుంచి రూ.13కోట్లు, కలెక్టర్ విడుదల చేసిన రూ. 4.48 కోట్లు ఖర్చయిపోయాయి. నష్టాల వ్యవసాయం వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌లో వేరుశెనగ పంట పూర్తిస్థాయిలో సాగు కాలేదు. జిల్లాలో మొత్తం 1.36 లక్షల హెక్టార్లలో సాగవ్వాల్సి ఉన్నప్పటికీ 1.06 లక్షల హెక్టార్లు మాత్రమే సాగయింది. సకాలంలో విత్తు పడకపోవడంతో 50 శాతం కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది జిల్లాకు మంజూరు కావాల్సిన రూ.108 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు విడుదల కాలేదు. పంటల బీమా మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు బీమా కంపెనీలు చెల్లించలేదు. రుణమాఫీపైనే అందరి దృష్టి ఖరీఫ్ మొదలై రెండు నెలలు దాటుతున్నా బ్యాంకర్లు ఇప్పటి వరకు రుణాలు ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులు రుణాలు చెల్లించలేదు. బ్యాంకర్లు బకాయిలు చెల్లించేదాకా కొత్త రుణాలు ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. దీంతో రీషెడ్యూలుకూ దిక్కులేకుండా పోయింది. పెండింగ్ ప్రాజెక్టులు సాగు, తాగునీటి కోసం రూ. 4,076 కోట్లతో చేపట్టిన హంద్రీ-నీవా రెండో దశ పనులు ఇప్పటి దాకా 40 శాతం మాత్రమే పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్లో దీనికి కేటాయింపులు జరగలేదు. లక్ష ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంగా రూ. 450 కోట్లతో చేపట్టిన సోమశిల-స్వర్ణముఖి ప్రాజెక్టు పనులకు భూసేకరణ కూడా పూర్తికాలేదు. అటవీశాఖ క్లియరెన్స్ రాలేదు. పలమనేరు దాహార్తి తీర్చేందుకు రూ.53 కోట్లతో చేపట్టిన వైఎస్ఆర్ జలాశయం (కౌండిన్య ప్రాజెక్టు) పనులు ఆగిపోయాయి. బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్లు ఎత్తిపోతల పథకం, 33 చెరువుల అనుసంధానం పనులు జీవోలకే పరిమితమయ్యాయి. నిధుల కేటాయింపు జరగలేదు. చిత్తూరు తాగునీటి కోసం తీసుకొస్తున్న తెలుగుగంగ ప్రాజెక్టు పని ఇంకా ప్రారంభం కాలేదు. -
పుణేలో తాగునీటికి కటకట
పింప్రి, న్యూస్‌లైన్: వర్షాకాలం మొదలై ఇన్నిరోజులైనా సరైన వర్షాలు కురవకపోవడంతో పుణే నగరంలో తాగునీటి సమస్య మొదలైంది. దీంతో నీటిని బ్లాక్‌లో కొని తాగాల్సిన అగత్యం ఏర్పడుతోంది. అవసరాన్ని బట్టి ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లు ధరలను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నా అడిగే నాధుడే కరువయ్యాడు. నగరంలో నీటి కోతలు విధించడంతో ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కార్పొరేషన్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని కార్పొరేటర్లు, ప్రజలు ఒత్తిడి పెంచుతున్నారు. నగరంలో కార్పొరేషన్ ద్వారా సుమారు 150 ట్యాంకర్లను నడుపుతుండగా, కాంట్రాక్టు పద్ధతిలో కొన్ని వందల సంఖ్యలో ప్రైవేట్ ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నాయి. కార్పొరేషన్‌కు డిమాండ్ మేరకు ట్యాంకర్లను అందించడం సాధ్యం కావడం లేదు. దీంతో నీటిని అందించేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు నీటి సరఫరా బాధ్యతలను అప్పగించారు. కార్పొరేషన్ నిర్ణయించిన ధరల ప్రకారం వీరు రూ.10 వేల లీటర్ల నీటికి రూ.300, 10 నుంచి 15వేల లీటర్లకు గాను రూ.600 వసూలు చేయాల్సి ఉండగా 15 వేల లీటర్ల ట్యాంకు నీటికి డిమాండ్‌ను బట్టి రూ.800 నుంచి 1,500 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కార్పొరేషన్ ప్రస్తుతం పర్వతి, పద్మావతి, నగర్ మార్గం, వడగావ్‌శేరి, ఎన్ఎన్డీటీలతోపాటు మరో ఏడు కేంద్రాల నుంచి నీటిని ట్యాంకర్లకు అందజేస్తోంది. అయితే కాంట్రాక్టర్లు ఈ పాయింట్ల నుంచి కాకుండా బయటి ప్రాంతాల్లో నీటిని నింపుకొని బ్లాక్‌లో అధిక రేటుకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. వడగావ్‌శేరి, లోహ్గావ్, ఖరాడి, విమాన్ నగర్, కాత్రజ్, వార్జే, పౌడ్, పాషాణ్, కొండ్వా, ముండ్వా, హడప్సర్తోపాటు అనేక ఉప నగర పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ట్యాంకర్లకు అధిక డిమాండ్ ఉంది. కార్పొరేషన్ నీటి కేంద్రాలలో ట్యాంకర్లకు జీపీఎస్... నీటిఎద్దడి నేపథ్యంలో దుర్వినియోగాన్ని నివారించేందుకు కార్పొరేషన్ ట్యాంకర్లతోపాటు ప్రైవేట్ ట్యాంకర్లు ఎన్ని పర్యాయాలు నీటిని నింపుకున్నాయని తెలుసుకునేందుకు కార్పొరేషన్ అధికారులు ఆయా కార్పొరేషన్ నీటి సరఫరా కేంద్రాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)ను అమర్చారు. ఈ యంత్రాలు ఉన్న ట్యాంకర్లకు మాత్రమే కార్పొరేషన్ నీటి సరఫరా కేంద్రాల్లోకి అనుమతిస్తోంది. -
గుక్కెడు నీటికి పుట్టెడు కష్టాలు
నార్నూర్, న్యూస్‌లైన్ : మండలంలోని గిరిజన, దళిత గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆయా గ్రామాల్లోని రక్షిత నీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. గ్రామస్తులు కిలో మీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావులు, చెలిమెలను ఆశ్రయిస్తూ రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తున్నా పల్లెల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఇరవై ఏళ్లుగా ఇంతే.. మండలంలోని పిప్రీ గ్రామ పంచాయతీని అధికారులు దత్తత గ్రామంగా ప్రకటించారు. గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క సమస్య పరిష్కరించిన పాపాన పోలేదు. వేసవి కావడంతో ప్రస్తుతం గ్రామస్తులు తాగునీటికి అల్లాడుతున్నారు. వాగులు, చెలిమెల్లోంచి తెచ్చుకున్న నీటిని తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. పిప్రితోపాటు పంచాయతీ పరిధిలోని కొలాంగూడ, అంద్‌గూడ, గోండుగూడ గ్రామాల్లోని గిరిజన కుటుంబాలవారు ఇరవై ఏళ్లుగా తాగునీటికి తిప్పలు పడుతూనే ఉన్నారు. ఏటా ఐటీడీఏ ద్వారా రూ.లక్షలు వెచ్చిస్తున్నా అధికారులు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. అధికారులకు తెలిపినా.. గ్రామంలో ఒక రక్షిత నీటి పథకం, మూడు గూడేలకు కలిపి ఐదు చేతిపంపులున్నాయి. రక్షిత నీటి పథకం నిర్వహణ సరిగా లేక వాటర్ ట్యాంక్ నిరుపయోగమైంది. బిందెడు తాగునీటికి గ్రామస్తులు కిలోమీటర్ల దూరంలోని వాగులు, చెలిమెల వద్దకు వెళ్తున్నారు. మండలంలోని రోమన్కాసా, సాంగ్వి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాగునీటి కోసం మూడు కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఈ గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. గతంలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమంలో అధికారులకు నీటి సమస్య గురించి తెలిపినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా ఏళ్లకేళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు తాగునీటికి నిత్యం పాట్లు పడుతూనే ఉన్నారు. రోగాల పాలవుతున్న జనం.. రక్షిత నీటి పథకాలు పని చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ బావులు, వాగులు, చెలిమే నీళ్లు తాగిన ప్రజలు రోగాల పాలవుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు తరచూ దగ్గు, జలుబుతో బాధ పడుతున్నట్లు స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లోని నీటి వనరులను పరిశీలించి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
సమస్యలు సవాలక్ష
పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. వేసవిలో అయితే మరీ కష్టంగా ఉంటోంది. పైపు లైను లీకేజీలతో నీరు కలుషితమవుతోంది. దీంతో మంచినీరు కొని తాగాల్సి వస్తోంది. పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వాన్నం. కాలువల్లో నీరు సక్రమంగా ముందుకు పారడం లేదు. దీంతో దోమలతో అల్లాడిపోతున్నాం. వేకాదు.. మరెన్నో సమస్యలను సత్తెనపల్లి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. జనాభాకు సరిపడా మంచినీరు సమృద్ధిగా ఉన్నా తరచూ పైపుల లీకేజీల కారణంగా మంచినీరు అందడం లేదు. రూ.14.50 కోట్లతో లక్కరాజుగార్లపాడు రోడ్డులో 120 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసి చెరువు తవ్వించారు. రూ.20.06 కోట్ల యూఐడీఎస్ఎస్ఎంటీ నిధులు, హడ్కో కింద రూ.14 కోట్లు ఖర్చు చేసి రిజర్వాయర్లు, సమ్మర్ స్టోరేజీ, ఫిల్టరేషన్ ప్లాంట్లు, ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించారు. 60 కిలోమీటర్ల వరకు పైపులైను ఏర్పాటు చేశారు. తరచూ పైపులైనుల లీకేజీల కారణంగా నీరు కలుషితమవుతుండటంతో పట్టణ ప్రజలు డబ్బా నీటిని కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి నెలకొంది. శివారు కాలనీలకు ట్యాంకర్ల నీరే గత్యంతరం. పట్టణంలోని అన్ని వార్డుల్లో పందుల స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన రహదారులపైకి కూడా వచ్చి వాహనచోదకులను ఇబ్బందులు పెడుతున్నాయి. వాటి దాడిలో స్థానికులు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. పురపాలక సంఘ పరిధిలో కొన్ని చోట్ల డ్రెయినేజీలు ఆక్రమణలకు గురయ్యాయి. పట్టణం మొత్తం మీద మురుగునీరు పారేందుకు సక్రమమైన వ్యవస్థ లేదు. పారిశుద్ధ్యానికి ఏడాదికి రూ.1.80 కోట్లు పురపాలక సంఘం ఖర్చు చేస్తుంది. రోజుకు 48 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ చేస్తున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు చేర్చాలి. అలాకాకుండా రైల్వేస్టేషన్ రోడ్డులో ఎక్కడపడితే అక్కడ నిల్వ చేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 12వ ఆర్థిక సంఘం నిధులు 1.50 కోట్లు ఖర్చు చేసినా పూర్తిస్థాయిలో డంపింగ్ నిర్మాణం మాత్రం జరుగలేదు.పట్టణంలోని రహదారులను సిమెంటు రోడ్లుగా మార్చారు. కొన్ని చోట్ల సిమెంటు రోడ్లు బీటలు వేసి ఇందులోని రాళ్లు పైకిలేచి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వర్షం వస్తే సత్తెనపల్లి లోతట్టు ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండదు. ప్రధానంగా నాగన్నకుం ట, సుందరయ్య కాలనీ, వెంకటపతి కాలనీ, దోభీ ఘాట్ ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షం కురిసినా వర్షపు నీరు గృహాల్లోకి చేరుతుంది. ఈ సమస్య పరిష్కారానికి స్ట్రామ్‌వాటర్ డ్రెయిన్ నిర్మాణమే మార్గమని భావి ంచినప్పటికీ ప్రతిపాదనలు పంపారే తప్ప ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. పట్టణంలో ఏ వార్డులో చూసినా విద్యుద్దీపాలు సరిగా వెలగక అలంకార ప్రాయంగా ఉంటున్నాయి. ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ పరిస్థితి దాదాపు ఇంతే. మున్సిపాలిటీ నెలకు విద్యుత్‌బిల్లుల కింద రూ.2.10 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. దీని నిర్వహణకు రూ.50 నుంచి రూ.లక్ష వరకు అవుతున్నాయి. ఇదిలా ఉంటే పట్టణంలో లక్కరాజుగార్లపాడు బస్టాండ్‌సెంటర్, ఎఫ్‌సీఐ ప్రాంతాల్లో కొన్ని వీధి దీపాలు నిత్యం వెలుగుతూ విద్యుత్ వృధా అవుతుంది. దీంతో నెలకు రూ.30 వేల విద్యుత్ వృధాగా పోతోంది.సత్తెనపల్లిలో పార్కు ఏరియా అని పేరుంది తప్ప, అక్కడ సేద తీరడానికి పార్కు మాత్రం లేదు. రైల్వేస్టేషన్ రోడ్డులోని చెరువు స్థలం పార్కుగా నిర్మించేందుకు రూ.2.2 కోట్లు ఖర్చు చేశారు. పూర్తిస్థాయిలో పనులు జరుగకపోవడంతో ఇంకా వాడుకలోకి రాలేదు. పట్టణంలో పూర్తిస్థాయిలో బైపాస్ రహదారులు లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 50వేల పైనే వాహనాలు పట్టణంలోకి వచ్చి పోతుండటంతో ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది. కోతుల బెడద ఎక్కువగా ఉంది. పట్టణంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పార్కు ఏరియాలో కోతులు ఇళ్లపైకి గుంపులుగా చేరి దుస్తులు, వస్తువులను తీసుకెళ్లడం, పిల్లలపైకి వచ్చి గాయపర్చడం వంటివి చేస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు. చెత్తను నిర్వహణ సరిగా లేదు.. పట్టణంలో సేకరించిన చెత్తచెదారాన్ని సక్రమంగా డంపింగ్ యార్డుకు పారిశుద్ధ్య కార్మికులు చేర్చడం లేదు. రైల్వేస్టేషన్ రోడ్డులో రహదారి పక్కన పోస్తున్నారు. దీంతో రాకపోకల సమయంలో దుర్గంధం భరించలేకపోతున్నాము.