హమ్మయ్య దాహం తీరింది!
హార్సిలీహిల్స్‌కు 2 కొత్త బోర్ల నుంచి ప్రారంభమైన పంపింగ్
బి.కొత్తకోట: మండలంలోని హర్సిలీహిల్స్‌లో రెండేళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్య ఎట్టకేలకు తీరింది. ఇటీవల వేసిన 2 కొత్తబోర్ల నుంచి నీటి పంపింగ్ ప్రారంభమైంది. దీంతో కొంత దాహం తీరినట్లయింది. ఆదివారం కొత్తబోర్లకు విద్యుత్ సరఫరా ఇవ్వడంతో నీటిని సంపులకు పంపింగ్ చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో సమ స్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. హార్సిలీ కొండకు 7 దశల్లో నీటిని కురబలకోట మండలం గాలేటివారిపల్లె నుంచి పం పింగ్ చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ బ్రిటీష్ పాలకుల హయాంలో నిర్మాణం చేసిం ది. ఈ ప్రాంతంలో టూరిజం శాఖకు చెందిన 7 బోర్లున్నాయి. రెండేళ్లుగా ఆరు బోర్ల నుంచి నీటి పంపింగ్ లేకుండాపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ రైతుల నుంచి నాలుగు బోర్లను లీజుకు తీసుకున్నారు. అయినా నీటి స మస్య తీరలేదు. నీటి సమస్య కారణంగా 10 అతిథి గృహాలను పర్యాటకులకు కేటాయించకుండా నిలిపివేయాల్సి వచ్చింది.
రోజుకు లక్ష లీటర్ల కొరత తీరింది
నిన్నటి వరకు హార్సిలీకొండకు రోజుకు లక్షల నీటి కొరత ఉండేది. ఆదివారం నుంచి ఆ కొరత నుంచి బయపడ్డారు. కొండపై రోజుకు 1.5 లక్షల లీటర్ల నీటి వినియోగం ఉంది. అయితే బోర్లు ఎండిపోవడంతో వేసవికి ముందు రోజుకు కేవలం 40 వేల లీటర్లు, ఇటీవల వరకు 25 వేల లీటర్ల నీళ్లే లభ్యమయ్యేది. ఈ నీరు పర్యాటక శాఖకే సరిపోకపోవడంతో స్థానికులకు, ఇతర శాఖలకు అం దించే వీలులేకపోయింది. ఒక ట్యాంకర్ నీటిని రూ.2 వేలతో కొనుగోలు చేశారు. పర్యాటక శాఖకు నీటినిల్వల కోసం నిర్మించిన 2.4 లక్షల లీటర్ల సామర్థ్యమున్న రెండు సంపులు ఎండిపోయాయి.
ప్రస్తుతం కొత్తగా వేసిన 2 బోర్ల నుంచి నాలుగించుల నీళ్లు లభ్యమవుతున్నాయి. ఇప్పుడు రోజుకు లక్ష లీటర్ల నీటి లభ్యత మొదలైంది. అయితే లక్ష లీటర్ల వినియోగం తగ్గించి 80 వేల లీటర్లే పంపింగ్ అయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. సంపులకు నీటిని నింపేసి, మిగిలిన పంపింగ్ నీటిని అందరికీ సరఫరా చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మారిన నీటి ధరలు
కొండపై నీటి వినియోగంపై కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. గతంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే నీటికి లీటర్‌కు 3పైసలు ఉండగా 10పైసలు పెంచారు. గృహ అవసరాలకు వినియోగించే నీటికి 2 పైసల నుంచి 5 పైసలకు పెంచారు. పెరిగిన ఈ ధరతో పర్యాటక శాఖకు కొంతమేరకు ఆదాయం సమకూరనుంది.