భువనగిరి : అంతరాయం లేకుండా జిల్లా వ్యాప్తం గా విద్యుత్‌ను సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ పి.వెంకన్న అన్నారు. శుక్రవారం భువనగిరిలో వి ద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదా రులు సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నవంబర్ 3న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు వి ద్యుత్ అధికారులకు సహకరించి ప్రతి నెలా బిల్లును నిర్ణీత గడువు లోపు చెల్లించి నాణ్యమైన విద్యుత్‌ను పొందాలన్నారు. రైతులు అసెంబుల్డ్ మోటార్లు, వై ర్లు, ఐఎస్‌ఐ గుర్తు లేనివి వాడొద్దన్నారు.
దీంతో బిల్లు అధికంగా వస్తుందని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర ఫీజులు పోయినప్పుడు మీరు వాటిని సరి చేయడం, ముట్టుకోవడం చేయొద్దని విద్యు త్ డివిజన్ కేంద్రలో 24 గంటలు అందుబాటులో ఫోన్ ఏర్పాటు చేశామని చెప్పారు. 9491065945 నంబర్‌కు సంప్రదించవ చ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐపీడీఎస్ స్కీం భువనగిరి డివి జన్‌కు వచ్చిందన్నారు. దీనిలో భాగంగా పాత విద్యుత్ వైర్లు, స్తంభాలు, విద్యుత్ పరికాలను తొలగించడం జరుగుతుందన్నారు. అనంతరం వినియోగదారులు చెప్పిన సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఏఓ రమణారెడ్డి, డీఈ దుర్గారావు, ఏడీఈ రవీందర్‌రెడ్డి, ఏఈ భిక్షపతి, నాయకులు, వినియోగదారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment