తాగునీటి ఎద్దడిని నివారించండి
మండల కమిటీలు అప్రమత్తంగా ఉండాలి
{Oపెవేట్ బోర్లు అద్దెకు తీసుకోండి
నగరానికి రెండు రోజుల్లో గోదావరి జలాలు తీసుకురావాలి
పశుగ్రాసంపై దృష్టి సారించాలి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
అధికారులతో సమీక్ష సమావేశం
హన్మకొండ : తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ నిధుల కొరత లేదని, ప్రభుత్వం తాగునీటికి ఎంతైనా వెచ్చిస్తుందన్నారు. తాగునీటి సమస్యపై మండల కమిటీలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతివారం మండల స్థాయి కమిటీ సమావేశమై తాగు నీటి పరిస్థితిని సమీక్షించాలన్నారు. గ్రామాల్లో బోర్లు అద్దెకు తీ సుకునే ముందు ఆ బోర్లలో నీటి లభ్యతను అం చనా వేసుకోవాలన్నారు. వరంగల్ నగరంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలని నగర పాల క సంస్థ అధికారులను ఆదేశించారు. దేవాదుల ద్వారా గోదావరి నీటిని పంపింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగానిధులు మంజూరు చేసిం దన్నారు. ఈ పనులు పూర్తి కాకపోవడం పట్ల కడియం అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజు ల్లో పనులు పూర్తి చేసి గోదావరి నీటిని నగరాని కి తీసుకురావాలని మేయర్ నరేందర్, కమిషన ర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. విలీన గ్రా మాలకు ట్యాంకర్ల ద్వారా గానీ, ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకొని గానీ నీటిని సరఫరా చేయూల ని ఆయన సూచించారు. నగరంలో చలి వేంద్రా లు పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. 40 చలి వేంద్రాలు ఏర్పాటు చేశామని కమిషనర్ సర్ఫరాజ్ చెప్పారు. తాగునీటికి కొరత లేదని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కడియం సూచించారు. ఉపాధిహామీ పనులు, పశుగ్రాసం పైనా ప్రతీ వారం సమీక్షించించాలని, పశుగ్రాసానికి ఇబ్బంది కలుగుకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆజ్మీర చందులాల్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ గతంలో అద్దెకు తీసుకున్న బోర్ల బకాయిలు చెల్లించామన్నారు. తాగునీటిపై నియోజకవర్గం ప్రత్యేకాధికారులు సమీక్ష జరుపాలని, సమస్య ఎక్కడుందో అధికారులు తెలుసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారుల్లో ఇంత నిర్లక్షం పనికి రాదని, పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే పదేళ్ళయినా జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణ ం పూర్తికాదని మందలించారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడి గ్రామాలను ఎంపిక చేసి మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. వరంగల్ మహానగర పాలక సంస్ణ మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ నగరంలో తాగునీటిపై ఇప్పటికే ఐదు సార్లు సమీక్షించామని, లీకేజీలు లేకుండా మరమ్మతులు చేశామన్నారు. సీఎం కేసీఆర్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశాల మేరకు గోదావరి నీటిని దేవాదుల ద్వారా పంపింగ్ చేసి నగరానికి రెండురోజుల్లో నీరు అందిస్తామని చెప్పారు. విలీన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, జెడ్పీ సీఈఓ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ రాంచంద్, వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు బి.గంగారాం, డీఆర్‌డీఏ పీడీ వెంకట్‌రెడ్డి, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.