ఆదిలాబాద్: భార్య పోలీసు స్టేషన్‌లో తన మీద ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ మండలం మావాల గ్రామపంచాయతి పరిధిలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన పత్రి రమేష్(35) శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అదనపు కట్నం కోరుతున్నాడని భార్య తనపై కేసు నమోదు చేయడంతో మన స్తాపానికి గురైన రమేష్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.