కరీంనగర్ : కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఏసీటీవో.. ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో మంగళవారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి ఏసీటీవోగా పనిచేస్తున్న స్వతంత్రం అనే అధికారి రూ. 3వేలు లంచం తీసుకుంటుండగా, ముందుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.