బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు | Officials refused to child marriage | Sakshi
Sakshi News home page

బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

Published Wed, Dec 30 2015 1:35 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

Officials refused to child marriage

కరీంనగర్ జిల్లాలో బాల్య వివాహాన్ని అధికార యంత్రాంగం అడ్డుకుంది. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన హనుమాండ్ల జానయ్య, పద్మ దంపతుల కుమార్తె(17)కు హిమ్మత్‌నగర్‌కు చెందిన రాజు అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. వివాహం బుధవారం ఉదయం 11.30గంటలకు జరగాల్సి ఉంది. అయితే, గ్రామానికి చెందిన కొందరు ఆర్డీవోకు సమాచారం అందించారు. ఆయన అప్రమత్తం చేయటంతో త హశీల్దార్ బావూసింగ్, ఎస్సై కిరణ్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని పెళ్లిని ఆపుచేయించారు. వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రెండు గ్రామాల సర్పంచిలతో మాట్లాడి.. బాలికకు మైనారిటీ తీరిన తర్వాతే వివాహం చేసేందుకు అంగీకరింపజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement