పండుటాకుల పాట్లు
జడ్చర్ల: పింఛన్ల కోసం పండుటాకుల పాట్లు ఇవి. మూడు, నాలుగు రోజులుగా పింఛన్ల కోసం వృద్ధులు మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆదివారం మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు.
కొద్దిసేపటి తర్వాత నీరసించి రోడ్డుపైనే పడుకున్నారు. ఎవరూ స్పందించకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయాన్ని విలేకరులు నేరుగా ఫోన్‌లో కలెక్టర్ ప్రియదర్శిని దృష్టికి తీసుకెళ్లగా సోమవారం పింఛన్లు ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు శాంతించి వెనుదిరిగారు.