* ఇంకా నాలుగు రోజులే..
* ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ
* పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే..
నిజామాబాద్ అర్బన్ : ఈనెల 22న టెట్ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ విద్యా కేంద్రాల్లోనే పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నారు. టెట్ పేపర్-1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. 39 సెంటర్లను ఏర్పాటు చేయగా 8,961 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 21,078 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 91 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 91 మంది సెంటర్‌లెవల్ అబ్జర్వర్లు, 91 మంది డిపార్టమెంటల్ ఆఫీసర్లు, 15 మంది రూట్ ఆఫీసర్లు , 275 మంది హాల్ సూపరింటెండెంట్‌లు, 1,036 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పేపర్-1,2 పరీక్షలు రాసే అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఖలీల్‌వాడి పాఠశాలలో సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.
22న టెట్‌కు ఏర్పాట్లు
Published Wed, May 18 2016 2:31 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
Advertisement
Advertisement