నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళా ఉద్యోగి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా అటవీశాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగిని ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్న ఆ అధికారి.. తన మాట విన డం లేదంటూ ఆమెను మానసికంగా దెబ్బతీయడానికి ఇతర అధికారులతో ఆమెకు వివాహేతర సంబం ధం అంటగట్టాడు.
ఆమెపై రాయడానికి వీలు లేని భాషను ఉపయోగిస్తూ కరపత్రాన్ని సైతం రూపొందించా డు. దీనిని జిల్లాలోని అన్ని అటవీ శాఖ డివిజన్లకు, అన్ని జిల్లాలకు పం పించాడు. ఈ వ్యవహారంపై బాధితురాలు నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు అధికారిపై ‘నిర్భయ’ కేసు నమోదు చేశారు.
సదరు అధికారికి కొందరు ఉద్యోగ సంఘ నాయకులు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. కేసు వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తుం డడంపై చర్చ జరుగుతోంది. గతం లో ఆదిలాబాద్‌లో సదరు అధికారి పని చేసిన సమయంలోనూ ఓ మహిళ అతనిపై ఫిర్యాదు చేసిన విషయం వెల్లడైనట్లు తెలుస్తోంది.
అటవీశాఖ ఉద్యోగినిపై లైంగిక వేధింపులు!
Published Thu, May 21 2015 1:16 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement