- కౌంసల్యదేవిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
- ఏడు బృందాలుగా విడిపోరు తనిఖీలు
- దళారులే మింగారని లబ్ధిదారుల ఏకరువు
నర్సింహులపేట : ఇందిరమ్మ ఇళ్ల పథకం లో అక్రమాలపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. నర్సింహులపేట మండలంలోని కౌంసల్యదేవిపల్లి గ్రామంలో అధికారులు శనివారం విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ సారథ్యంలో ఏడు బృందాలు గ్రామంలో కలియతిరిగి తనిఖీ లు నిర్వహించారుు. అధికారులు నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారు నిర్మించుకు న్న, నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించా రు. ఇంటి పొజిషన్, రేషన్‌కార్డు, బిల్లు ఎం తవరకు వచ్చింది, ఎవరైనా మధ్యన ఉండి ఇప్పించారా, మొత్తం బిల్లు వచ్చిందా, సిమెంట్ ఎంత వచ్చిందనే అంశాలపై ఆరా తీశారు. బ్యాంక్ పాసు బుక్కులను సైతం పరిశీలించారు. దళారులు పైరవీలు చేశారని, మొత్తం డబ్బులు ఇవ్వలేదని, అందు కే నిర్మాణాలు పూర్తి చేయలేకపోయామని అధికారులకు లబ్ధిదారులు వివరించారు. గ్రామంలో ఏడుగురుకు పైగా దళారుల పేర్లను లబ్ధిదారులు సీఐడీ అధికారులకు చెప్పిన ట్లు సమాచారం. కాగా, సీఐడీ అధికారులు తనిఖీకి వస్తున్నట్లుగా గ్రామంలో శుక్రవారం దండోరా వేయించారు. అరుునప్పటికీ కొంత మంది ఇళ్లల్లో లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు వారిపై దృష్టిసారించినట్లు తెలిసింది. మండలంలో కౌంసల్యదేవిపల్లితోపాటు పెద్దనాగారంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దళారులతోపాటు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నారుు.
అక్రమార్కులపై చర్యలు తప్పవు..
ఇందిరమ్మ పథకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని సీఐడీ డీఎ స్పీ సంజీవ్‌కుమార్ స్పష్టం చేశారు. విచారణ అనంతరం సాయంత్రం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్హత లేని వారికి, ఊరిలో లేని వారికి, మతిస్థిమితం లేని వారికి , చనిపోయిన వారి పేర్ల మీద, పాత ఇళ్లపై, బినామీ పేర్లపై బిల్లులు కాజేసినట్లు గుర్తించామన్నారు. ఒకే కార్డు, ఒకే అకౌం ట్‌పై రెండు బిల్లులు వచ్చినట్లు కూడా విచారణలో తేలిందని చెప్పారు.
గ్రామం లో 433 ఇళ్లకు.. మొదటిరోజు 172 ఇళ్ల పరిశీలన పూర్తరుుందని, పూర్తి స్థాయిలో వివరాలను సేకరించినట్లు వెల్లడించారు. మిగతా ఇళ్లను మరో రోజు తనిఖీ చేస్తామన్నారు. దళారులే మింగినట్లు చాలా మంది చెప్పారని, సమగ్ర విచారణ అనంతరం అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో సీఐడీ సీఐలు విజయ్‌కుమార్, రాజేంద్రప్రసాద్, మోహన్, కురవి సీఐ కరుణాసాగర్‌రెడ్డి, ఇద్దరు ఎస్సైలు, అ రుగురు హెచ్‌సీలు, హౌసింగ్ ఏఈ రామచంద్రు, ఇద్దరుసూపర్‌వైజర్లు పాల్గొన్నారు.