బియ్యం ఏమాయె? | Open market value of Rs 162 crore | Sakshi
Sakshi News home page

బియ్యం ఏమాయె?

Published Thu, Oct 23 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

బియ్యం ఏమాయె?

బియ్యం ఏమాయె?

* దారి తప్పుతున్న సీఎంపీ వ్యవహారం
* ‘లెవీ’ పెట్టేందుకు ససేమిరా అంటున్న మిల్లర్లు
* వారి వద్దే ఉండిపోయిన రూ.132 కోట్ల బియ్యం
* బహిరంగ మార్కెట్ విలువ రూ.162 కోట్లు
* చోద్యం చూస్తున్న పౌరసరఫరాల శాఖ
* 2014-15 ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ నిబంధనల ప్రకారం ఖరీఫ్, రబీ సీజన్‌లలో ధాన్యం తీసుకున్న రైసు మిల్లర్లు 15 రోజులలో లెవీ రూపంలో ప్రభుత్వానికి బియ్యం చెల్లించాలి.  ఈ రెండు సీజన్‌లలో 3,26,511 మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంపీ కింద తీసుకున్న మిల్లర్లు సెప్టెంబర్ నెలాఖరుకే 2,20,580 మెట్రిక్ టన్నుల బియ్యం లెవీగా చెల్లించాల్సి ఉంది. సోమవారం వరకు 1,74,254 మె.టన్నులు మాత్రమే చెల్లించారు. ఇంకా 46,325 మె.టన్నుల బియ్యం రావాల్సి ఉన్నా పౌరసరఫరాల శాఖ ప్రేక్షకపాత్ర వహి ం చడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌సీఐ రేటు ప్రకారం ఆ బియ్యం విలువ రూ.132 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్‌లో రూ.162 కోట్లు ఉంటుంది. 2013-14 సీఎంపీ లెవీ బియ్యం లక్ష్యం 79 శాతం నెరవేరగా, 21 శాతం మిగిలిపోయింది. ఈ క్రమంలో 2014-15 ఖరీఫ్ ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు ప్రా రంభమయ్యాయి.
 
నిబంధనలు గాలికి
కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ కేటాయింపులలో నిబంధనలను తుంగలో తొక్కి, ఆర్థికంగా తమకు సహకరించే మిల్లర్లకు పెద్ద పీట వేస్తున్నారనడానికి ఈ ఉదంతమే ఉదాహ రణ. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్‌లలో ఇందిరా క్రాంతి పథం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన 3,26,511 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంపీ కింద వివిధ మిల్లులకు కేటాయించారు. ఇందులో 3,23,482 మె.టన్నులు గ్రేడ్-ఎ రకం కాగా, 3,028 మె.టన్నులు కామన్ రకం. రా రైసు మిల్లులు అయితే ఐ దు వేల క్వింటాళ్ల నుంచి పది వేల క్వింటాళ్లు, పారాబాయిల్డ్ మిల్లులు అయితే పది వేల క్వింటాళ్లు, డబుల్ ప్లాంట్లు ఉంటే 20 వేల క్వింటాళ్లు కస్టమ్ మిల్లింగ్ కింద చెల్లించాలని నిబంధనలు చెప్తున్నాయి.

రా మిల్లర్లు 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం చొప్పున పౌరసరఫరాలశాఖ అవసరాల (పీడీఎస్) కోసం లెవీగా చెల్లించాలి. పారాబాయిల్డ్ మిల్లులు 68 కిలోలు ఇవ్వాలి. ధాన్యం మర పట్టించి ఇచ్చినందుకు మిల్లర్లకు క్వింటాళుకు రూ.25 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. మిల్లర్లకు రూపాయి పె ట్టుబడి ఉండదు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలిస్తారు. ఇదేమీ పట్టని అధికారులు, కొందరు మిల్లర్లకు ఇష్టారాజ్యంగా ధాన్యం కేటా యించారు. వారు నిబంధనలతో పని లేకుండా కేంద్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని 25-75 శాతం ఫార్ములాను అమలు చేస్తున్నా రు. ఫలితంగా 25 రోజుల క్రితమే ప్రభుత్వ ఖాతాలోకి చేరాల్సిన బియ్యం బహిరంగ మార్కెట్‌లో మిల్లర్లకు కాసులు కురిపిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ మాత్రం చేష్ట లుడిగి చూస్తోంది.  
 
బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలే కారణం
ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్యం మర ఆడించి లెవీగా చెల్లించాల్సిన కొందరు మిల్లర్లు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు అమ్ముకుంటుండగా, ‘మామూ లు’గా తీసుకుంటున్న అధికారులు వారిపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదు.

‘లెవీ’ చెల్లించే మిల్లర్లు అమ్మే ఇతర బియ్యానికి భారత ఆహార సంస్థ  ఏ గ్రేడు ఐతే క్వింటాళు కు రూ.2,224 , సాధారణ రకమైతే రూ.2,169.90 చొప్పున చెల్లిస్తోంది. రెండు మూడు రోజులలో చెక్కులు అందిస్తోంది. అయితే, ఆశించిన దిగుబడి రాకపోవడంతో బ హిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు అప్పుడే చుక్కలనంటాయి.ఈ నేపథ్యంలో మిల్లర్లు 25 శాతం మాత్రమే లెవీగా పెట్టి 75 శాతం బహిరంగ మార్కెట్‌లో అమ్ముకు ంటున్నారు. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సీఎం పీ బియ్యాన్ని సైతం క్వింటాళుకు రూ.3,500 నుంచి రూ. 4,200 వరకు అమ్ముకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement