Kharif grain
-
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్‌లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్‌లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్‌కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్‌పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్‌గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్
ధాన్యం కొనుగోళ్లన్నీ ఆన్లైన్ లోనే! సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతోపాటు, బిల్లులు కూడా ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై శనివారం పౌర సరఫరాల భవన్లో జిల్లా సరఫరా అధికారులు (డీఎస్ఓ), జిల్లా మేనేజర్ల (డీఎం)తో సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి సేకరించే ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తూ, ఆన్లైన్లో 48 గంటల్లోగా డబ్బులు వారి ఖాతాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు -
సుడిదోమ పోటు
- ఎకరాకు 14 నుంచి 22 బస్తాలతో సరి - భారీగా తగ్గిన దిగుబడులతో రైతుల్లో ఆందోళన - తగ్గిన మద్దతు ధర - సాగు ఖర్చులు కూడా రాని వైనం మచిలీపట్నం : ఖరీఫ్ ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. జిల్లా ప్రణాళిక శాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో దిగుబడుల లెక్కింపు కోసం చేపడుతున్న పంట కోత ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడవుతోంది. ముదినేపల్లి మండలంలో మూడు చోట్ల పంటకోత ప్రయోగం చేయగా ఒక ప్రాంతంలో ఎకరానికి 14 బస్తాలు, మరో ప్రాంతంలో 22, వేరొక ప్రాంతంలో 28, గుడ్లవల్లేరులో 28 బస్తాలు చొప్పున దిగుబడి వచ్చినట్లు ప్రణాళిక శాఖాధికారులు చెబుతున్నారు. సకాలంలో సాగునీటిని విడుదల చేయకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పుతో వరి పొట్టదశ నుంచి సుడిదోమ వ్యాపించడంతో దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. సుడిదోమ నివారణ కోసం ఆస్టాఫ్, ఎస్పేట్, షైన్, ఓసిన్, ఒలారా తదితర రసాయన మందులు రెండు, మూడు కలిపి పిచికారీ చేసినా ఫలితం కనిపించలేదని అంటున్నారు. ఎకరానికి నాలుగు నుంచి ఐదుసార్లు రసాయనాలు పిచికారీ చేశామని, ఒకసారి రసాయనాల పిచికారీకి రూ.1500 చొప్పున ఖర్చయ్యిందని చెబుతున్నారు. సుడిదోమ నివారణకే ఎకరానికి రూ.6 వేల నుంచి రూ.7,500 ఖర్చు చేయాల్సి వచ్చిందని, ఇది అదనపు ఖర్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎకరా సాగుకు రూ.30 వేలు ఖర్చు చేశామని.. 18 నుంచి 20 బస్తాలు కూడా రాకపోవడంతో ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 5.78 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. జిల్లాలో 12.29 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వరి కోతలు ప్రారంభమై కుప్పనూర్పిళ్ల సమయంలో దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మద్దతు ధర లేదు గత ఏడాది 1061, 2067, 2077, 1001, 1010, బీపీటీ 5204 తదితర రకాలను రైతులు సాగు చేశారు. బీపీటీ రకం పాత ధాన్యం ప్రస్తుతం మార్కెట్లో బస్తా రూ.1600గా ఉంది. ప్రస్తుతం ఈ రకం ధాన్యం బస్తా రూ.1,050కి ఇచ్చినా కొనుగోలు చేసేవారే కరువయ్యారు. పొలం నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వరకు తీసుకువెళ్లి మద్దతు ధరకు విక్రయిస్తే.. బస్తాకు రవాణా ఖర్చులు పోను రూ.950 మాత్రమేనని మిగులుతాయని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎకరాకు 20 బస్తాలు చొప్పున దిగుబడి వస్తే రూ.19 వేలు వస్తోందని, సాగు వ్యయం రూ.30 వేల వరకు కాగా, రూ.11 వేలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1061, 2077, 1010, 1001 వంటి రకాలు బస్తా ధాన్యం ధర వెయ్యి రూపాయలుగా ఉందని, దీనిలోనే రవాణా ఖర్చులు తీసేస్తే ఎకరానికి రూ.18 వేలకు మించి రావని పేర్కొంటున్నారు. గతంలో మిల్లర్లు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కన్నా బస్తాకు రూ.100 అదనంగా ధర చెల్లించేవారని, ఈ ఏడాది వారు ఇబ్బడిముబ్బడిగా ధాన్యం కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇష్టమున్నా, లేకపోయినా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాళ్వా పైనా స్పష్టత లేదు ఖరీఫ్ సీజన్లో దిగుబడులు తగ్గడంతో రైతులు దాళ్వా సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్‌లో వచ్చిన నష్టాన్ని దాళ్వాలో వరిసాగు చేసుకుని పూడ్చాలనే ఉద్దేశంతో ఉన్నా ప్రభుత్వం సాగునీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకుండా జాప్యం చేస్తోంది. ఓ వైపు వరికోతలు ఊపందుకున్నప్పటికీ ఎలాంటి ప్రకటనలూ చేయకపోవడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. సముద్ర తీర మండలాల్లోని భూముల్లో అపరాలు పండే అవకాశం లేనందున దాళ్వాకు సాగునీటిని విడుదల చేస్తే వరిసాగు చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. -
బియ్యం ఏమాయె?
* దారి తప్పుతున్న సీఎంపీ వ్యవహారం * ‘లెవీ’ పెట్టేందుకు ససేమిరా అంటున్న మిల్లర్లు * వారి వద్దే ఉండిపోయిన రూ.132 కోట్ల బియ్యం * బహిరంగ మార్కెట్ విలువ రూ.162 కోట్లు * చోద్యం చూస్తున్న పౌరసరఫరాల శాఖ * 2014-15 ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ నిబంధనల ప్రకారం ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం తీసుకున్న రైసు మిల్లర్లు 15 రోజులలో లెవీ రూపంలో ప్రభుత్వానికి బియ్యం చెల్లించాలి. ఈ రెండు సీజన్లలో 3,26,511 మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంపీ కింద తీసుకున్న మిల్లర్లు సెప్టెంబర్ నెలాఖరుకే 2,20,580 మెట్రిక్ టన్నుల బియ్యం లెవీగా చెల్లించాల్సి ఉంది. సోమవారం వరకు 1,74,254 మె.టన్నులు మాత్రమే చెల్లించారు. ఇంకా 46,325 మె.టన్నుల బియ్యం రావాల్సి ఉన్నా పౌరసరఫరాల శాఖ ప్రేక్షకపాత్ర వహి ం చడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌సీఐ రేటు ప్రకారం ఆ బియ్యం విలువ రూ.132 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో రూ.162 కోట్లు ఉంటుంది. 2013-14 సీఎంపీ లెవీ బియ్యం లక్ష్యం 79 శాతం నెరవేరగా, 21 శాతం మిగిలిపోయింది. ఈ క్రమంలో 2014-15 ఖరీఫ్ ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు ప్రా రంభమయ్యాయి. నిబంధనలు గాలికి కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ కేటాయింపులలో నిబంధనలను తుంగలో తొక్కి, ఆర్థికంగా తమకు సహకరించే మిల్లర్లకు పెద్ద పీట వేస్తున్నారనడానికి ఈ ఉదంతమే ఉదాహ రణ. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లలో ఇందిరా క్రాంతి పథం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన 3,26,511 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంపీ కింద వివిధ మిల్లులకు కేటాయించారు. ఇందులో 3,23,482 మె.టన్నులు గ్రేడ్-ఎ రకం కాగా, 3,028 మె.టన్నులు కామన్ రకం. రా రైసు మిల్లులు అయితే ఐ దు వేల క్వింటాళ్ల నుంచి పది వేల క్వింటాళ్లు, పారాబాయిల్డ్ మిల్లులు అయితే పది వేల క్వింటాళ్లు, డబుల్ ప్లాంట్లు ఉంటే 20 వేల క్వింటాళ్లు కస్టమ్ మిల్లింగ్ కింద చెల్లించాలని నిబంధనలు చెప్తున్నాయి. రా మిల్లర్లు 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం చొప్పున పౌరసరఫరాలశాఖ అవసరాల (పీడీఎస్) కోసం లెవీగా చెల్లించాలి. పారాబాయిల్డ్ మిల్లులు 68 కిలోలు ఇవ్వాలి. ధాన్యం మర పట్టించి ఇచ్చినందుకు మిల్లర్లకు క్వింటాళుకు రూ.25 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. మిల్లర్లకు రూపాయి పె ట్టుబడి ఉండదు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలిస్తారు. ఇదేమీ పట్టని అధికారులు, కొందరు మిల్లర్లకు ఇష్టారాజ్యంగా ధాన్యం కేటా యించారు. వారు నిబంధనలతో పని లేకుండా కేంద్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని 25-75 శాతం ఫార్ములాను అమలు చేస్తున్నా రు. ఫలితంగా 25 రోజుల క్రితమే ప్రభుత్వ ఖాతాలోకి చేరాల్సిన బియ్యం బహిరంగ మార్కెట్లో మిల్లర్లకు కాసులు కురిపిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ మాత్రం చేష్ట లుడిగి చూస్తోంది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలే కారణం ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్యం మర ఆడించి లెవీగా చెల్లించాల్సిన కొందరు మిల్లర్లు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు అమ్ముకుంటుండగా, ‘మామూ లు’గా తీసుకుంటున్న అధికారులు వారిపై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదు. ‘లెవీ’ చెల్లించే మిల్లర్లు అమ్మే ఇతర బియ్యానికి భారత ఆహార సంస్థ ఏ గ్రేడు ఐతే క్వింటాళు కు రూ.2,224 , సాధారణ రకమైతే రూ.2,169.90 చొప్పున చెల్లిస్తోంది. రెండు మూడు రోజులలో చెక్కులు అందిస్తోంది. అయితే, ఆశించిన దిగుబడి రాకపోవడంతో బ హిరంగ మార్కెట్లో బియ్యం ధరలు అప్పుడే చుక్కలనంటాయి.ఈ నేపథ్యంలో మిల్లర్లు 25 శాతం మాత్రమే లెవీగా పెట్టి 75 శాతం బహిరంగ మార్కెట్లో అమ్ముకు ంటున్నారు. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సీఎం పీ బియ్యాన్ని సైతం క్వింటాళుకు రూ.3,500 నుంచి రూ. 4,200 వరకు అమ్ముకుంటున్నారు. -
రేపటి నుంచే ధాన్యం కొనుగోలు
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలకు పూనుకుంది. ఆరుగాలం శ్రమించిన రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను, ఇతర ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం సచివాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 286 కేంద్రాల ఏర్పాటు * రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు * పర్యవేక్షణ కోసం అధికారుల నియామకం * గోదాములను సిద్ధం చేసిన పౌరసరఫరాల శాఖ * రైతులను వ్యాపారులు ఇబ్బందులు పెట్టవద్దు * ‘జీరో’ దందాకు పాల్పడితే లెసైన్సులు రద్దు * మార్గదర్శకాలు జారీ చేసిన కలెక్టర్ రొనాల్డ్ రోస్ * మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో సోమవారం నుంచి ఖరీఫ్ ధా న్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మిల్లర్లు, వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారమే ధాన్యా న్ని కొనుగోలు చేయాలని మంత్రి ఈటెల పేర్కొన్నారు. కనీస మద్దతు ధర ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. నిబంధనలను విస్మరించి ‘జీరో’ దందాకు పాల్పడే వ్యాపారులు, వారికి సహకరించే వ్యాపారుల లెసైన్సులు రద్దు చేస్తామన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా, కొనుగోలు కేంద్రాలలో నే ధాన్యం అమ్మేలా తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇప్పటికే ఇందుకోసం చర్యలు తీసకున్న కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఈనెల 20న అన్ని ప్రాం తాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మరోమారు అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కోనుగోలు కేంద్రాలలో వసతులు ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు 286 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం బాన్సువాడలో కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించగా, తక్కిన 285 కేంద్రాలను సోమవారం ప్రారంభించనున్నారు. గతంలో రైతులు ధాన్యం తీసుకుని వచ్చి రెండు మూడు రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఈసారి అలా జరుగకుండా సకాలంలో కొనుగోలు, డబ్బుల చెల్లింపు సాగేలా ‘ఆన్లైన్’ విధానాన్ని ప్రవేశపెట్ట బోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు రూ.54 లక్షలు కేటాయించింది. వీటిని టార్పాలిన్లు, తేమ యంత్రాల కొనుగోలు, కొనుగోలు కేంద్రాలలో కనీస వసతుల కల్పన కోసం ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది రెండో పంటకు ఆస్కారం లేనందున, రైతుల అవసరాలకు 30శాతం పోను ప్రజాపంపిణీ వ్యవస్థకు సరిపోయే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఇదివరకే మిల్లర్లతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ రైతులకు ఇబ్బందులు కలగకుండా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సూచించారు. ఐకేపీ, పీఏసీఎస్ సభ్యులకు శిక్షణ ఈ సీజన్లో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ కోసం డిప్యూటీ తహశీల్దార్లను నియమిం చారు. సంబంధిత ఏరియాలకు చెందిన రెవెన్యూ అధికారులను పరిశీలకులుగా నియమించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వచేసేందుకు నిజామాబాద్, ఆర్మూరు, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో ఉన్న సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములు,మిల్లులలో ఏర్పాట్లు చేశారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ సభ్యులకు కొనుగోలుపై శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. తేమ లేకుండా ధాన్యాన్ని కొనుగోలుకు తర లించేలా కరప్రతాలు ముద్రించి పంపిణీ చేశారు. నిబంధనలు, దళారులతో రైతులకు ప్రతిబంధకాలు కాకుండా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. వరికి మద్దతు ధర పెంపు మోర్తాడ్ : ఖరీఫ్ సీజనులో సాగు చేసిన వరి ధా న్యానికి తెలంగాణ సర్కారు మద్దతు ధరను కొద్ది గా పెంచింది. ‘ఎ’ గ్రేడ్ ధాన్యానికి గతంలో క్విం టాలుకు రూ.1,345 ఉండగా ఇప్పుడు రూ. 55 పెంచి రూ.1,400 ధర నిర్ణయించారు. ‘బి’ గ్రేడ్ ధాన్యానికి రూ.1,310 ఉండగా రూ. 50 పెంచి రూ.1,360 ధర నిర్ణయించారు. వరి సాగుకు ఖ ర్చులు భారీగానే పెరిగాయని, అందుకు అనుగుణంగా మద్దతు ధరను పెంచకపోవడంతో ఆశించినంతగా గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నా రు. మిల్లర్లు ప్రభుత్వానికి లెవీ పెట్టడానికి దొడ్డు రకం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. సన్న రకాలను కొనుగోలు చేసే అవకాశం తక్కువ. ఒకవేళ కొనుగోలు కొనుగోలు చేసినా ‘బి’ గ్రేడ్ ధరనే చెల్లిస్తారు. ప్రభుత్వం సన్న రకాలను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుని, మద్దతు ధరను ఎక్కువగా నిర్ణయిస్తే బాగుండేదని రైతులు భావిస్తున్నారు. గతంలో సన్న రకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. దీంతో సన్న రకం ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు విక్రయించారు. మార్కెట్లో సన్న బియ్యానికి డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు ధాన్యం కొనుగోలు సమయంలో తక్కువ ధరను చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పం దించి సన్న రకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని పలువురు కోరు తున్నారు. -
ఇక ధనధాన్యం
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. నవంబర్ మొదటి వారం నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. జిల్లాలోని 39 మండలాల్లో 160 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పారు. వీటిద్వారా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు..మార్గదర్శకాలను జేసీ సురేంద్రమోహన్ నిర్దేశించారు. ఖమ్మం జెడ్పీసెంటర్: ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ దీనికి తగిన మార్గదర్శకాలను సిద్ధం చేశారు. జిల్లాలో 39 మండలాల్లో 160 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. దీనిలో 70 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 90 ఇందిరా కాంతి పథం (ఐకేపీ) కేంద్రాలున్నాయి. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో మొత్తం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వం అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. డీఆర్డీఏ ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా ఈ ఏడాది లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. గత ఏడాది 39 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. లెవీ విధానంలో 25 శాతం మాత్రమే మిల్లర్లకు కేటాయించడంతో వారు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ప్రజా పంపిణీ అవసరాల దృష్ట్యా అధికంగా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మొదటి వారంలో... నవంబర్ మొదటివారంలో ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుడతారు. వ్యవసాయశాఖ నివేదికల ఆధారంగా తొలుత భద్రాచలం డివిజన్లో ఖరీఫ్ ధాన్యం చేతికి వస్తుంది కాబట్టి ఈ మేరకు ప్రణాళికలు రచించారు. ఇప్పటికే పలుమార్లు ఆయా శాఖల అధికారులతో జేసీ సమీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవంబర్ మొదటివారంలో చర్ల, వెంకటాపురం, సత్యనారాయణపురం, వాజేడు, టీ.కొత్తగూడెం, భద్రాచలంతో పాటు మొత్తం 15 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. పంటచేతికి వచ్చే తీరును బట్టి మిగిలిన కేంద్రాలను ప్రారంభిస్తారు. ఇప్పటికే కొనుగోలుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చడానికి రెవెన్యూ డివిజన్‌కు ఒక కాంట్రాక్టర్‌ను నియమించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 60 మిల్లులకు ధాన్యం తరలించాలని నిర్ణయించారు. గతంలో మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన లెవీ ఇవ్వడంలో అనేక ఉదంతాలు చోటుచేసుకున్నాయి. మిల్లర్ల ఆర్థిక స్థితిగతులు, మిల్లు సామర్థ్యం, గడువులోగా లెవీ బియ్యం అందించే చర్యలను పరిశీలించి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సివిల్ సప్లయీస్ డీటీలను నియమించారు. మద్దతు ధర రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతాంగానికి పలు సూచనలూ చేసింది. గ్రామాల్లో రైతులను చైతన్యవంతం చేసేందుకు, మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు నిర్దేశించిన ప్రమాణాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా అధికారులకు సమాచారం అందించాలని ఫోన్ నంబర్లను సైతం కరపత్రాల్లో ముద్రించారు. నిబంధనలు ఇలా... వంగడము పొడవు, వెడల్పు నిష్పత్తుల ఆధారంగా సాధారణ రకం, గ్రేడ్ ‘ఏ’ రకంగా నిర్ణయిస్తారు. సాధారణ రకం ధర రూ.1, 360, గ్రేడ్ ఏ రకానికి రూ.1,400లుగా నిర్ణయించారు. ఇసుక, మట్టి, రాళ్ళు ఒక శాతం, తాలు, తుప్పరకు ఒక శాతం, చెడిపోయినవి, రంగు మారినవి, మొలకెత్తినవి, పురుగు పట్టినవి ఐదు శాతం, పాలు పోసుకోనివి, కుచించుకున్నవి, ముడుచుకున్న ధాన్యానికి మూడు శాతం, తక్కువ గ్రేడ్ -7 శాతం, తేమ -17 శాతానికి మించకుండా ఉన్నవి మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో నగదు పంపిణీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటలలో నగదు చెల్లించేలా అధికారులు చర్యలు చేపడతున్నారు. ఈ మేరక ఇప్పటి కే ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్లో యాక్సెస్ బ్యాంకు ద్వారా నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టారు. రైతులకు ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా యాక్సెస్ బ్యాంకు ద్వారా రైతుల బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేస్తారు. కొనుగోళ్లకు అన్ని చర్యలు చేపట్టాం: సాంబశివరావు, డీఎం సివిల్ సప్లైస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేం దుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వ్యవసాయశాఖ సూచనల మేరకు నవంబర్ మొదటి వారంలో పంటచేతికి వస్తుందని భావిస్తున్నాం. దీని ప్రకా రం ఇప్పటికే జేసీ సురేంద్రమోహన్ ఆదేశాల మేర కు అన్ని శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి 25 లక్షల గన్నీ బ్యాగ్‌లు అవసరం ఉంటాయి. ఇప్పటికే 10లక్షల సంచులు వచ్చాయి. 15వ తేదీ నాటికి మిగిలినవి వస్తాయి. -
కొనుగోల తప్పదా!
నీలగిరి :ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు మహిళాసంఘాలు వెనుకడుగు వేస్తున్నాయి. కొనుగోళ్ల భారమంతా కూడా సంఘాలు భరించాల్సి రావడమే దీనికి ప్రధాన కారణం. కేంద్రప్రభుత్వం లెవీ సేకరణలో మిల్లుల వాటాను పూర్తిగా తగ్గించిన నేపథ్యంలో ధాన్యం సేకరణ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలపైనే పడింది. అది కాస్తా ఖరీఫ్ సీజన్ నుంచే ప్రారంభంకావడంతో జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. లెవీ మార్పు కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో ఐకేపీ, సహకార కేంద్రాలు రెట్టింప య్యాయి. దీంతో పాటు ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని కూడా పెంచారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల గుత్తాధిపత్యాన్ని నివారించి..పండిన పంటకు రైతుకు పూర్తి మద్దతు చెల్లించే క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం పర్వాలేదనిపించినా ధాన్యం కొనుగోళ్ల విషయానికొచ్చేసరికి ఆర్థికంగా మహిళాసంఘాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. మోయలేని భారం... కొత్త లెవీ మార్గదర్శకాల ప్రకారం మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. మిగిలిన 25 శాతం బియ్యాన్ని ప్రభుత్వం లెవీగా సేకరిస్తుంది. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి బియ్యం మార్కెట్‌ను తమ గుప్పిట్లో పెట్టుకోకుండా నియంత్రించేందుకుగాను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను రెట్టింపు చేసింది. ప్రధానంగా ప్రజాపంపిణీ అవసరాల దృష్ట్యా బియ్యం కొరత రాకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. కానీ ఐకేపీ కేంద్రాలు ధాన్యం కొనేందుకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. కొనుగోలుకు అవసరమయ్యే టార్పాలిన్లు, కాంటాలు, చిన్నత్రాసులు, వరిశుద్ధి యంత్రాలను సంఘాలే కొనుగోలు చేయాలని అధికారులు తేల్చిచెప్పారు. వీటి కొనుగోలుకు అవసరమయ్యే వ్యయాన్ని సంఘాలకు సమకూరే ధాన్యం కమీషన్ నుంచే తీసుకోవాలని చెప్పడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వివిధ సాకులతో ధాన్యం కమీషన్లో అధికారులు కోత విధిస్తున్నారు. తాజాగా కొనుగోలుకు అవసరయ్యే ఖర్చులన్నింటినీ సంఘాలే భరించాలని చెప్పడంతో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సంఘాలు ముందుకు రావట్లేదు. తిరుమలగిరి మండలం జలాల్పురం, తాటిపాముల, ఈటూరు సంఘాలు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయబోమని అధికారులకు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లా కేంద్రంలో మహిళా సంఘాలకు నిర్వహించిన శిక్షణ కు కూడా 40 సంఘాలకు మించి హాజరుకాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్లపైఅధికార యంత్రాంగంలో సందిగ్ధత నెలకొంది. రెట్టింపైన కేంద్రాలు... కిందటేడు ఖరీఫ్ సీజన్లో ఐకేపీ, పీఏసీఎస్‌లు కలిపి మొత్తం 55 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ సీజన్లో కేవలం 56 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో ఐకేపీ ఆధ్వర్యంలో 80, పీఏసీఎస్‌లు 42 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సీజన్లో వరి 1.55 లక్షల హెక్టార్లలో సాగైంది. దీనికిగాను 7.55 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంట్లో ఐకేపీ 75 వేలు, పీఏసీఎస్‌లు 30 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఈ సీజన్లో బీపీటీ బియ్యం (సన్న బియ్యం) దిగుబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొనుగోళ్లు నామమాత్రంగానే ఉంటాయి. కానీ రబీ సీజన్‌కు వచ్చే సరికి మాత్రం నాన్ బిపీటీ బియ్యం కొనేందుకు ప్రభుత్వ సంస్థలు, మిల్లర్లకు మధ్య పోటీ తీవ్రంగానే ఉంటుంది. ఈ విషయమై డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ చిర్రా సుధాకర్ ‘సాక్షి’ తో మాట్లాడుతూ కొనుగోళ్లకు అవసరమయ్యే మౌలిక వసతులను సంఘాలే సమకూర్చుకోవాలన్నారు. ఈ నెల రెండోవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. -
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధమవ్వండి
రాంనగర్ (నల్లగొండ): జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. అందులో 25శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉన్నందున, అందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిం చాలని సూచించారు. జిల్లాలో సుమారు 130 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమయంత్రం, టార్పాలిన్లు, గన్నీ బ్యాగ్స్, కాంటాలు అందుబాటులో ఉంచాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి రోజువారీగా ధాన్యం విక్రయించే రైతుల పేర్లు, టోకెన్స్ పంపిణీ తదితర వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ టోకన్లు పంపిణీ చేసిన తేదీల వారీగానే వారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు సలహాలు, సూచనలు చేయటానికి అడ్వయిజరీ కమిటీలు వేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద నుంచి 24 గంటల్లో అన్లోడ్ చేయాలని, ట్రాన్సుపోర్టు కాంట్రాక్టర్లను త్వరితగతిన ఫైనలైజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, జిల్లా పౌర సరఫరాల అధికారి నాగేశ్వర్రావు, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, డీఆర్డీఏ పీడీ సుధాకర్, ఆర్టీఓ హన్మంతరెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేందర్, సంఘం ప్రతినిధులు మల్లయ్య పాల్గొన్నారు. -
అన్నదాతకు ‘మద్దతు’ ఏదీ?
తెనాలిటౌన్, న్యూస్‌లైన్: తుపానులు, తెగుళ్ల బారి నుంచి తప్పించుకున్న వరి రైతులు మార్కెట్లో ధాన్యానికి ధర లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. ఖరీఫ్ ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా లేక రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఫ్రభుత్వం 75 కిలోల ధాన్యం బస్తాకు ప్రకటించిన మద్దుతు ధర రూ.1150లు కూడా దక్కేలా లేదు. ఖరీఫ్ సీజన్లో సంభవించిన హెలెన్ తుపాను దాటికి నేలకొరిగి, నీట మునిగిన వరి పంటను ఒబ్బిడి చేసుకున్న రైతులు యంత్రాల సాయంతో నూర్పిళ్లు చేశారు. తీరా ధాన్యం ఇంటికి చేరేసరికి ధర లేకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధాన్యం బస్తా రూ.1275-1300 మించి ధర పలకడం లేదు. అయితే ధాన్యం తడిసిందనే సాకు చూపుతూ వ్యాపారులు రైతులతో బేరమాడుతున్నారు. రూ.900-1000కి మించి ధర చెల్లించలేమని చెబుతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని 5.71 లక్షల ఎకరాల్లో అధిక సంఖ్యలో రైతులు బీపీటీ 5204 రకం వరి సాగు చేశారు. గుంటూరు జిల్లాలో 4.91 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలో 80 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇక తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్లో 93,750 ఎకరాల్లో వరి సాగు చేశారు. గత ఏడాది నవంబర్ 21,22 తేదీల్లో వచ్చిన హెలెన్ తుపాను ధాటికి డివిజన్లో 50 వేల ఎకరాలు, జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. పంట దెబ్బతినడంతో తడిసిని ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. నూర్పిళ్ల అనంతరం ఎకరాకు 20-25 బస్తాలకు మించి దిగుబడి రావటం లేదని రైతులు చెబుతున్నారు. కొల్లిపరలో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతు చెంచాల రామిరెడ్డి ఎకరాకు కేవలం 20 బస్తాలే చేతికొచ్చాయని చెప్పారు. 20 బస్తాల చొప్పున కౌలుకు తీసుకున్న రైతు వుయ్యూరు వేమారెడ్డి తన పొలంలో వచ్చిన దిగుబడి కౌలు చెల్లించేందుకు సరిపోయిందన్నారు. చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. తుపాను కారణంగా సగటున ఎకరాకు 7-8 బస్తాల ధాన్యాన్ని కోల్పోయారు. మద్దతు ధర కరువు.. చేతికొచ్చిన ధాన్యానికి మార్కెట్లో మద్దతు ధర కరువైంది. 75 కిలోల బస్తాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1150 వుం డగా, తడిసి నాణ్యత తగ్గిందన్న సాకుతో రూ.900-1000 లకు వ్యాపారులు అడుగుతున్నారు. ఇంటికొచ్చిన ధాన్యాన్ని అమ్మితే కౌల ు చెల్లింపులకే సరిపోతోంది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు అలాగే ఉండిపోతున్నాయి. సొంత భూమి కలిగిన రైతులకు వచ్చిన దిగుబడులు పెట్టుబడి ఖర్చులకు సరిపోతుందని చెబుతున్నారు. పంట తడిసిన కారణంగా వరిగడ్డి దెబ్బతిని అటు పశుగ్రాసానికీ ఇబ్బంది ఏర్పడే ఆస్కారముంది. కౌలు కూడా రాలేదు... మూడు ఎకరాలు కౌలుకు చేశాను. దోమ పోటు వల్ల కొంత, వర్షం వల్ల మరి కొంతపంట దెబ్బతింది. ఎకరాకు 20 బస్తాలు మాత్రమే చేతికి వచ్చాయి. 21 బస్తాలకు కౌలుకు తీసుకున్నా. - ఔతు బసివిరెడ్డి, కౌలు రైతు, కొల్లిపర మద్ధతు ధర ఇవ్వాలి రెండు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. ఎకరానికి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. గత ఏడాది ఎకరానికి 38 బస్తాలు దిగు బడులు వచ్చాయి. ఈ ఏడాది ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రైతును ఆదుకోవాలంటే ప్రభుత్వం బస్తాకు రూ.1800లు మద్దతు ధర ప్రకటించాలి. - ఉప్పాల పెద్ద శివయ్య, కౌలు రైతు, కొల్లిపర -
లక్ష్యానికి దూరం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈ సారి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం చేరేట్టు లేదు. సన్నరకాలకు డిమాండ్ ఉండటం, రైతులు బయట విక్రయిస్తుండటంతో ఐకేపీ, ఐటీడీఏ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కంటే మార్కెట్లో అధిక రేటు వస్తుండటంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేపట్టే కొనుగోళ్లపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఈ ఖరీఫ్‌లో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. దీంతో ఐకేపీ సంఘాలకు కమీషన్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు 37,763 మెట్రిక్ టన్నులే కొనుగోలు ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు జిల్లాలో 90 డీఆర్డీఏ, ఐటీడీఏ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లకు చెందిన అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టారు. అక్టోబర్ 25 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు ప్రభుత్వ మద్దతు ధరపై కొనుగోళ్లు చేపట్టారు. ఎంఎస్పీ ప్రకారం కామన్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1310, గ్రేడ్-ఎ రకం ధాన్యానికి రూ.1345 చెల్లించి కొనుగోలు చేశారు. అయితే 2013-14 యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లాలో 52,016 హెక్టార్లలో వరి సాగవుతుందని భావించారు. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లకు చెందిన 42 మండలాల్లో 46,228 హెక్టార్లలో వరి వేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ మేరకు 2.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని భావించారు. ఆశించిన మేరకు దిగుబడి రాకపోయినా.. దిగుబడిలో 25 శాతం అవసరాలు, ఇతర కారణాలతో విక్రయించే అవకాశం లేనందున, 1.61 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయవచ్చని అంచనా వేశారు. ఈ మేరకు 90 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సోమవారం నాటికి 11,064 మంది రైతుల నుంచి రూ.50.46 కోట్లు చెల్లించి 37,763 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. దీంతో ఈ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు లక్ష్యం చేరడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐకేపీ సంఘాలకు తగ్గనున్న కమీషన్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు వేసిన అంచనాల మేరకు దిగుబడి వచ్చినా.. సన్నరకాలకు బయట మార్కెట్లో అధిక ధర పలుకుతుండటంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా నిర్దేశించిన లక్ష్యం చేరడం కష్టంగా కనిపిస్తోంది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు క్వింటాల్‌కు రూ.1,345 మించకపోగా.. బయట మార్కెట్లో క్వింటాల్‌కు రూ.1500 నుంచి రూ.1800 పలుకుతోంది. దీంతో రైతులు వ్యాపారులు, రైసుమిల్లర్లకు ధాన్యం విక్రయిస్తున్నారు. ఇదిలా వుండగా డీఆర్డీఏ, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోళ్లు సవ్యంగా సాగితే ఐకేపీ సంఘాలకు రూ.3.36 కోట్ల కమీషన్ వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా వేశారు. మహిళ సంఘాలకు గతంలో ధాన్యం కొనుగోలుపై రూ.100కు రూ.1.50 చెల్లించిన ప్రభుత్వం గతేడాది నుంచి రూ.2.50కు పెంచింది. గత ఖరీఫ్‌లో 66,385 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన స్వయం సహాయక సంఘాలు రూ.2.10 కోట్ల కమీషన్ పొందాయి. గత రబీ సీజన్లో 30,510 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.97 లక్షల కమీషన్ తీసుకున్నారు. ఈ సారి స్వయం సహాయక సంఘాల ద్వారా కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా రూ.3.36 కోట్ల మేరకు కమీషన్ పొందే అవకాశం ఉంది. కొనుగోళ్లు గణనీయంగా తగ్గనుండగా కమీషన్ కూడా తగ్గవచ్చని అధికారులు చెప్తున్నారు. -
తాండూరు మార్కెట్లో...అన్నదాత దగా!
తాండూరు, న్యూస్‌లైన్: అన్నదాతల గురించి ఎవరికీ పట్టింపు లేకుండాపోయింది. ఎండకు ఎండి.. వానకు తడిసి ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వ మద్దతు ధర లభించక రైతున్న దగాపడుతున్నా ప్రజాప్రతినిదులు, మార్కెటింగ్ శాఖ అధికారులకు పట్టడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి అన్నదాతలు మౌనంగా రోదిస్తున్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు ధాన్యం (సాధారణ రకం) కొనుగోలు చేసేందుకు కమీషన్ ఏజెంట్లు ససేమిరా అంటున్నారు. మద్దతు ధర చెల్లిస్తే తమకు గిట్టుబాటు కాదనే ధోరణితో కొందరు కమీషన్ ఏజెంట్లు తక్కువ ధర చెల్లిస్తూ అన్నదాతల శ్రమను దోచుకుంటున్నారు. మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధరల బోర్డులు ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులు.. ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. దీంతో యార్డులోని సూచిక బోర్డులకే ‘మద్దతు’ ధరలు పరిమితమయ్యాయే తప్ప తమకు ప్రయోజనం కలగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4,200 క్వింటాళ్ల కొనుగోళ్లు తాండూరు మార్కెట్ యార్డులో గత నెల 10వ తేదీ నుంచి ఖరీఫ్ ధాన్యం క్రయవిక్రయాలు ఆరంభమయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు యార్డులో వివిధ గ్రామాల నుంచి కమీషన్ ఏజెంట్లు 4,200 క్వింటాళ్ల ధాన్యాన్ని (సాధారణ రకం) కొనుగోలు చేశారు. క్వింటాలు ధాన్యానికి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర రూ.1310. కానీ ఇక్కడ ఇప్పటివరకూ రైతులకు మద్దతు ధర దక్కలేదు. సగటు ధర క్వింటాలుకు రూ.1,285! క్రయవిక్రయాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు క్వింటాలు ధాన్యానికి గరిష్టంగా రూ.1,341, కనిష్టంగా రూ.1,220, సగటు (మోడల్) ధర రూ.1,285 ధర మాత్రమే పలికింది. గరిష్ట ధరకు కొద్ది మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తూ, అధికంగా తక్కువ ధర చెల్లిస్తుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సగటు ధర ప్రకారం క్వింటాలుకు సుమారు రూ.25 చొప్పున రైతులు నష్టపోయినట్టు స్పష్టమవుతోంది. అయినా స్థానిక ప్రజాప్రతినిధులు ఏనాడూ మద్దతు ధరలపై, రైతులకు జరుగుతున్న నష్టంపై అడిగిన దాఖలాలు లేవు. ఇక అధికారులైతే తమకు సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో నాణ్యతా ప్రమాణాల పేరుతో ఏజెంట్లు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవచూపి తమకు మద్దతు ధర లభించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.