పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్
ధాన్యం కొనుగోళ్లన్నీ ఆన్‌లైన్ లోనే!
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతోపాటు, బిల్లులు కూడా ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై శనివారం పౌర సరఫరాల భవన్‌లో జిల్లా సరఫరా అధికారులు (డీఎస్‌ఓ), జిల్లా మేనేజర్ల (డీఎం)తో సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి సేకరించే ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తూ, ఆన్‌లైన్‌లో 48 గంటల్లోగా డబ్బులు వారి ఖాతాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు