కందకాల తవ్వకం పనుల్లో గిరిజనులు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనతో పాటు అడవుల పునరుద్ధరణపై అటవీశాఖ చర్యలు చేపడుతోంది. క్షీణించిన అడవులు, బోడి గుట్టలు, బంజరు అటవీ భూముల్లో కందకాలు తవ్వకాల పనులను మొదలుపెట్టింది. వీటి ద్వారా వర్షాకాలంలో వాన నీటిని నిల్వ చేసుకోవటం ఒక లక్ష్యం కాగా, వర్షాభావ పరిస్థితులను తట్టుకో వటంతోపాటు అటవీ పునరుద్ధరణ ద్వారా వన్యప్రాణులకు తగి న ఆవాసం కల్పిస్తూ..ఏడాదంతా వాటికి నీటి లభ్యత ఉండేలా ప్రణాళికలు రూపొందించింది.అడవుల్లో భూగర్భ జలవనరులను వృద్ధి చేసుకోవటం లక్ష్యంగా పనులు చేపడుతూనే.. ప్రస్తుత కరోనా కష్టకాలంలో గిరిజనులకు ఉపాధి హామీ ద్వారా పని కల్పి స్తోంది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అటవీ శాఖ పనులకు అనుసంధానం చేసి ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
వాన నీటిని ఒడిసిపట్టేలా చర్యలు : పీసీసీఎఫ్ ఆర్.శోభ
ఈ ఏడాది వచ్చే ఫలితాలు చూసి వచ్చే వేసవిలో మరిన్ని అటవీ ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపడతామని పీసీసీఎఫ్ ఆర్. శోభ తెలిపారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేలా, వీలున్నంత నీరు భూమిలోకి ఇంకేలా చేయటమే అటవీ శాఖ ప్రయత్నమని తెలి పారు. ప్రస్తుత ఎండాకాలంలో వివిధ జిల్లాల అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న కందకాల తవ్వకం పనులను ఆమె సమీక్షించా రు. ఉపాధి కూలీలకు నీటి వసతి కల్పించటంతో పాటు, భౌతిక దూరం కొనసాగిస్తూ పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు.
గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో సాంకేతిక సమస్యలను అధిగమించాలని సూచించారు. కవ్వాల్ పులుల సంరక్షణ పరిధిలో జన్నారం డివిజన్‌లో వర్షాకాలంలో దాదాపు 80శాతం అటవీ ప్రాం తపు వర్షం నీరు గోదావరిలో కలుస్తోందని, ఈ కారణంగా వర్షాకాలం మినహా మిగతా రోజుల్లో ఇక్కడ నీటి ఎద్దడి ఏర్పడుతోం దని, దీని నివారణకు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తు న నేల, తేమ పరిరక్షణ పనులు (సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్) చేపట్టినట్టు డీఎఫ్‌ఓ మాధవరావు తెలిపారు. జన్నారం పరిధిలోని 14 గ్రామాల్లో గిరిజనులకు వేసవిలో ఉపాధి కల్పించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment