సాక్షి, హైదరాబాద్: మేయర్ బొంతురామ్మోహన్‌ను శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యాలయం విద్యార్థులు కలిశారు. నకిలీ పత్రాలతో యూనివర్శటీ భూములను ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అరికట్టాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... యూనివర్శిటీ ప్రతిష్టను పెంచేందుకు, కబ్జాల నుండి భూములను రక్షించుటకు సమగ్ర ప్రణాళిక అవసరం. యూనివర్శిటికీ సంబంధించిన భూముల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి, దాని బయట వైపు రోడ్డును నిర్మించే ఆలోచన చేస్తాం. దీంతో ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు భూముల రక్షణకు అవకాశం ఉంటుంది.యూనివర్సిటీకి నలువైపులా ఆర్చి గేట్‌లను నిర్మించి, లోపల ఉన్నచెరువులు, పార్కుల సుందరీకరణ చేయాల్సి ఉంది. హాస్టళ్ల నుండి వస్తున్న మురికి నీటిని శుద్దీకరణచేసి చెరువులలోకి పంపుటకు ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. (‘సడలింపులతోనే నగరాల్లో అధిక కేసులు’)
Comments
Please login to add a commentAdd a comment