Mayor bonthu Ram Mohan
-
మేయర్‌ను కలిసిన ఉస్మానియా విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: మేయర్ బొంతురామ్మోహన్‌ను శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యాలయం విద్యార్థులు కలిశారు. నకిలీ పత్రాలతో యూనివర్శటీ భూములను ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అరికట్టాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... యూనివర్శిటీ ప్రతిష్టను పెంచేందుకు, కబ్జాల నుండి భూములను రక్షించుటకు సమగ్ర ప్రణాళిక అవసరం. యూనివర్శిటికీ సంబంధించిన భూముల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి, దాని బయట వైపు రోడ్డును నిర్మించే ఆలోచన చేస్తాం. దీంతో ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు భూముల రక్షణకు అవకాశం ఉంటుంది.యూనివర్సిటీకి నలువైపులా ఆర్చి గేట్లను నిర్మించి, లోపల ఉన్నచెరువులు, పార్కుల సుందరీకరణ చేయాల్సి ఉంది. హాస్టళ్ల నుండి వస్తున్న మురికి నీటిని శుద్దీకరణచేసి చెరువులలోకి పంపుటకు ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. (‘సడలింపులతోనే నగరాల్లో అధిక కేసులు’) -
దెబ్బ తగలని పార్క్
గచ్చిబౌలి: చిన్నారులు చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోతూ ఆడిపాడుతుంటే తల్లిదండ్రులందరికీ ఆనందమే.. అయితే కొంచెం భయం కూడా! ఎక్కడ పట్టుతప్పి పడిపోతారో.. దెబ్బలు తగిలించుకుంటారోనని.. చిల్డ్రన్స్ ప్లే ఏరియాకు వెళ్తే అటువంటి భయం అవసరం లేదు. పిల్లలను స్వేచ్ఛగా, సీతాకోకచిలుకల్లా వదిలేయొచ్చు. నిశ్చింతగా కూర్చుని వారి ఆటలను, ఆనందాన్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఏమిటీ ప్లే ఏరియా? ఎక్కడుంది? జారుడుబండ, ఊయల.. సాధారణంగా పిల్లల పార్కుల్లో ఆటల పరికరాలంటే ఇవే. కానీ, గచ్చిబౌలి డాగ్ పార్కు ఆవరణలో ఏర్పాటైన చిల్డ్రన్స్ ప్లే ఏరియా కాస్త డిఫరెంట్. ఇక్కడ ఆనందాన్నిచ్చే ఆట వస్తువులే కాదు, అటు వ్యాయామాన్ని, ఇటు నైపుణ్యాన్ని పెంచే యాక్టివిటీస్ ఎన్నో.. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, చిన్నారుల భద్రత కోసం ఆట వస్తువుల చుట్టూ అడుగు భాగంలో ఒక రకమైన సింథటిక్ రబ్బర్‌గా పిలిచే ఈపీడీఎం (ఇథలీన్ ప్రొపలీన్ డయనీ మానిమర్)ను అమర్చారు. కాబట్టి పిల్లలు ఆడుకుంటూ పడిపోయినా గాయపడరు. రూ.40 లక్షల వ్యయంతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ పిల్లల ప్లే ఏరియాను రెండు కేటగిరీలుగా విభజించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు చిన్న ఆట వస్తువులు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి పెద్ద ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. దేశంలోనే ఇటువంటి పిల్లల పార్కు ఇదే మొదటిదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. దీనిని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించనున్నారు. ఓపెన్ జిమ్.. సోలార్ లైటింగ్ ►ఈ ప్లే ఏరియాలో చిన్నా, పెద్దా గుట్టలు, స్టెప్పింగ్ స్టోన్స్, మల్టీప్లే ఎక్విప్మెంట్లు ఎన్నో ఉన్నాయి. ఆపిల్, క్యాప్సికమ్, కీరా, టమాటా వంటి పండ్లు, కూరగాయలు, పురుగులు వంటి బొమ్మలు ఆకట్టుకుంటాయి. ►పార్కులో రాత్రి వేళ లైటింగ్ కోసం సోలార్ ఎల్ఈడీ లైట్లను అమర్చారు. పార్క్‌లో నాలుగు వైపులా ఉన్న లైట్లు.. విద్యుత్ లేకున్నా 6 గంటల పాటు బ్యాకప్‌తో వెలుగులు విరజిమ్ముతాయి. పిల్లల ఆనందానికి అంతరాయం కలగదు. ►ఈ పిల్లల పార్కు డాగ్ పార్కులో భాగంగా ఉంది. డాగ్ పార్కుకు పెట్స్‌ను తీసుకొచ్చే పెద్దల కాలక్షేపానికి మూడుచోట్ల ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న వారు ఇక్కడ అప్పర్ బాడీ, కార్డియో, సైక్లింగ్, స్టెప్పర్ వంటి కసరత్తులు చేయొచ్చు. ►సెల్ఫీ ఫొటో ఫ్రేమ్ ప్రత్యేకాకర్షణ. దీనివద్ద పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సెల్ఫీ దిగొచ్చు. ►ఇక్కడున్న బ్లాక్ బోర్డుపై పిల్లలు తాము పార్క్‌ను విజిట్ చేసినట్టు సంతకం చేస్తూ.. పొందిన అనుభూతి గురించి రాయవచ్చు. దేశంలోనే మొదటిది.. ఈపీడీఎంతో ఈ పిల్లల పార్కును తీర్చిదిద్దాం. ఇక్కడ చిన్నారులు చక్కగా ఆడుకోవచ్చు. ఆడుకుంటూ కిందపడినా దెబ్బలు తగలవు. దేశంలోనే ఇటువంటి పార్కు మరెక్కడా లేదు. పెద్దల కోసం ఓపెన్ జిమ్ కూడా ఉంది. – హరిచందన దాసరి, జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ కమిషనర్ ఆటలతో పాటే వ్యాయామం, నైపుణ్యం హిల్ మౌండ్: ఇదో చిన్న గుట్ట. దీనిపైకెక్కి.. కిందికి జారవచ్చు. గుట్టలు ఎక్కిన అనుభూతి కలుగుతుంది. పిల్లల్లో క్లైంబింగ్ స్కిల్స్ పెరుగుతాయి. పిరమిడ్: త్రిభుజాకారంలో ఉండే దీని పైకెక్కి, వెనుక వైపు ఉన్న మెట్ల ద్వారా కిందికి దిగవచ్చు. మంకీ బార్స్: కోతులు చాలా బ్యాలెన్స్డ్గా చెట్లపై వేలాడుతుంటాయి. పిల్లల్లోనూ ఈ నైపుణ్యం పెంచేందుకు మంకీ బార్స్ ఏర్పాటు చేశారు. వీటిపై నిలబడి ఊగడం ద్వారా పిల్లలు పట్టు నిలుపుకునే శక్తిని అలవర్చుకుంటారు. టన్నెల్: ప్లాస్టిక్ గడ్డితో పచ్చగా తీర్చిదిద్దిన సిమెంట్ పైపు ఇది. చిన్నారులు పైపు లోపల నుంచి నడుచుకుంటూ బయటకు రావచ్చు. చిన్న ర్యాంపుపై నుంచి ఈ సిమెంట్ టన్నెల్‌ను ఎక్కేందుకూ ప్రయత్నించవచ్చు. ట్రాంపోలిన్: చిన్నారులు ఎగరడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లే ఏరియాలో రెండు ట్రాంపోలిన్లు ఉన్నాయి. వీటిపై నిల్చుని అప్ అండ్ డౌన్స్ ఎగరొచ్చు. ఈ ప్రక్రియ పిల్లల మోకాళ్లను బలంగా చేస్తుంది. స్నేక్ మౌండ్: ఇది ఎత్తుగా ఉండే పాము బొమ్మ. బ్యాలెన్స్ చేసుకుంటూ దీనిపై చిన్నారులు నడవాల్సి ఉంటుంది. ఇదో మంచి వ్యాయామం. -
కేటీఆర్ బర్త్ డే.. ఆర్భాటాలు బంద్..!
-
కేటీఆర్ బర్త్ డే.. ఆర్భాటాలు బంద్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం 42వ వసంతంలోకి అడుగుపెట్టుబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ఒక పాటను బహూకరించారు. కేటీఆర్ బర్త్‌డే సాంగ్‌ను ఎమ్మెల్యేశంభీపూర్ రాజు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం విడుదల చేశారు. ‘నీలాల మబ్బుల్లో సూర్యుడు.. నువ్వు తెలంగాణ నేల రాముడు’ అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, తన జన్మదినం సందర్భంగా కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కేటీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తి మేరకు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మేయర్ బొంతు రామ్మోహన్ తీసేయించారు. ఇక కేసీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేటీఆర్ అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. తనకు కేటాయించిన శాఖల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. -
బతుకు మట్టిపాలు!
⇒ ఇద్దరు మహిళా కూలీల సజీవ సమాధి ⇒ సెల్లార్లో పని చేస్తుండగా కూలిన మట్టిపెళ్లలు ⇒ మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన హైదరాబాద్: మట్టి పెళ్లలు వారి పాలిట మృత్యువయ్యాయి. సెల్లార్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీద పడటంతో ఇద్దరు మహిళా కూలీలు సజీవ సమాధి అయ్యారు. సోమవారం ఉదయం మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మట్టిపెళ్లలు పడుతున్న విషయాన్ని గమనించి మరో నలుగురు బయటకు పరుగు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. వీరిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా సిరగపురం మండలం బీపేట గ్రామానికి చెందిన దంపతులు పల్లపు పాపయ్య, కిష్టమ్మ(45), కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన ఎ.బాలయ్య అలియాస్ బాల్‌రాజ్, భారతమ్మ(25)తో పాటు శాంతమ్మ, హన్మాండ్లు కొండాపూర్‌లో వంశీరాం కన్స్ట్రక్షన్స్ సంస్థ చేపడుతున్న సెల్లార్లో కూలి పనుల కోసం వచ్చారు. రిటైనింగ్ వాల్‌తోపాటు ప్లింత్భీంల ఏర్పాటు కోసం గ్రానైట్ రాళ్లను కూలీలు మోస్తున్నారు. సోమవారం ఉద యం 9.45 గంటలకు సెల్లార్ తూర్పు వైపున ఒక్కసారిగా కుంగి మట్టి పెళ్లలు విరిగి పడ్డాయి. గ్రానైట్ రాళ్లు మోస్తున్న కిష్టమ్మ, భారతమ్మ ఆ మట్టి పెళ్లలో కూరుకుపోయి తుదిశ్వాస విడిచారు. పాపయ్య, బాలయ్య, శాంతమ్మ, హన్మాండ్లు మట్టి పెళ్లలు విరిగి పడటాన్ని గమనించి బయటకు పరిగెత్తి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్వల్పంగా గాయపడిన పాపయ్య, బాలయ్యను మాదాపూర్‌లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు మాదాపూర్ పోలీసులు మూడు గంటలపాటు శ్రమించారు. పారతో మట్టిని తొలగించి రెండు మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతదేహాలతో బాధిత కుటుంబాలు ధర్నా చేశారు. ఘటనా స్థలాన్ని మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు పరిశీలించారు. బిల్డర్, సైట్ ఇంజనీర్లపై కేసు మూడు సెల్లార్లు, జి ప్లస్ 3 అంతస్తులకు పాటి మహిపా ల్‌రెడ్డి పేరిట జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి అనుమతి ఉందని శేరిలింగంపల్లి సర్కిల్ 11 ఉపకమిషనర్ సురేశ్ రావు తెలిపారు. పనులను వంశీరాం కన్స్ట్రక్షన్స్ చేపడు తోందని, 30 అడుగుల లోతు సెల్లార్ తవ్వారని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి బిల్డర్, సైట్ ఇంజనీర్, సూపర్వైజర్లపై ఐపీసీ 304 పార్ట్ 2 సెక్షన్ కింద కేసు నమో దు చేస్తామని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. రూ.16 లక్షల నష్టపరిహారం: మేయర్ బిల్డర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోందని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొ న్నారు. లేబర్ విభాగం నుంచి రూ.6 లక్షలు, జీహెచ్ ఎంసీ నుంచి రూ.2 లక్షలు బాధిత కుటుంబాలకు అందజేస్తామ ని, బిల్డర్ నుంచి మరో రూ.8 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మరణించిన వారి అంత్యక్రియలకు రూ. 50 వేలు అందజేస్తామని, క్షతగాత్రులకు ఉచితంవైద్యం అంది స్తామని చెప్పారు. ఘటనపై రెండు మూడు రోజుల్లో నివేది క అందించాలని అధికారులను ఆదేశించారు. మట్టి పెళ్లలు కూలి ఇద్దరు మహిళల మృతికి కారణమైన వారిపై క్రిమి నల్ కేసులు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. -
వహ్.. ఢిల్లీ!
► న్యూఢిల్లీలో జీహెచ్ఎంసీ మేయర్, అధికారుల పర్యటన ► మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి ► ఎన్డీఎంసీ చైర్మన్ నరేష్కుమార్, అధికారులతో సమావేశం ► త్వరలో నగరంలో అమలుకు యోచన సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఢిల్లీలో మౌలిక వసతులకు కల్పనకు అక్కడి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూసి జీహెచ్ఎంసీ మేయర్, అధికారులు కితాబునిచ్చారు. దేశంలో వివిధ నగరాల్లో అమలులో ఉన్న మెరుగైన విధానాలను జీహెచ్ఎంసీలో అమలు చేయాలన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఢిల్లీలో అమలవుతున్న సదుపాయాలపై అధ్యయనం చేసేందుకు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, సీసీపీ దేవేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ సురేష్‌కుమార్ తదితరుల బృందం మంగళవారం ఢిల్లీలో పర్యటించింది. ఈ సందర్భంగా వారు ప్రధాన ప్రాంతాల్లోని బస్షెల్టర్లు, పబ్లిక్ టాయ్లెట్లు, బస్‌బేలు, ఫుట్‌పాత్‌ల నిర్వహణ, చెత్త తరలింపు విధానం, మల్టీ లెవెల్ పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. అందంగా తీర్చిదిద్దిన బస్షెల్టర్లు, ఆక్రమణలు లేని ఫుట్‌పాత్‌లు, ఉచితంగా పబ్లిక్ టాయ్లెట్ల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ కార్యాలయంలో ఎన్డీఎంసీ చైర్మన్ నరేష్కుమార్, సెక్రటరీ చెంచల్యాదవ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పారిశుధ్య నిర్వహణ, పౌరసదుపాయాల కల్పన, రెవెన్యూ వసూళ్లు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై నరేష్ కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి అవగాహన కల్పించారు. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రాంచంద్రుడు, ఆస్కి ప్రొఫెసర్ శ్రీనివాసచారి, మేజర్ శివకుమార్, ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
ఏమిటీ నిర్లక్ష్యం?
సిటీబ్యూరో ‘చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేరా..గుంతలు, రోడ్లను కూడా నేనే పరిశీలించి ఆదేశాలు ఇవ్వాలా.. ? నేను (మంత్రి), మేయర్, కమిషనర్ వస్తే తప్ప పనులు చేయరా...’ అంటూ రాష్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడ, గాజులరామారం, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని రహదారుల పనులను పరిశీలించిన ఆయన..తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడలలో రోడ్లపై గుంతలు, వివిధ విభాగాలు ఇష్టారాజ్యంగా చేస్తున్న తవ్వకాలపై మంత్రి సీరియస్ అయ్యారు. అధికారులు, విభాగాల మధ్య సమన్యయ లోపంతోనే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని తేల్చిచెప్పారు. తన పర్యటనతో అధికారుల్లో గుబులు పుట్టించారు. పనులు పూర్తి చేసేందుకు నెలరోజులు పడుతుందని కాంట్రాక్టర్, 15 రోజుల్లో అవుతుందని విద్యుత్ శాఖ ఇంజినీర్లు చెప్పడంతో ‘స్టోరీలు చెప్పొద్దు’ అంటూ హెచ్చరించారు. రెండు పనులు కలిసి నెల అనడంతో ‘కామన్సెన్స్ లేదా..’అంటూ అసహనం వ్యక్తం చేశారు. తవ్వకాలతో తాగునీటి లైన్లు పాడవడంతో దాదాపు 45 రోజులుగా నీరు రావడం లేదని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. మరోచోట గత కొన్ని రోజులుగా మురుగునీటి సమస్య ఉందని ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో భోలక్‌పూర్ ఘటన పునరావృతమవుతుందని మంత్రి హెచ్చరించారు. పనులు పూర్తయ్యేంత వరకు ఒక వర్క్ ఇన్స్పెక్టర్ను అక్కడే ఉంచాలని సూచించారు. హెచ్‌టీ లైన్లు, పైపులైన్లు తదితరమైన వాటికోసం రోడ్లు తవ్వి ఎంతకాలమైనా పనులు పూర్తికాపోవడంతో ప్రజలు పడుతున్న బాధలు చూసి అసహనానికి గురయ్యారు. ఎక్కడి కక్కడే చెత్తకుప్పలు, మట్టిదిబ్బలు, ప్రజలు నడవాల్సిన ఫుట్‌పాత్‌లపై పిచ్చిమొక్కలు కనిపించడంతో తట్టుకోలేకపోయారు. వాటిని ఎప్పటికప్పుడు బాగుచేయవద్దా అని అధికారులను నిలదీశారు. పలు చోట్ల రోడ్ల నాణ్యతపై, గుంతలపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఆరా తీసిన మంత్రి.. పర్యటనలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ సంజయ్గౌడ్ను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఇటీవల ఆయన గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో ఆ వివరాలు కనుక్కొన్నారు. రోడ్ల పరిస్థితిపై గవర్నర్ చేసిన వ్యాఖ్యల గురించి ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక సర్కిల్ అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు. కింది స్థాయి సిబ్బంది, డిప్యూటీ కమిషనర్‌స్థాయి అధికారుల పనితీరు ఏమాత్రం బాగులేద న్నారు. సాక్షాత్తు గవర్నర్ వచ్చి చెప్పినా సమస్యలు పట్టించుకోరా అంటూ అధికారులపై మండిపడ్డారు. అసలే ఇరుకు దారిలో నిత్యం మురగునీరు పారుతుందని, డంపర్బిన్లు నిండిపోతున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు ఈ సందర్భంగా మంత్రికి ఫిర్యాదు చేశారు. వివిధ విభాగాల వారు ఒకరి తర్వాత ఒకరు రోడ్లను తవ్వి వదిలేస్తున్నారని, ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారని, కళ్యాణ్‌నగర్, శ్రీనగర్‌కాలనీల్లో చాలా కాలం క్రితమే రోడ్లను తవ్వి కేబుల్స్ వేసినప్పటికి ఇప్పటికీ పూడ్చలేదని ఫిర్యాదు చేశారు. వివిధ విభాగాల అధికారులు , మెట్రో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మంత్రి పర్యటన ముఖ్యాంశాలు..... ⇒బురదమయంగా మారిన రహదారిపై మంత్రి వస్తున్నాడని తెలియడంతో అధికారులు అప్పటికప్పుడు ఎల్లారెడ్డిగూడ ఎస్బీఐ బ్యాంకు ముందు ఉన్న బురద మట్టిని ఫుట్‌పాత్ మీద వేస్తుండగా మంత్రి గమనించి ఇది పాదచారులకు ఇబ్బంది కాదా అని మందలించారు. ⇒కేబుల్ పనుల తవ్వకాల వల్ల, వర్షం వల్ల ఇక్కడ బురదలో కిందపడి ప్రజలు గాయపడుతున్నా అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానిక డీసీని పిలిచి మందలించారు. రెండు నెలలుగా ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉందని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత సిబ్బంది మరమ్మతులు చేయకపోవడంపై ⇒ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుడు ఎండి. ఉమర్ అనే వ్యక్తి కేటీఆర్ వద్దకు వచ్చి మురుగునీటి సమస్యను ప్రస్తావించారు. ⇒యూసుఫ్‌గూడలో ఒకే రోడ్డులో రెండు వైపులా రోడ్ల తవ్వకాలతో మధ్యలో ఉన్న రోడ్డు గురించి అధికారులతో మంత్రి మాట్లాడారు. రెండు వైపులా తవ్వకాలకు అధికారులు అనుమతులిస్తే మధ్యలో వాహనదారులు చిన్న రోడ్డుపై సర్కస్ ఫీట్లు చేయాలా అంటూ ప్రశ్నించారు. ⇒యూసుఫ్‌గూడ చెక్‌పోస్టులో బస్టాప్‌లో మంత్రి ఆగి ఉన్న ప్రయాణికులతో సంభాషించారు. ఈ సందర్భంగా వారు ఇక్కడ బస్షెల్టర్లేదని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు దృష్టికి తేగా తాత్కాలికంగానైనా వెంటనే షెల్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ⇒ మెట్రోపనుల కోసం యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో కొంత భాగం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి చేరుకున్న కేటీఆర్ అక్కడ పరిస్థితిపై విద్యార్థులతో మాట్లాడారు. ఇంకా పాఠశాలలో గ్రౌండ్ ఉందా, వసతులు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నించారు. ⇒132 కేవీ విద్యుత్లైన్పనులు ఇంకా ఎన్ని రోజులు చేస్తారు. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి రోడ్లపై జనాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రాజెక్టు విభాగం అధికారికి కేటీఆర్ సూచించారు. గాలి వస్తే కరెంట్ ఎందుకు పోతుందని అడిగారు. ⇒ శ్రీనగర్ కాలనీలో మంత్రి వస్తున్నారని తెలిసి కూడా కాంట్రాక్టర్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్‌హోల్ రోడ్డుకు ఎత్తుగా ఉండటంతో ఇలా ఉంటే ఎలా.. అంటూ మండిపడ్డారు. ⇒మొత్తం ఎన్ని రోడ్డు కటింగ్‌లకు అనుమతులిచ్చారు.. ఎన్ని పూర్తయ్యాయి.. మిగతావి ఎప్పుడవుతాయి..పూర్తి సమాచారం అందించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. రూ.5 భోజనం బాగాలేదు...(బాక్సులో) ‘ఇది సాంబారా.. నీళ్లా.. ? కారం ఎక్కువ వేశారు..రచీ పచీ లేదు..ఎలా తినాలి దీన్ని... ’అంటూ స్వయంగా ‘రూ. 5 భోజనం’ తిన్న అనంతరం మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని రూ.5 భోజన కేంద్రంలో నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇక ఇక్కడే రూ. 6 కోట్లతో జరుగుతున్న 6 ఎంఎల్ రిజర్వాయర్ నిర్మాణ విషయంలో కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనుల విషయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేయగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట పర్యటనలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమండలి, విద్యుత్, తదితర శాఖల ఉన్నతాధికారులున్నారు. -
కేసీఆర్ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
అబిడ్స్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని చుడీబజార్ ప్రాంతంలో ఆదివారం నూతనంగా నిర్మించే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులను హోంమంత్రితోపాటు మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... పేద, బడుగు వర్గాల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కూడా పోలీస్‌శాఖ చేస్తున్న కృషి అమోఘమన్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, ఇతర పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్ టీఆర్ఎస్ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు,కార్పొరేటర్లు ముఖేష్‌సింగ్, జి. శంకర్‌యాదవ్, పరమేశ్వరిసింగ్, టీఆర్ఎస్ గోషామహల్ ఇన్చార్జ్ ప్రేమ్‌కుమార్‌ధూత్, రాష్ట్ర నాయకులు నందకిషోర్‌వ్యాస్, సురేష్‌ముదిరాజ్, వినోద్‌యాదవ్, బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు రవీందర్‌సింగ్, లాల్‌సింగ్, కమల్‌సింగ్, రాజుసింగ్, ఆనంద్‌సింగ్, ఆర్వీ మహేందర్ కుమార్, ఆర్. శంకర్‌లాల్ యాదవ్, బెజిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
దశలవారీగా నగరాభివృద్ధి
మీట్ ది ప్రెస్‌లో మేయర్ రామ్మోహన్ సాక్షి, సిటీబ్యూరో: వచ్చేనెల 15వ తేదీనాటికి ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) పనుల్ని ప్రారంభిస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు సీఎం తగిన చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో రోడ్ల పనులకు సంబంధించి రైల్వే, మిలటరీ అధికారులతోనూ సీఎం మాట్లాడారని, పనుల్ని ఏవిధంగా చేపట్టాలనే అంశం, నిధుల సమీకరణపై కూడా వారం రోజుల్లో స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు. రహదారులు, నాలాలు తదితర సమస్యల పరిష్కారానికి ఎక్కడ మంచి విధానాలు ఉన్నా అధ్యయనం చేసి ఆచరిస్తామన్నారు. అవినీతినీ అంతమొందిస్తామన్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యల్ని ఒక్క రోజులోనే పరిష్కరిస్తామని గొప్పలు చెప్పబోమని, దశలవారీగా, క్రమేపీ నగరవాసుల సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘మీట్ దిప్రెస్’లో మేయర్ మాట్లాడారు. సిటిజన్ చార్టర్ మేరకు నిర్ణీత వ్యవధిలో ప్రజలకు సేవలందించేందు కు కృషి చేస్తామన్నారు. త్వరలో ఆన్లైన్లో భవననిర్మాణ అనుమతులు, డిజిటల్ ఇంటినెంబర్లను అందుబాటలోకి తెస్తామని చెప్పారు. టౌన్‌ప్లానింగ్‌లో, ముఖ్యంగా బీఆర్ఎస్లో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని, నిర్ణీత గడువు ముగిశాక నిర్మించిన వాటిని రెగ్యులరైజ్ చేయకుండా ఎన్ఆర్ఎస్ఏ సేవల్ని వినియోగించుకుంటామన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్లిక్ టాయ్లెట్ల ఏర్పాటుకు ప్రజల అభ్యంతరాలతో స్థల సేకరణ కష్టమవుతోందని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. మన్నికగా రహదారులు.. నగర రహదారులు 365 రోజులూ మన్నికగా ఉండేలా తగిన ప్రణాళికతో రోడ్ల పనులు చేపడతామన్నారు. రోడ్లను వేశాక తవ్వకుండా భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ల పనులు పూర్తయ్యాకే రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. నగరం చుట్టుపక్కల ఉన్న నాలుగు రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయినందున ఈసారి నీటి సమస్య తీవ్రంగా ఉందని, 20 టీఎంసీల రిజర్వాయర్ల పనులు పూర్తయితే వచ్చే సంవత్సరానికి నీటి బ్యాంక్ ఉంటుందన్నారు. రోడ్లపై నిలిచిన నీరు ఎప్పటికప్పుడు తొలగిం చేందుకు, నాలాల నిర్మాణం దెబ్బతినకుండా నాలాల్లోని చెత్తను ఎప్పటికప్పుడు తీసివేసేందుకు ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తామన్నారు. శివారు ప్రాంతా ల్లో డ్రైనేజీ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డుల ఆధ్వర్యంలో వెయ్యిప్రాంతాల్లో ఇంకుడుగుంతలు నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి యజమానీ ఇంకుడుగుంత నిర్మించేలా చట్టం తేనున్నట్లు తెలిపారు. జూన్ 2 నాటికి మెట్రో రైలు పట్టాలెక్కేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటున్నామన్నారు. ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఐటీ ఉద్యోగులతో పాటు సెలబ్రిటీలు ఎందరో ముందుకు వచ్చారని, అందరి భాగస్వామ్యంతో దాన్ని విజయవంతం చేస్తామన్నారు. వందరోజుల పనులు 50 నుంచి 60 శాతం పూర్తయ్యాయని, జాబ్‌మేళాల్లో వివిధ కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చాయని పేర్కొన్నారు. -
అంతా తల్లుల దయ..!
సమ్మక్క, సారమ్మల సన్నిధిలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ సిటీబ్యూరో: మేడారం సమ్మక్క, సారలమ్మల దీవెనలతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం మేడారం జాతరకు హాజరైన ఆయన నిలువెత్తు బంగారాన్ని(92 కిలోల బెల్లం)అమ్మవార్లకు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరంగల్జిల్లా బిడ్డ అయిన తాను ముఖ్యమంత్రి కేసీఆర్, మేడారం తల్లుల దీవెనలతోనే గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికయ్యానన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో హైదరాబాద్ నగర మొదటి మేయర్‌గా ఎన్నికైన తాను నగర ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంతోపాటు నగర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గిరిజన సంస్కృతీ,సంప్రదాయాల పరిరక్షణే తమ శాఖ ప్రధానోద్దేశమన్నారు. గిరిజన సంక్షేమశాఖ అధికారిగా అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవార్లకు సోమేశ్‌కుమార్ పూజలు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిలువెత్తు బంగారాన్ని(90కిలోలు) అమ్మవార్లకు సమర్పించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రప్రభుత్వం రూ. 160 కోట్లు విడుదల చేయడంతో మేడారంతోపాటు పరిసర గ్రామాలకూ మౌలికసదుపాయాలు సమకూరాయన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తరపున.. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన జనార్దన్‌రెడ్డి తరపున జీహెచ్ఎంసీ సీపీఆర్ఓ వెంకటరమణ మొక్కులు సమర్పించారు. జనార్దన్‌రెడ్డి బరువు 72 కిలోల బంగారం(బెల్లం) అమ్మవార్లకు సమర్పించారు. -
ప్రియతమ నేతకు ప్రేమతో...
తమ ప్రియతమ నేత, సీఎం కేసీఆర్‌కు బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి, ఆయన సతీమణికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే సీఎం కూడా మేయర్ దంపతులకు పట్టువస్త్రాలు బహూకరించారు. -సాక్షి, సిటీబ్యూరో -
ప్రజా భాగస్వామ్యంతో నగరాభివృద్ధి
మీడియాతో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ♦ సమస్యలన్నీ తెలుసుకున్నాక భావి కార్యాచరణ ♦ కేసీఆర్ ప్రణాళిక.. కేటీఆర్ డెరైక్షన్‌లో పనిచేస్తాం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో 50 ఏళ్లుగా నెలకొన్న సమస్యల పరిష్కారం ప్రజల భాగస్వామ్యం లేనిదే సాధ్యం కాదని జీహెచ్ఎంసీ నూతన మేయర్ బొంతు రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. నగరవాసులు కాలనీలు, బస్తీలవారీగా సంఘాలుగా ఏర్పడి వాటి పరిష్కారానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైదరాబాద్ నగర పరిస్థితులపై అధికారులతో సమీక్షించాక తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మేయర్ రామ్మోహన్ చెప్పారు. సమస్యల స్థాయిని బట్టి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలతో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరి సహకారముంటే అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయవచ్చన్నారు. జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న రూ.5 భోజనం బాగుందని... ప్రస్తుతం 51 కేంద్రాల్లో కొనసాగుతున్న దీనిని 150 కేంద్రాల దాకా పెంచే యోచన ఉందని తెలిపారు. తొలి పని, తొలి సంతకం వంటివి తనకు పట్టవని, ఎప్పుడు ఏది అవసరమైతే అది చేస్తానని రామ్మోహన్ పేర్కొన్నారు. జీహెచ్ఎసీ జనరల్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని పదిహేను, ఇరవై రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎక్కడ తగ్గాలో తెలుసు.. తెలంగాణ కోసం ఓపికతో వేచి చూసిన తమకు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో తెలుసని రామ్మోహన్ వ్యాఖ్యానించారు. విశ్వనగరానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని.. మంత్రి కేటీఆర్ డెరైక్షన్‌లో వాటి వేగం పెరిగేందుకు తమవంతు కృషి చేస్తామని చెప్పారు. అందుకు ప్రజల భాగస్వామ్యం, సహకారం అవసరమన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి నగరానికి నీళ్లు వచ్చినా... ఇంకా అనేక ప్రాంతాల్లో నీటి సమస్య ఉందని, వంద రూపాయల కూలీ వచ్చేవారు కూడా నీటి కోసమే రూ.30 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నై, ముంబై తదితర నగరాలతో పోలిస్తే మన దగ్గర ట్రాఫిక్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, మరింత మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. నగరం చుట్టూ ఏర్పాటు కానున్న 12 మినీ నగరాల (శాటిలైట్ టౌన్‌షిప్స్)తో ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందన్నారు. కలసి ముందుకు సాగుదాం ఉద్యమంలో పనిచేసిన తమకు అతిపెద్ద బాధ్యతలు ఇచ్చారని డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో గల్లీల నుంచి చౌరస్తాల దాకా, పాతబస్తీ నుంచి కొత్త సిటీ దాకా అంతటా సమస్యలు ఉన్నాయని... వాటిని పరిష్కరించేందుకు, అభివృద్ధిపథంలో పయనించేందుకు అందరి సహకారంతో కృషిచే స్తామని చెప్పారు. అందరం కలసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కాగా మీడియాతో మాట్లాడడానికి ముందే బాధ్యతలు చేపట్టిన మేయర్, డిప్యూటీ మేయర్.. జీహెచ్ఎంసీ దగ్గరి రూ.5 భోజన కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ భోజనం చేసి, ఇంటి భోజనంలా బాగుందని ప్రశంసించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన మేయర్, డిప్యూటీ మేయర్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసానిలలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అభినందించారు. సామాన్యులకు పెద్ద బాధ్యతలు కేసీఆర్, కేటీఆర్‌కు తమ గురించి తెలుసుగనకే ఈ బాధ్యతలు అప్పగించారని రామ్మోహన్ పేర్కొన్నా రు. అతి సామాన్య కార్యకర్తలమైన తమకు పెద్ద నగర పగ్గాలను అప్పగించడం సామాన్య విషయం కాదన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో తమ కూ అవకాశం కల్పించారన్నారు. ఒక్కరాత్రిలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే భ్రమ లు కానీ, అలాంటి విధానాలుగానీ తమకు లేవన్నారు.