సంగారెడ్డి(మెదక్‌జిల్లా) : మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టుకు ఒవైసీ సోదరులు వచ్చారు. పటాన్‌చెరు మండలం ముత్తంగి వద్ద జాతీయరహదారి పక్కన ఉన్న మసీదును తొలగించే క్రమంలో అప్పటి కలెక్టర్ అనిల్‌కుమార్ సింఘాల్‌ను దూషించిన కేసుకు సంబంధించి ఎంఐఎం నేతలు జిల్లా కోర్టుకు వచ్చారు.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్‌ఖాన్, మొజంఖాన్‌లు గురువారం ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ ఎన్.వెంకట్‌రామ్ ఎదుట హాజరయ్యారు. కేసు విచారణను మేజిస్ట్రేట్ వచ్చే నెల ఫిబ్రవరి 3కి వాయిదా వేసినట్లు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది నిజామొద్దీన్ తెలిపారు.