నల్లగొండ రూరల్ : గుర్రంపొడు మండలం మక్కపల్లి గ్రామ పంచాయతీ పరిధి పార్లపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుకపై సస్పెన్షన్ వేటు వేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి చంద్రమొహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్న భోజన పథకం అమలులో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిం చారు. ప్రస్తుతం ఆమె అదే మండలంలోని వీటీనగర్ పాఠశాలలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.