పార్లమెంటరీ కార్యదర్శిగా జలగం బాధ్యతలు | Parliamentary Secretary in charge of jalagam | Sakshi
Sakshi News home page

పార్లమెంటరీ కార్యదర్శిగా జలగం బాధ్యతలు

Published Sat, Jan 3 2015 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

పార్లమెంటరీ కార్యదర్శిగా జలగం బాధ్యతలు

పార్లమెంటరీ కార్యదర్శిగా జలగం బాధ్యతలు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులైన టీఆర్‌ఎస్‌కు చెందిన కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకటరావు శుక్రవారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. సహాయ మంత్రి హోదా కలిగిన ఈ పదవి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. వెంకటరావు బాధ్యతలు స్వీకరించడంతో జిల్లాకు చెందిన ఇద్దరు నెలలోపే అమాత్యులుగా బాధ్యతలు స్వీకరించినట్లయింది.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన వెంకటరావును జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిపై అవగాహన కలిగిన వెంకటరావు ఈ హోదాలో పలు కీలక ప్రభుత్వ శాఖలను పర్యవేక్షించే అవకాశం రావడంతో జిల్లా అభివృద్ధి మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ శ్రేణులు అంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement